హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2021 : మెగా టోర్నీలో టీమిండియా మహాసేన ఇదే..! టీమిండియాకు వీళ్లే కీలకం..!

T20 World Cup 2021 : మెగా టోర్నీలో టీమిండియా మహాసేన ఇదే..! టీమిండియాకు వీళ్లే కీలకం..!

Team India

Team India

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా(India T20 World Cup Squad).. పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతంది. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో, నవంబర్ 5న రౌండ్‌ 1లో గ్రూప్ బిలో టాప్-2గా నిలిచిన జట్టుతో, నవంబర్ 8న రౌండ్‌ 1లో గ్రూప్ ఏలో టాప్-2గా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.

ఇంకా చదవండి ...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది. ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(New Zealand), అఫ్గానిస్తాన్‌(Afghanistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. ఇక, రెండో టైటిల్ పై కన్నేసిన టీమిండియా పూర్తి బలగంపై ఓ లుక్కేద్దాం.

ఇక, టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా(India T20 World Cup Squad).. పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతంది. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో, నవంబర్ 5న రౌండ్‌ 1లో గ్రూప్ బిలో టాప్-2గా నిలిచిన జట్టుతో, నవంబర్ 8న రౌండ్‌ 1లో గ్రూప్ ఏలో టాప్-2గా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.

టీమిండియాకు ఓపెనింగ్ భాగస్వామ్యం ఎంతో కీలకం. ఓపెనర్లు అందించే ఆరంభాలు మీదే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయ్. ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), లోకేష్ రాహుల్ (Kl Rahul) బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ 2021లో రోహిత్ కాస్త తడబడినా.. రాహుల్ దుమ్ములేపాడు. పరుగుల వరద పారిస్తూ కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇక నాలుగో స్థానంలో హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు.

ఇక వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు. అయితే పంత్ ఐపీఎల్ 2021లో ఫెయిలయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇషాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు వికెట్ కీపర్ అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2021లో ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా కూడా విఫలమయ్యాడు. ఒకవేళ రిషబ్ ఉంటే పాండ్యా బదులుగా కూడా కిషన్‌ ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

ఇది కూడా చదవండి : బ్లాక్ బస్టర్ పోరుకు ముందు రోహిత్ శర్మ అరుదైన రికార్డు..! ధోనీ, కోహ్లీల వల్ల కూడా కాలేదు..

ఆల్‌రౌండర్‌ కోటాలో శార్దూల్‎ ఠాకూర్, రవీంద్ర జడేజా తుది జట్టులో ఆడనున్నారు. ఈ ఇద్దరు ఐపీఎల్ 2021లో ఇరగదీశారు. ముఖ్యంగా శార్దూల్‎ చెన్నై తరఫున 21 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో కీలక సమయంలో మ్యాచును మలుపుతిప్పాడు. బీసీసీఐ ముందుగా ప్రకటించిన భారత జట్టులో శార్దూల్ లేదన్న విషయం తెలిసిందే. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. దాంతో ఆర్ అశ్విన్, రాహుల్ చహర్‌కు నిరాశే ఎదురుకానుంది. పేస్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు చోటు దక్కనుంది.

టీమిండియా షెడ్యూల్ :

మ్యాచ్ నెండేట్మ్యాచ్టైంవెన్యూస్టేజ్
1అక్టోబర్ 24 ఇండియా Vs పాకిస్థాన్19.30దుబాయ్సూపర్ -12
2అక్టోబర్ 31ఇండియా Vs న్యూజీలాండ్19.30దుబాయ్సూపర్ -12
3నవంబర్ 3ఇండియా Vs అఫ్గానిస్తాన్19.30అబుదాబిసూపర్ -12
4నవంబర్ 5ఇండియా Vs బీ219.30దుబాయ్సూపర్ -12
5నవంబర్ 8ఇండియా Vs ఏ219.30దుబాయ్సూపర్ -12


టీమిండియా పూర్తి జట్టు :

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.

రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌.

బెస్ట్ ప్రదర్శన : 2007 ఛాంపియన్లు, 2014 రన్నరప్

మెంటార్‌: ఎంఎస్‌ ధోని

టీమిండియా కోచ్ : రవిశాస్త్రి

భారత కాలమానం ప్రకారం మ్యాచ్ టైమింగ్స్..

భారత్ కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతాయి. అయితే టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup) లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి టీమిండియానే పైచేయి సాధించింది. ఇందులో కూడా 4 సార్లు గ్రూప్ దశలోనే తలపడ్డారు.

First published:

Tags: Cricket, Jasprit Bumrah, KL Rahul, MS Dhoni, Ravindra Jadeja, Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli

ఉత్తమ కథలు