హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Pak : ఇక, భారత్‌కు ప్రతి మ్యాచ్‌ అగ్ని పరీక్షే..! ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే అంతే సంగతులు..

Ind Vs Pak : ఇక, భారత్‌కు ప్రతి మ్యాచ్‌ అగ్ని పరీక్షే..! ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే అంతే సంగతులు..

Ind Vs Pak : ఈ మ్యాచ్ లో పాక్‌ పక్కా ప్రణాళికతో అడుగుపెట్టింది. రోహిత్‌ శర్మ బలహీనతకు తగ్గట్లే వేగవంతమైన బంతితో షహీన్‌ అతణ్ని వికెట్ల ముందు ఔట్ చేశాడో అంటే వారి మాస్టర్ ప్లాన్ అర్ధం చేసుకోవచ్చు.

Ind Vs Pak : ఈ మ్యాచ్ లో పాక్‌ పక్కా ప్రణాళికతో అడుగుపెట్టింది. రోహిత్‌ శర్మ బలహీనతకు తగ్గట్లే వేగవంతమైన బంతితో షహీన్‌ అతణ్ని వికెట్ల ముందు ఔట్ చేశాడో అంటే వారి మాస్టర్ ప్లాన్ అర్ధం చేసుకోవచ్చు.

Ind Vs Pak : ఈ మ్యాచ్ లో పాక్‌ పక్కా ప్రణాళికతో అడుగుపెట్టింది. రోహిత్‌ శర్మ బలహీనతకు తగ్గట్లే వేగవంతమైన బంతితో షహీన్‌ అతణ్ని వికెట్ల ముందు ఔట్ చేశాడో అంటే వారి మాస్టర్ ప్లాన్ అర్ధం చేసుకోవచ్చు.

  అంతా వన్‌సైడ్‌.. మామూలుగా చిరకాల ప్రత్యర్థితో పోరంటే ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా.. చివరికి విజయం మాత్రం మనల్నే వరించేది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. టాస్‌ దగ్గర నుంచి ఏదీ కోహ్లి సేనకు కలిసి రాలేదు. పాక్‌తో మ్యాచ్‌ అంటే మన వెంట ఉండే ఆ అదృష్టం ఈసారి మనల్ని వరించలేదు. ఎప్పుడూ పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టి ఫలితాన్ని సాధించే భారత్‌.. ఈసారి తానే ఒత్తిడిలో పడిపోయి ఓటమిని మూటగట్టుకుంది. కోట్లాది మంది భారతీయుల ఆశల్ని టీమిండియా నట్టేట ముంచింది. కనీస పోటి ఇవ్వకుండా తలదించుకునేలా చేసింది. చరిత్రను తిరగరాస్తూ.. ప్రపంచకప్ (World Cup History) ల్లో తమ కున్న చెత్త రికార్డుకు బ్రేక్ వేస్తూ.. పాకిస్థాన్ తొలిసారి కసిగా టీమిండియా (India Vs Pakistan)ను ఓడించారు. వన్డే, టీ20 ప్రపంచకప్పుల్లో ఇప్పటిదాకా టీమిండియా చేతిలో 12 సార్లు ఓడిన దాయాది.. ఆ కసినంతా ఈ మ్యాచులో తీర్చుకుంది. ఇలా ఆదివారం దుబాయ్‌లో ఏకపక్షంగా సాగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచులో పాక్ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. 152 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేజ్ చేసింది.

  ఈ మ్యాచ్ లో పాక్‌ పక్కా ప్రణాళికతో అడుగుపెట్టింది. రోహిత్‌ శర్మ బలహీనతకు తగ్గట్లే వేగవంతమైన బంతితో షహీన్‌ అతణ్ని వికెట్ల ముందు ఔట్ చేశాడో అంటే వారి మాస్టర్ ప్లాన్ అర్ధం చేసుకోవచ్చు. అయితే, పాక్ ఎంత ఏకపక్షంగా ఆడినా.. భారత్ తప్పిదాలు కూడా మనల్ని తలదించుకునేలా చేశాయ్. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌తో బౌలింగ్‌ దాడిని ఆరంభించడం భారత్‌ చేసిన వ్యూహాత్మక తప్పిదం. తొలి ఓవర్లోనే రెండు పెద్ద షాట్లు పడటంతో పాక్‌ ఓపెనర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. వాళ్లు ఒత్తిడిలో పడలేదు.

  భారత్‌ కాస్త ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా.. కీలక సమయంలో మళ్లీ బౌండరీలు రావడంతో పాక్‌కు తిరుగులేకపోయింది. మ్యాచ్‌లో ఏదో ఓ దశలో జట్టు పుంజుకుంటుందని.. ప్రత్యర్థికి చెక్ పెడుతుందని.. విజయాన్ని అందుకుంటుందని చివరి వరకూ ఎదురు చూడని అభిమాని లేడు. కానీ, ఫలితం మాత్రం కోట్లాది మంది భారతీయుల బాధను రెట్టింపు చేసింది.

  ఇది కూడా చదవండి : అప్పుడే మొదలెట్టేశారుగా..! కొట్టుకోవడం ఒక్కటే తక్కువ.. బంగ్లా-లంక మ్యాచ్ లో రచ్చ..

  భారత్‌ వచ్చే ఆదివారం తన తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో ఇక భారత్‌కు ప్రతి మ్యాచ్‌ పరీక్షే. ఈ ఓటమి ఎంతో వేదన కలిగించేదే కానీ.. ఈ ఒక్క మ్యాచ్‌తోనే అంతా అయిపోదు. ఈ టోర్నీలో భారత్‌ ప్రయాణం ఇంకా చాలా ఉంది. ఓ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తర్వాత మ్యాచ్‌లో గాడిన పడితే.. సెమీస్‌ చేరడం తేలికే. అయితే, ఈ తప్పుల్ని కచ్చితంగా టీమిండియా సరిచేసుకోవాల్సిందే.

  * టీమిండియా దగ్గర ప్లాన్ బి లేదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మ్యాచ్ లో ఇదే సీన్ రిపీట్ అయింది. టీమిండియా ఓపెనర్లు ఫెయిలవ్వడంతో.. మనోళ్లు వేగంగా ఆడలేకపోయారు. ఎప్పుడూ ఓపెనర్లు మీదే ఆధారపడితే అసలకే ప్రమాదం వస్తోందని ఈ మ్యాచ్ హెచ్చరించింది. ఇందుకు తగ్గట్టుగా.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి కోహ్లీ వ్యూహత్మక మార్పులు చేయాల్సిందే.

  * ఫామ్ లో ఉన్న శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లని పక్కన పెట్టి.. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ లాంటి ఆటగాళ్లుని తీసుకోవడం కూడా టీమిండియాకు చేటు చేసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయనప్పుడు.. అతనితో టీమిండియాకు ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. ఫినిషర్ రోల్ ను పంత్ కు అప్పజెప్పి.. ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకుంటే మంచిదని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక, శార్దూల్ ఠాకూర్.. బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించగలడు. అదిగాక, ఐపీఎల్ లో 18 వికెట్లు తీశాడు.

  * ఇక, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎటువంటి ప్రభావం చూపలేదు. మంచు ప్రభావం ఉండటంతో అతనికి సరియైన గ్రిప్ దొరకలేదు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అనుభవం ఇలాంటి సమయంలో పనికొస్తుంది. అతను చాలా సార్లు.. మంచు ప్రభావ సమయంలో కూడా రాణించాడు.

  * టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహులు కచ్చితంగా లయను అందుకోవాల్సిందే. అవసరమైతే.. రోహిత్ ను పక్కనపెట్టి.. దూకుడుగా ఆడే ఇషాన్ కిషన్ ను ఓపెనింగ్ చేయించాలి.

  * ఓ మోస్తరు టార్గెట్ సెట్ చేసినప్పుడు భారత్ రక్షణాత్మకంగా ఆడే ధోరణిని వీడాలి. దాయాది మ్యాచ్ లో ఫీల్డర్లు దగ్గర ఉన్నప్పటికీ.. పాక్ ఓపెనర్లు పదే పదే సింగిల్స్ తీస్తూ మ్యాచ్ పై పట్టు సాధించారు. అదే, మన టీమిండియా దూకుడుగా ఉండి ఉంటే.. వాళ్ల మీద ఒత్తిడి పెరిగి ఉండేది. అలాగే, బుమ్రా చేత ఫస్ట్ స్పెల్ లోనే బౌలింగ్ వేయించుంటే.. ఒక వికెటైనా దక్కి పాకిస్థాన్ మీద ఒత్తిడి పెరిగి ఉండేది.

  ఇది కూడా చదవండి : పీవీ సింధును ఎప్పుడైనా ఇలా చూశారా..! యెల్లో డ్రెస్ లో సందడి చేసిన తెలుగు తేజం..

  * యూఏఈలోనే ఐపీఎల్ ఆడారు భారత ఆటగాళ్లు. ఒక ప్రాంచైజీ తరపున సత్తా చాటిన వాళ్లు.. దేశం కు ప్రాతినిధ్యం వహించేటప్పుడు సత్తా చాటాల్సిందే. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, షమీ, జడేజాలు ఐపీఎల్ లో బీభత్సంగా రాణించారు. కానీ, అసలు పోరు సమయంలో వీళ్లు చేతులేత్తేశారు.

  * ఈ లోపాల్ని సరిదిద్దుకోని నెక్ట్స్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా కప్పు కొట్టి దాయాది ఓటమిని మరిపించేలా చేయాలి.

  First published:

  Tags: India vs newzealand, India VS Pakistan, Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli

  ఉత్తమ కథలు