హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2021 : ముందుకెళ్లాలంటే భారత్ మిగతా జట్లను ఎంత తేడాతో ఓడించాలి..? కోహ్లీసేన లెక్కలేంటి..?

T20 World Cup 2021 : ముందుకెళ్లాలంటే భారత్ మిగతా జట్లను ఎంత తేడాతో ఓడించాలి..? కోహ్లీసేన లెక్కలేంటి..?

Team India (PC : ICC)

Team India (PC : ICC)

T20 World Cup 2021 : ఇక, టీమిండియాకు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచులు మిగిలాయ్. స్కాట్లాండ్, నమీబియాలతో టీమిండియా నెక్ట్స్ మ్యాచులు ఆడనుంది. అఫ్గానిస్థాన్ తో పోల్చుకుంటే.. ఆ రెండు జట్లతో పోరు కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు.

టీ-20 ప్రపంచకప్‌ (T-20 World Cup 2021)లో సూపర్ విక్టరీతో భారత్‌ (Team India) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఫ్లాప్‌ అయిన బ్యాటింగ్‌ ఒక్కసారిగా "సూపర్‌ హిట్‌" అయ్యింది. విలన్లుగా మారిన టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా హీరోలుగా మారారు. గ్రూప్‌–2లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది.ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలవడంతో టీమిండియా తమ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇక, టీమిండియాకు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచులు మిగిలాయ్. స్కాట్లాండ్, నమీబియాలతో టీమిండియా నెక్ట్స్ మ్యాచులు ఆడనుంది. అఫ్గానిస్థాన్ తో పోల్చుకుంటే.. ఆ రెండు జట్లతో పోరు కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు.

అఫ్గానిస్థాన్ మీద విక్టరీతో టీమిండియా నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది.

టీమిండియా నెట్ రన్ రేట్ :

టీమిండియా రన్ రేట్ ఇప్పుడు ప్లస్ లోకి వచ్చింది. - 1.609 నుంచి +0.073కి టీమిండియా నెట్ రన్ రేట్ పెరిగింది. మరోవైపు అఫ్గానిస్థాన్ నెట్ రన్ రేట్ +3.097 నుంచి +1.481 కి తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ రన్ రేట్ +0.816. ఇక, టీమిండియా, న్యూజిలాండ్ లు గ్రూప్ స్టేజిలో చెరో రెండు మ్యాచులు ఆడనున్నాయ్.

సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ముందుగా టీమిండియా నెక్ట్స్ తన రెండు మ్యాచుల్లో విక్టరీ కొట్టాలి. స్కాట్లాండ్, నమీబియాలతో పోరు ఈజీగానే ఉండొచ్చు. కానీ, ఆ జట్టుల్లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ మ్యాచులో స్కాట్లాండ్ ఎలా చెలరేగిందో మనం చూశాం కదా. దీన్ని బట్టి ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకుండా టీమిండియా దూకుడుగా ఆడాలి.

న్యూజిలాండ్ ఒక మ్యాచ్ అయినా ఓడాలి :

* న్యూజిలాండ్ కనుక తన నెక్ట్స్ రెండు మ్యాచుల్లో గెలిస్తే టీమిండియా ఇక బ్యాగ్ సర్దుకోవడమే. ఆ జట్టు ఒక మ్యాచులో అయినా ఓడిపోవాలి. అప్పుడే టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయ్.

* ఇక, న్యూజిలాండ్ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడితే.. అఫ్గాన్, టీమిండియాల మధ్య నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. ఏ జట్టుకైతే బెటర్ రన్ రేట్ ఉంటుందో ఆ జట్టు సెమీస్ లో అడుగుపెడుతోంది.

* ఒక వేళ నమీబియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. అఫ్గానిస్తాన్ మీద గెలిస్తే అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. టీమిండియా, న్యూజిలాండ్ ల్లో ఒక జట్టు సెమీస్ కు చేరనుంది.

* న్యూజిలాండ్ నమీబియా మీద గెలిచి.. అఫ్గానిస్థాన్ మీద ఓడిపోతే.. అప్పుడు కివీస్, టీమిండియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఎవరికైతే మెరుగైన రన్ రేట్ ఉంటుందో ఆ జట్టు సెమీస్ లోకి అడుగుపెడుతోంది.

ఇది కూడా చదవండి : కోహ్లీని కూరలో కరివేపాకులా బీసీసీఐ పక్కన పెట్టిందా..? అతన్ని సంప్రదించకుండానే కీలక నిర్ణయం..

టీమిండియా లెక్కలేంటి..?

* ఒకవేళ టీమిండియా స్కాట్లాండ్, నమీబియాలతో ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. ఆ జట్లను ఆరు పరుగులకుపైగా తేడాతో ఓడించాల్సిందే. ఒకవేళ ఛేజింగ్ అయితే, టార్గెట్ ను 13 ఓవర్లలో ఫినిష్ చేయాలి.

* అంతేకాకుండా, న్యూజిలాండ్.. అఫ్గానిస్తాన్ జట్లు తమ మ్యాచుల్లో భారీ తేడాతో గెలవకూడదు. ఒక వేళ అఫ్గానిస్థాన్ న్యూజిలాండ్ మీద 10 పరుగుల కన్నా ఎక్కువ తేడాతో గెలవకూడదు.

* న్యూజిలాండ్ ఈ నెల 5న నమీబియాతో పోరాడనుంది. న్యూజిలాండ్ ఆ మ్యాచులో ఓడిపోతే.. టీమిండియా కష్టాలు తీరినట్టే. కానీ.. గెలిస్తే ప్రాబ్లెమ్స్ మొదలైనట్టే.

* ఇక, టీమిండియా తమ లాస్ట్ మ్యాచును నమీబియాతో ఆడునుంది. లీగ్ స్టేజీలో ఇదే ఆఖరి మ్యాచ్. ఆ మ్యాచులో టీమిండియా సెమీస్ అంచనాలపై ఓ క్లారిటీ ముందుగానే వస్తోంది. టీమిండియాకు ఛాన్స్ ఉంటే.. ఆ మ్యాచులో క్యాలికులేషన్స్ బట్టి కోహ్లీసేన పోరాడాల్సి ఉంటుంది.

First published:

Tags: Afghanistan, Cricket, New Zealand, T20 World Cup 2021, Team India

ఉత్తమ కథలు