Home /News /sports /

T20 WORLD CUP 2021 VIRAT KOHLI REMEMBERS MS DHONI AND GIVES SWEET WARNING TO RISHABH PANT WATCH VIRAL VIDEO SRD

T20 World Cup 2021 : " చూడు పంత్.. నువ్వే కాకుంటే నాకు చాలా మంది కీపర్లున్నారు " .. రిషబ్ కు కోహ్లీ వార్నింగ్..

విరాట్ కోహ్లీ - పంత్ (ఫైల్ ఫోటో)

విరాట్ కోహ్లీ - పంత్ (ఫైల్ ఫోటో)

T20 World Cup 2021 : ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వికెట్ కీపింగ్ లో వరల్డ్ కప్ లో చాలా ఆప్షన్లు ఉన్నాయ్. ఈ నేపథ్యంలో భారత సారథి (Team India Skipper) విరాట్ కోహ్లి (Virat Kohli).. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కు వార్నింగ్ ఇచ్చాడు.

ఇంకా చదవండి ...
    యూఏఈ, ఒమన్ వేదికగా క్రికెట్ లవర్స్ ను అలరించడానికి ధనాధన్ టోర్నీ టీ -20 ప్రపంచ కప్ ( T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈనెల 17 నుంచి యూఏఈ వేదికగా ధనా ధన్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. అక్టోబ‌ర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.ఈ టోర్నీలో భారత్.. 24 నుంచి కప్ వేటను ప్రారంభించనుంది. దాయాది పాకిస్ధాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వికెట్ కీపింగ్ లో వరల్డ్ కప్ లో చాలా ఆప్షన్లు ఉన్నాయ్. ఈ నేపథ్యంలో భారత సారథి (Team India Skipper) విరాట్ కోహ్లి (Virat Kohli).. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) కు వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ లు గెలవాలంటే ఫినిషర్ గా ఉండే పంత్ వంటి వాళ్లు సిక్సర్లు కొట్టాలని సూచించాడు.

    టీ20 క్రికెట్ లో సిక్సర్లు కొట్టే వాళ్లే మ్యాచ్ లు ముగుస్తారని కోహ్లి.. పంత్ కు సూచించాడు. ధనాధన్ బ్యాటింగ్ తో జట్టు కు విజయాలు అందించాలని కోరాడు. లేకుంటే తనకు చాలా మంది వికెట్ కీపర్లున్నారని హెచ్చరించాడు. దీనికి స్పందించిన పంత్ కూడా.. దానికి తగ్గట్టే తాను ప్రిపేర్ అవుతున్నట్లు కోహ్లికి చెప్పాడు.

    అసలు విషయంలోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ (Star sports) రూపొందించిన ఓ యాడ్ లో కోహ్లి, పంత్ లు ఇలా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారింది. ఆ సంభాషణ ఇలా సాగింది

    కోహ్లి: పంత్.. టీ20లలో సిక్సర్లే మ్యాచ్ లను గెలిపిస్తాయి ఆ విషయం తెలుసా.

    పంత్: నువ్వేం కంగారుపడకు భయ్యా.. నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతకుముందు వికెట్ కీపర్ గా ఉన్న వ్యక్తే టీమిండియాకు సిక్సర్ కొట్టి ప్రపంచకప్ అందించాడు. (2011 ప్రపంచకప్ లో ధోనీ విన్నింగ్ షాట్ ను ఉద్దేశిస్తూ.. )

    కోహ్లి: నిజమే.. కానీ ధోని భాయ్ తర్వాత అంతటి వికెట్ కీపర్ భారత్ కు ఇంకా దొరకలేదు.

    పంత్: నేనూ టీమిండియా కీపరే కదా..

    కోహ్లి: చూడు పంత్.. నాకు చాలా మంది కీపర్లున్నారు. వార్మప్ మ్యాచుల్లో ఎవరెలా ఆడుతారో చూద్దాం.. అంటూ ఇద్దరూ సరదాగా సంభాషించుకున్నారు.



    అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. అంతకు ముందు భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడునుంది. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలుపొందింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: KL Rahul, Rishabh Pant, T20 World Cup 2021, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు