హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup : " ఆ పిచ్చి వాగుడు వాగే వాళ్లను అస్సలు పట్టించుకోవద్దు.. నీ ఆటపై దృష్టి పెట్టు.. "

T20 World Cup : " ఆ పిచ్చి వాగుడు వాగే వాళ్లను అస్సలు పట్టించుకోవద్దు.. నీ ఆటపై దృష్టి పెట్టు.. "

Team India

Team India

T20 World Cup : భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసి వారం రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది.

ఇంకా చదవండి ...

భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T-20 World Cup 2021) లో గత ఆదివారం తలపడ్డ సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించింది. భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసి వారం రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli), మహ్మద్ షమీ (Mohammed Shami) ని టార్గెట్‌ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా షమీని టార్గెట్ చేసుకుని తీవ్ర పదజాలంతో అతన్ని ట్రోలింగ్ చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, అభిమానులు ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్‌లో షమీపై విమర్శలు చేశారు.

ముఖ్యంగా ఆ మ్యాచ్ లో మహ్మద్ షమీ వేసిన 18వ ఓవర్‌లో 17 పరుగులు సమర్పించడంతో అతన్ని దూషిస్తూ, బూతులు తిడుతూ పోస్టులు చేశారు కొందరు అభిమానులు. నువ్వు ముస్లిం అవ్వడం వల్లే టీమిండియాని ఓడించావని, వెంటనే మీ పాకిస్తాన్‌కి వెళ్లిపోవాలంటూ పిచ్చి కూతలు కూశారు.

అయితే షమీపై ట్రోల్ చేసిన వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఆయన షమీకి మద్దతుగా నిలిచాడు. అంతేగాక షమీకి సపోర్ట్ గా ఉన్న టీమిండియా ఆటగాళ్లను అభినందించాడు. సునీల్ గావస్కర్ ఓ జాతీయటీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. " షమీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారి గురించి.. ఆ మాటల గురించి పట్టించుకోవాల్సిన పన్లేదు. ఈ పనికిమాలిన ట్రోల్స్ అసలు మ్యాటరే కాదు. మేము వాటిని లెక్కచేయం. అసలు వాటికి గుర్తింపే లేదు " అని గవాస్కర్ అన్నాడు.

అంతేగాక షమీకి మద్దతుగా విరాట్ అండ్ కో నిలవడాన్ని గావాస్కర్ మంచి పరిణామంగా అభివర్ణించాడు. ఈ సమయంలో షమీకి ఎంతో అవసరమని తెలిపాడు. ఇక, షమీకి మద్దతుగా భారత సీనియర్ క్రికెటర్లు నిలిచిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సెహ్వాగ్ (Virender Sehwag), గంభీర్ (Gowtham Gambhir), ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), యుజ్వేంద్ర చాహల్ వంటి వాళ్లు షమీకి బాసటగా నిలిచారు.

ఇది కూడా చదవండి : " ఓం సాయి రాం.. ఇక నువ్వే కాపాడాలి " .. టీమిండియాను భయపడుతున్న ఐరన్ లెగ్ అంపైర్..

కోహ్లీ కూడా మహ్మద్ షమీపై ఆన్‌లైన్ అటాక్ చేసిన వారిపై ఫైర్ అయ్యాడు. " టీమిండియాలో ప్రతీ ఒక్కరూ టీమ్ గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతారు. జాతీయ పతకాన్ని రెపరెపలాడించాలనే ఓ గొప్ప ఉద్దేశంతో క్రికెట్ ఆడతాం. అంతేకానీ ఇలాంటి వెధవలను ఎంటర్‌టైన్ చేయడానికి కాదు. ఐడెంటెటీ చూపించుకోవడానికి కూడా ధైర్యం లేని వీళ్లు, ఇలా మనుషులను ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. " అంటూ ఫైరయ్యాడు.

First published:

Tags: Cricket, Mohammed Shami, Sunil Gavaskar, T20 World Cup 2021, Team India, Virat kohli

ఉత్తమ కథలు