Home /News /sports /

T20 World Cup: సెమీస్​ బెర్త్​ కోసం హోరాహోరీ పోటీ.. ముందుకెళ్లాలంటే ఏ జట్టు ఏం చేయాలి? తెలుసుకోండి

T20 World Cup: సెమీస్​ బెర్త్​ కోసం హోరాహోరీ పోటీ.. ముందుకెళ్లాలంటే ఏ జట్టు ఏం చేయాలి? తెలుసుకోండి

T20 World Cup 2021

T20 World Cup 2021

T20 World Cup: ఈసారి గ్రూప్​ 1, గ్రూప్​ 2ల్లో ఏ జట్లు సెమీస్​కు వెళ్లే అవకాశం ఉంది? సెమీస్​కు వెళ్లాలంటే ఏ జట్టు ఎంత స్కోర్​ చేయాలి? అనే విషయాలను పరిశీలిద్దాం.

టీ20 వరల్డ్​ కప్ (T20 World Cup 2021 )​లో సూపర్​ 12 స్టేజ్​ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రూప్​ 1, గ్రూప్​ 2ల నుంచి ఏ జట్లు సెమీస్​కు చేరుకుంటుందనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారత్​ ఉన్న గ్రూప్​ 2లో పాకిస్థాన్ ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్​లు నెగ్గి సెమీస్​కు బెర్త్​ ఖరారు చేసుకుంది. ఇక రెండో స్థానం కోసం న్యూజిలాండ్​, భారత్​, ఆఫ్ఘనిస్తాన్​ జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అయితే భారత్​ ఇప్పటికే పాకిస్థాన్​, న్యూజిలాండ్​ మీద ఓడిపోవడంతో సెమీస్​కు వెళ్లే అవకాశాలు సన్నగిల్లాయి. అద్భుతాలు జరిగితే తప్ప భారత్​ సెమీస్​ వెళ్లే అవకాశం లేదు. మరోవైపు, గ్రూప్​2లో రెండో స్థానం కోసం పోటీపడుతున్న న్యూజిలాండ్​కు సెమీస్​కు చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.

గ్రూప్​ 1లో సెమీస్​కు చేరే జట్లపై కూడా అంతే ఆసక్తి నెలకొంది. ఈ గ్రూపులోని ఇంగ్లండ్​ జట్టు వరుసగా నాలుగు విజయాలు సాధించి​ ఇప్పటికే సెమీస్ బెర్త్​ ఖరారు చేసుకుంది. రెండో స్థానంలో కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్​ పోటీపడుతున్నాయి. ​ఈసారి గ్రూప్​ 1, గ్రూప్​ 2ల్లో ఏ జట్టు సెమీస్​కు వెళ్లే అవకాశం ఉంది? సెమీస్​కు వెళ్లాలంటే ఏ జట్టు ఎంత స్కోర్​ చేయాలి? అనే విషయాలను పరిశీలిద్దాం.

* గ్రూప్ 1

గ్రూప్​ 1లో నుంచి సెమీ-ఫైనల్స్​కు మొత్తం రెండు జట్లు చేరుకుంటాయి. ఇప్పటికే ఇంగ్లండ్​ సెమీస్​కు బెర్త్​ ఖరారు చేసుకోగా.. సెమీస్​కు వెళ్లే మరో జట్టుపై ఆసక్తి నెలకొంది. ఏ టీం అయినా సెమీస్​కు చేరుకోవాలంటే కనీసం ఆరు నుంచి గరిష్టంగా 10 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.

ఇంగ్లాండ్

మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. దీంతో గ్రూప్1లో సెమీస్​ బెర్త్​ ఖరారు చేసుకుంది. ఆడిన నాలుగు మ్యాచ్​లు గెలిచి+ 3.183 పాజిటివ్​ రన్​ రేట్​తో దూసుకుపోతుంది. ఇప్పడు సెమీస్​కు చేరే రెండో జట్లు కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండింటి మధ్య పోటీ నెలకొంది.

ఆస్ట్రేలియా

గ్రూప్​ 1 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్​లలో మూడు మ్యాచ్​లు నెగ్గి సెమీస్​కు చేరుకోవడంతో ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం ఆరు పాయింట్లతో +1.031 రన్​రేట్​తో దూసుకుపోతుంది. సెమీస్​కు చేరుకోవాలంటే వెస్టిండీస్​తో జరిగే మ్యాచ్​లో నెగ్గాల్సి ఉంటుంది.

దక్షిణాఫ్రికా

గ్రూప్​ 1 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్​లలో మూడు మ్యాచ్​లు నెగ్గి సెమీస్​ ఆశలు పదిలం చేసుకుంది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఆరు పాయింట్లు, + 0.742 రన్​రేట్​తో దూసుకుపోతుంది. అయితే, సెమీస్​ ఆశలు బలపడాలంటే ఇంగ్లండ్​తో జరిగే మ్యాచ్​ నెగ్గాల్సి ఉంటుంది.

శ్రీలంక

గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో శ్రీలంక నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన మొత్తం ఐదు మ్యాచ్​లలో రెండు మ్యాచ్​లు మాత్రమే నెగ్గి మూడు కోల్పోయింది. తద్వారా నాలుగు పాయింట్లు మాత్రమే సాధించింది. ప్రస్తుతం -0.269 నెగెటివ్​ రన్​రేట్​తో పోరాడుతోంది. దీంతో సెమీస్​ ఆశలు దాదాపు సన్నగిల్లినట్లేనని చెప్పవచ్చు. అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక సెమీస్​కు వెళ్లే అవకాశం లేదు.

వెస్టిండీస్

డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ గ్రూప్​ 1 పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్​లలో ఒక మ్యాచ్​ మాత్రమే నెగ్గి మూడు మ్యాచ్​లను కోల్పోయింది. దీంతో రెండు పాయింట్లు మాత్రమే సాధించి –1.557 నెగెటివ్​ రన్​రేట్​తో కొనసాగుతోంది. ఆరంభంలోనే ఇంగ్లండ్‌పై ఘోరంగా ఓడిపోయింది. కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై ఎనిమిది వికెట్ల ఓటమితో ఓటమి పాలైంది. దీంతో, వారి సెమీస్​ ఆశలు మరింత దెబ్బతిన్నాయి. అయితే, సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడానికి శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే రెండు గేమ్‌లను గెలవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఆస్ట్రేలియాతో గెలవడం అంత ఈజీ పనికాదు. సెమీ-ఫైనల్‌లో చోటు కోసం ఆసీస్ గట్టిగా పోరాడుతోంది.

బంగ్లాదేశ్

గ్రూప్​ 1 పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్​ చివరి స్థానంలో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్​లలో ఒక్క మ్యాచ్​ కూడా నెగ్గలేదు. తద్వారా సున్నా పాయింట్లతో -2.383 నెగెటివ్​ రన్​రేట్​తో కొనసాగుతోంది. దీంతో టీ20 వరల్డ్​ కప్​ సెమీస్​కు అర్హత సాధించలేకపోయింది.

* గ్రూప్​ 2

గ్రూప్ 2లో నుంచి సెమీస్​కు మొత్తం రెండు జట్లు చేరుకుంటాయి. ఇప్పటికే పాకిస్థాన్​ సెమీస్​ బెర్త్ ఖరారు చేసుకోగా.. సెమీస్​కు వెళ్లే మరో జట్టుపై ఆసక్తి నెలకొంది. ఏ టీం అయినా సెమీస్​ చేరుకోవాలంటే కనీసం 4 నుంచి 8 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.

పాకిస్థాన్

గ్రూప్​2లో ఆడిన నాలుగు మాచ్​లు గెలిచిన పాక్.. సెమీస్​ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఎనిమిది పాయింట్లు సాధించి +1.065 NRR రన్​రేట్​తో దూసుకుపోతుంది. ఈ జట్టు.. గ్రూప్​ 1 నుంచి సెమీస్​కు చేరిన ఇంగ్లండ్​తో సెమీస్​లో తలపడనుంది.

ఆఫ్ఘనిస్తాన్

గ్రూప్​ 2 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్​లలో రెండు మ్యాచ్​లు నెగ్గి సెమీస్​కు ఆశలు సజీవం చేసుకుంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లు సాధించి, +1.481 NRR పాజిటివ్​ రన్​రేట్​తో దూసుకుపోతుంది. సెమీస్​కు చేరుకోవాలంటే ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్​పై విజయం సాధించాల్సి ఉంటుంది.

న్యూజిలాండ్

గ్రూప్​ 2 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్​లలో రెండు మ్యాచ్​లు నెగ్గి +0.816 NRR పాజిటివ్​ రన్​రేట్​తో కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లు సాధించింది. సెమీస్​కు చేరాలంటే నమీబియా, ఆఫ్ఘనిస్తాన్​పై గెలవాల్సి ఉంటుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్​ బెర్త్​ ఖాయమనే చెప్పవచ్చు.

టీమిండియా

టీ 20 వరల్డ్​ కప్​పై భారీ ఆశలు పెట్టుకున్న భారత్​.. ఈసారి ఆశించిన మేర రాణించడం లేదనే చెప్పాలి. పాకిస్తాన్, న్యూజిలాండ్​తో జరిగిన మొదటి రెండు మ్యాచ్​లు ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత ఆఫ్గనిస్థాన్​తో భారీ విజయం సాధించింది సెమీస్​ ఆశలు పదిలం చేసుకుంది. ప్రస్తుతం గ్రూప్​2 పాయింట్ల పట్టికలో +0.073 పాజిటివ్​ రన్​రేట్​తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్​ సెమీస్​కు చేరాలంటే స్కాట్లాండ్​, నమీబియా టీంలతో గెలవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : అయ్యో.. కోహ్లీ ఉద్యోగం పాయె.. టీ-20లతో పాటు వన్డే ఫార్మాట్ కు కొత్త కెప్టెన్..!

నమీబియా

గ్రూప్​ 2 పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్​లలో ఒక మ్యాచ్​ మాత్రమే నెగ్గింది. తద్వారా కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. నమీబియా ప్రస్తుతం -1.600 NRR రన్​రేట్​తో కొసాగుతోంది. దీంతో, సెమీస్​కు చేరే అవకాశం లేదనే చెప్పవచ్చు. అయితే, న్యూజిలాండ్, ఇండియా మీద గెలిస్తే సెమీస్​ ఆశలు పదిలం చేసుకోవచ్చు. కానీ, ఈ రెండు జట్లపై నమీబియా గెలవడం అంత సులభమైన విషయం కాదు. ఏదేమైనప్పటికీ నమీబియా సెమీస్​కు చేరేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : హాఫ్ సెంచరీ, ఐదు వికెట్లతో దుమ్మురేపిన అనుష్క శర్మ.. కోహ్లీపై బీసీసీఐ సెటైర్..!

స్కాట్లాండ్

గ్రూప్​ 2 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్​లు ఓటమి పాలై సెమీస్​ ఆశలు చేజార్చుకుంది. స్కాట్లాండ్ ICC T20I ర్యాంకింగ్​లో 14వ స్థానంలో ఉంది. జీరో పాయింట్లతో -2.645 NRR నెగెటివ్​ రన్​ రేట్​తో కొనసాగుతోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Afghanistan, Australia, Cricket, England, New Zealand, South Africa, T20 World Cup 2021, Team india

తదుపరి వార్తలు