T20 World Cup 2021 : మూడో టైటిల్ పై విండీస్ కన్ను..! భారీ హిట్టర్లతో ప్రత్యర్ధులకు చెమటలు..

West Indies

T20 World Cup 2021 : ఈ టోర్నీలో ఆటను క్షణాల్లో మార్చగల హిట్టర్లు ఆ జట్టు సొంతం. ఆ టీమ్ లో ఏ ఒక్కరు నిలబడినా.. ప్రత్యర్థి టీమ్ ఆశలు వదులుకోవాల్సిందే. ఆ జట్టే డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది. ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(New Zealand), అఫ్గానిస్తాన్‌(Afghanistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. ఇక, హాట్ ఫేవరేట్లలో ఒకటైన న్యూజిలాండ్ టీమ్ బలబలాలుపై ఓ లుక్కేద్దాం.

  ఇక, ఈ టోర్నీలో ఆటను క్షణాల్లో మార్చగల హిట్టర్లు ఆ జట్టు సొంతం. ఆ టీమ్ లో ఏ ఒక్కరు నిలబడినా.. ప్రత్యర్థి టీమ్ ఆశలు వదులుకోవాల్సిందే. ఆ జట్టే డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్. ఇక, డిసెంబర్ 2019 లో అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన డ్వేన్ బ్రావో ప్రపంచ కప్ ఆడుతున్నాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ జట్టులో లేడు. 2016 ఫైనల్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టడం ద్వారా వెస్టిండీస్ టీ 20 ప్రపంచ ఛాంపియన్‌గా రెండోసారి నిలిచింది. బ్రాత్‌వైట్ ఫామ్ ఇటీవల ఆశించిన స్థాయిలో లేదు. లెజెండరీ ప్లేయర్ క్రిస్ గేల్‌పైనే ఆ జట్టు బోలెడు ఆశలు పెట్టుకుంది. తన విధ్వంసకర బ్యాటింగ్ తో మరో టైటిల్ అందిస్తాడని విండీస్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

  క్రిస్ గేల్ తో పాటు, ఎవిన్ లూయిస్, లెండెల్ సిమ్మన్స్, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, షిమ్రాన్ హెట్మెయర్ లాంటి పవర్ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ కనీసం పది ఓవర్లు ఆడినా.. పెను విధ్వంసమే. బౌలింగ్ లో సునీల్ నరైన్ లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలంశంగా మారనుంది. సునీల్ నరైన్ ఐపీఎల్ 14 వ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అటువంటి కీలక బౌలర్ ను జట్టులోకి విండీస్ ఎందుకు తీసుకోలేదో అర్ధం కావట్లేదు.

  ఇది కూడా చదవండి : బ్లాక్ బస్టర్ పోరుకు ముందు రోహిత్ శర్మ అరుదైన రికార్డు..! ధోనీ, కోహ్లీల వల్ల కూడా కాలేదు..

  బౌలింగ్ లో రవిరంపాల్, వాల్ష్ జూనియర్, ఓబెడ్ మెక్కాయ్ కీలకం కానున్నారు. అలాగే, సీనియర్ డ్వేన్ బ్రావో మిడిలార్డర్ ఓవర్ల లో కీ రోల్ ప్లే చేయనున్నాడు. ఇప్పటికే రెండు టైటిళ్లు నెగ్గిన విండీస్.. మరో సారి సమిష్టిగా సత్తా చాటితే.. మూడో టైటిల్ ను ఎగరేసుకుపోవచ్చు.

  వెస్టిండీస్ షెడ్యూల్ :  మ్యాచ్ నెం డేట్ మ్యాచ్ టైం వెన్యూ స్టేజ్
  1 అక్టోబరు 23 ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ 07:30 అబుదాబి సూపర్‌ 12
  2 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్‌ వెస్టిండీస్‌ 03:30 దుబాయ్‌ సూపర్‌ 12
  3 అక్టోబరు 29 వెస్టిండీస్‌ వర్సెస్‌ B2 07:30 షార్జా సూపర్‌ 12
  4 నవంబరు 4 వెస్టిండీస్‌ వర్సెస్‌ A1 03:30 అబుదాబి సూపర్‌ 12
  5 నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్‌ వెస్టిండీస్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12

  వెస్టిండీస్ కీలక ఆటగాళ్లు : క్రిస్ గేల్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో

  బెస్ట్ ప్రదర్శన : రెండు సార్లు ఛాంపియన్

  వెస్టిండీస్ జట్టు :కీరాన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మెయర్, ఎవిన్ లూయిస్, ఓబెడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్, లెండెల్ సిమన్స్, ఒషాన్ వాల్ థామస్, వాల్ష్ జూనియర్.

  రిజర్వ్‌ ప్లేయర్లు : జాసన్ హోల్డర్, అకిల్ హోస్సేన్, షెల్డన్ కాట్రెల్, డారెన్ బ్రావో.
  Published by:Sridhar Reddy
  First published: