హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2021: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. సునీల్ గవాస్కర్ వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికి నో ఛాన్స్..!

T20 World Cup 2021: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. సునీల్ గవాస్కర్ వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికి నో ఛాన్స్..!

virat kohli and rohit sharma

virat kohli and rohit sharma

T20 World Cup 2021: ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేటెస్ట్ గా టీ20 ప్రపంచకప్‌ 2021 (T-20 World Cup 2021) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. మెగా టోర్నీ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను హాట్ ఫేవరెట్ జట్లగా నిపుణులు పరిగణిస్తున్నారు. మరోవైపు పొట్టి కప్‌ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక, బీసీసీఐ కూడా భారత జట్టును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ కంటే ముందే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన తన జట్టును ప్రకటించాడు.

సునీల్ గవాస్కర్ ఆశ్చర్యకరంగా ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్‌(Shreyas Iyer)ని తన టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోలేదు. రోహిత్ శర్మ(Rohit Sharma Batting), విరాట్‌ కోహ్లీ (Virat Kohli Updates) ని ఓపెనర్లుగా ఎంచుకున్నాడు సన్నీ. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడుతానని విరాట్ గతంలో చెప్పాడు. అందుకే అతడిని సన్నీ ఎంచుకున్నాడు. దీంతో పృథ్వి షా, శిఖర్ ధావ‌న్‌లకు నిరాశే ఎదురైంది. జూలైలో శ్రీలంక పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల జట్టుకు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అక్కడ టీ20ల్లో అతడు విఫలమయ్యాడు. మరోవైపు అయ్యర్ భుజం గాయం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.

virat kohli news, sunil gavaskar on kohli, sunil gavaskar bcci selection committee, bcci news, ind wi tour 2019, india west indies tour, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, భారత్ వెస్టిండీస్ టూర్
సునీల్ గవాస్కర్(ఫైల్ ఫోటో)

ఇక, యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు సునీల్ గవాస్కర్ మూడో స్థానం ఇచ్చాడు. కేఎల్ రాహుల్‌, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్), హార్దిక్‌ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు సన్నీ వరుసగా చోటిచ్చాడు. పేస్ బౌలింగ్ విభాగానికి మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడని చెప్పాడు.

ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ (ఫిట్‌నెస్‌ సాధిస్తే), శార్దూల్‌ ఠాకూర్‌లకు సునీల్ గవాస్కర్ తన జట్టులో చోటిచ్చాడు. దీపక్‌ చహర్‌ను నాలుగో పేసర్‌గా ఎంచుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యజువేంద్ర చాహల్‌ను ఎంచుకున్నాడు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సన్నీ మర్చిపోయాడు.

ఇది కూడా చదవండి : అంతలా ప్రేమించాడు..? ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనా..?

అయితే సన్నీ గాయపడిన సుందర్‌కు చోటివ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే.. సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది.

సునీల్ గవాస్కర్ టీ20 జట్టు : రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (వికెట్‌ కీపర్), హార్దిక్‌ పాండ్యా, కేఎల్ రాహుల్‌, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ (ఫిట్‌నెస్‌ సాధిస్తే), జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యజ్వేంద్ర చాహల్‌.

First published:

Tags: Cricket, Prithvi shaw, Rohit sharma, Shikhar Dhawan, Sports, Sunil Gavaskar, T20 World Cup 2021, Virat kohli

ఉత్తమ కథలు