Home /News /sports /

T20 WORLD CUP 2021 TEAM INDIA TO REPLACE HARDIK PANDYA WITH SHARDUL THAKUR IN NEW ZEALAND CLASH FOR BETTER CHANCE SAYS BRAD HADDIN SRD

Team India : " టీమిండియా ఆ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే.. లేకపోతే కోహ్లీసేనకు కష్టమే "

Team India (PC : ICC)

Team India (PC : ICC)

Team India : టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో (India Vs New Zealand) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ టీమిడియా కచ్చితంగా గెలవాలి. లేదంటే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవచ్చు.

    టీ20 ప్రపంచకప్‌ 2021 (T20 World Cup 2021)లో భారత్‌ (Team India) ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది. పాకిస్థాన్ (Pakistan) చేతిలో10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో (India Vs New Zealand) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ టీమిడియా కచ్చితంగా గెలవాలి. లేదంటే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవచ్చు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడీన్ (Brad Haddin) కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లోపు ఆరో బౌలర్ సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చాడు. ఆరో బౌలర్‌ విషయంలో భారత కెప్టెన్, మేనేజ్మెంట్ ఇప్పటికైనా ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలని అని బ్రాడ్ హ్యాడిన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాకు బదులుగా మరో ఆల్‌రౌండర్‌ జట్టులోకి రావాలని ఆసీస్ మాజీ వికెట్‌ కీపర్ అంటున్నాడు.

    టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. కానీ అతడు బౌలింగ్‌ చేయడానికి ఇంకా ఫిట్‌గా లేనట్లు కనిపిస్తోంది. అందుకే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌ చేయలేదు. ఇక బ్యాట్‌తోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే యూఏఈలో ఐపీఎల్ 2021లో కూడా పెద్దగా రాణించలేదు. గత కొంత కాలంగా హార్దిక్ ఫామ్‌లో లేడు.

    తాజాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్ బ్రాడ్ హ్యాడిన్ ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ... " టీమిండియా ఆసక్తికరమైన సమస్యను ఎదుర్కొంటోంది. భారత జట్టును ఆరో బౌలర్ సమస్య వేధిస్తోంది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. చాలా కాలంగా బౌలింగ్‌ చేయని హార్థిక్ .. ఇప్పుడు బౌలింగ్‌ చేసినా విజయవంతం అవుతాడో లేదో అనే అనుమానం ఉంది. దీంతో, ఆరో బౌలర్‌ లోటుని పూడ్చేందుకు జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌ని తీసుకోవాలి. భారత్ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. ఈ విషయం భారత జట్టుకు ఇప్పటికే అర్ధమై ఉంటుందని భావిస్తున్నా. లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలి " అని అన్నాడు.

    ఇది కూడా చదవండి : " డబ్బులకు అమ్ముడుపోయే నీలాంటి వాళ్లు క్రికెట్ ను నాశనం చేస్తున్నారు.. "

    హార్దిక్ పాండ్యాను తుది జట్టు నుంచి తప్పిస్తే.. అతడి స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ని తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసే శార్దూల్.. బ్యాట్‌తోనూ రాణించగలడు. సెప్టెంబరులో ముగిసిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఠాకూర్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో హార్దిక్ ని తప్పించి.. శార్దూల్ ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Hardik Pandya, T20 World Cup 2021, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు