హోమ్ /వార్తలు /క్రీడలు /

Chris Gayle : ఆటకు యూనివర్శల్ బాస్ అల్విదా..! ఆ మెరుపులు ఇక చూడలేమా..?

Chris Gayle : ఆటకు యూనివర్శల్ బాస్ అల్విదా..! ఆ మెరుపులు ఇక చూడలేమా..?

Chris Gayle ( PC : ICC)

Chris Gayle ( PC : ICC)

Chris Gayle : ఈ మ్యాచ్‌లో ఔటైన త‌ర్వాత క్రిస్ గేల్ మైదానం నుంచి వెళ్తూ త‌న బ్యాట్‌ను స్టేడియంలోని ప్రేక్ష‌కుల వైపు ఎత్తి చూపాడు. దీంతో అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప‌లికిన‌ట్లు తెలుస్తుంది.

  టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచులోనూ డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ (West Indies) చేతులేత్తేసింది. ఈ మెగా టోర్నీని హాట్ ఫేవరేట్ గా ప్రారంభించిన విండీస్ కేవలం ఒక్క విజయంతో ఇంటి బాట పట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లో వెస్టిండీస్, ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్ విధించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్ (David Warner) సూపర్ ఇన్నింగ్స్ తో మరో విక్టరీని తమ ఖాతాలో వేసుకుని సెమీస్ రేస్ లో ముందు నిలిచింది కంగారూ టీమ్. డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 పరుగులు.. 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో చెలరేగాడు. అయితే, విండీస్ డేంజరస్ బ్యాటర్ క్రిస్ గేల్ (Chris Gayle) ఈ మ్యాచ్ ద్వారా ఆటకు అల్విదా చెప్పినట్లు తెలుస్తోంది.అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు అధికారికంగా ప్రకటించకపోయినా.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌ అతని కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా అర్థమవుతుంది.

  ఈ మ్యాచ్‌లో ఔటైన త‌ర్వాత క్రిస్ గేల్ మైదానం నుంచి వెళ్తూ త‌న బ్యాట్‌ను స్టేడియంలోని ప్రేక్ష‌కుల వైపు ఎత్తి చూపాడు. దీంతో అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప‌లికిన‌ట్లు తెలుస్తుంది. హెల్మెట్ తీసేసిన గేల్‌.. త‌న చేతిలో ఉన్న బ్యాట్‌ను ప్రేక్ష‌కుల వైపు చూపిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్ దిశ‌గా వెల్లాడు. ఫీల్డ్ నుంచి వెళ్లిన గేల్‌కు త‌న జ‌ట్టు స‌భ్యులు అభినందనలు తెలిపారు.ఆండ్రీ రస్సెల్‌, డ్వేన్ బ్రావో యూనివర్స్ బాస్‌ను హత్తుకోవడం.. ఆ తర్వాత తన గ్లోవ్స్‌పై సంతకం చేసి అభిమానులకు ఇవ్వడం టీవీ కెమెరాల్లో కనిపించింది. అంతేకాకుండా కెమెరా ముందుకు వచ్చి థాంక్యూ ఫ్యాన్స్‌ అంటూ గట్టిగా అరిచాడు. తన చేష్టలతో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆటకు గుడ్ బై చెప్పినట్లు క్రిస్ గేల్ హింట్ ఇచ్చాడు.

  ఈ మ్యాచ్‌లో గేల్ అద్భుత‌మైన స్టార్ట్ ఇచ్చాడు. విచిత్రంగా స‌న్‌గ్లాస్‌లు పెట్టుకుని గ్రౌండ్‌లోకి దిగిన గేల్‌.. రెండు భారీ సిక్స‌ర్ల‌తో ఆశ‌లు రేపాడు. ఇక విండీస్‌కు భారీ స్కోర్‌ను అందిస్తాడ‌నుకున్న స‌మ‌యంలో గేల్ 15 ర‌న్స్ చేసి బౌల్డ‌య్యాడు. ఇక క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడని అతనికి క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.

  అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క్రిస్ గేల్ 19,593 ర‌న్స్ చేశాడు. వాటిల్లో 553 సిక్స‌ర్లు ఉన్నాయి. అన్ని ఫార్మాట్ల‌లో కలిపి అత్య‌ధిక సంఖ్య‌లో సిక్స‌ర్లు కొట్టిన ఏకైక క్రికెట‌ర్‌గా క్రిస్ గేల్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా గేల్‌ చరిత్రలో నిలిచిపోయాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను విండీస్‌ గెలవడంలో గేల్‌ కీలకపాత్ర పోషించాడు.

  ఇది కూడా చదవండి : బ్లాక్ కలర్ లెహంగాలో దేవకన్యలా సచిన్ కూతురు.. సారా అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే..

  ఇప్పటికే వన్డే, టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన గేల్‌కు టీ20ల్లో ఘనమైన రికార్డు ఉంది. తన కెరీర్‌లో 452 టీ20 మ్యాచ్‌లాడిన గేల్‌ 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అందులో 87 హాఫ్‌ సెంచరీలు.. 22 సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో వెయ్యికి పైగా సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్‌గా గేల్‌ చరిత్ర సృష్టించాడు. ఇక, డ్వేన్ బ్రావో సైతం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో జరుగుతున్న ఈ మ్యాచే తన కెరీర్‌లో చివరిదిగా పేర్కొన్నాడు. దీంతో, ఒకే మ్యాచ్ లో ఇద్దరు దిగ్గజాలు ఆటకు వీడ్కోలు పలికారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chris gayle, T20 World Cup 2021, West Indies

  ఉత్తమ కథలు