టీ-20 వరల్డ్ కప్ 2021 (T-20 World Cup 2021) ఆఖరి అంకానికి చేరుకుంది. ఫైనలిస్ట్ లు ఎవరో తేలిపోయింది. ఆదివారం చిరకాల ప్రత్యర్ధులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు (New Zealand Vs Australia) మెగా కప్ కోసం పోరాడనున్నాయ్. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హసన్ అలీ చేసిన ఘోర తప్పిదం పాకిస్థాన్ కొంపముంచింది. 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హసన్ అలీ చేజార్చగా.. ఆ అవకాశాన్ని అందుకున్న వేడ్ రెండు భారీ సిక్స్‌లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
అయితే ఆస్ట్రేలియా ఛేదనలో ఒక విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేయడానికి పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ హఫీజ్ బంతిని తీసుకున్నాడు. అతడు తొలి బంతిని వేయడంలో కాస్త తడబడ్డాడు. దీంతో ఆ బాల్ రెండు స్టెపులు పడి వార్నర్‌కు చాలా దూరంగా వెళ్లింది. అయినా సరే వార్నర్ ఏ మాత్రం తడబడకుండా దాన్ని సిక్స్ బాదాడు.
అయితే, వార్నర్ చేసిన ఈ పనికి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కు కోపం తెప్పించింది. అలా చేయడానికి సిగ్గుగా అనిపించలేదా..? అంటూ గంభీర్.. వార్నర్ భాయ్ పై నిందలు మోపాడు. బంతి వేయడంలో నియంత్రణ కోల్పోయిన హఫీజ్.. క్రీజుకు దూరంగా విసిరాడు. అది డెడ్ బాల్. వార్నర్ కు దూరంగా రెండు సార్లు బౌన్స్ అయిన బంతిని అతడు.. ముందుకొచ్చి ఆడాడు. అది సింగిల్, డబుల్ కూడా కాదు. ఏకంగా సిక్సరే. అంపైర్ దానిని నోబాల్ గా ప్రకటించాడు. వార్నర్ తెచ్చిన ఈ పనే గంభీర్ కు కోపం తెప్పించింది. నో బాల్ ను సిక్స్ ఎలా కొడతావంటూ వార్నర్ ను ప్రశ్నించాడు.
What an absolutely pathetic display of spirit of the game by Warner! #Shameful What say @ashwinravi99? pic.twitter.com/wVrssqOENW
— Gautam Gambhir (@GautamGambhir) November 11, 2021
ట్విట్టర్ ద్వారా స్పందించిన గంభీర్.. " వార్నర్ క్రీడా స్ఫూర్తిని ఎంత దయనీయంగా ప్రదర్శించాడు. ఇది నిజంగా అవమానకరం" అని ట్వీట్ చేశాడు. అంతేగాక దీనిపై స్పందించాలని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా అభిప్రాయం కోరాడు. క్రీడా స్ఫూర్తికి సంబంధించిన విషయాలపై చర్చలకు దిగే అశ్విన్ ను అభిప్రాయం అడగడంతో గంభీర్ కొత్త వివాదానికి తెరలేపాడు. అయితే ఈ ట్వీట్ కు వార్నర్ ఫ్యాన్ ఒకరు.. అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అదీ తెలుగులో. నువ్వు ఏందిరా నాయనా మధ్యలో అంటూ గౌతీకి పంచ్ వేశాడు ఆ ఫ్యాన్.
Nuvu endhi ra nayana madyalo pic.twitter.com/yaunQRkvur
— Tony (@naren_mekala) November 11, 2021
This Ball by Hafeez reminded of Gully Cricket ? And David Warner is ??#PakvsAus #Warner #Hafeez #Aussies pic.twitter.com/UUz11gLrg1
— We R Back Benchers (@WRBB_Official) November 11, 2021
ఈ మ్యాచులో వార్నర్ భాయ్ ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే తాను ఔటైన విధానాన్ని చూస్తే మాత్రం అతడిని దురదృష్టం వెన్నాడిందని అనిపించకమానదు. షాదాబ్ వేసిన 11 వ ఓవర్లో వేసిన ఫ్లిక్ బంతి.. వార్నర్ బ్యాట్ కు తాకలేదు. కానీ అంపైర్ మాత్రం ఔటిచ్చాడు. వార్నర్ కూడా తాను ఔటేమోనని భావించి పెవిలియన్ కు వెళ్లాడు. కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. వార్నర్ భాయ్ రివ్యూకు వెళ్తే బావుండేదని మ్యాచ్ అనంతరం అతడి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా మ్యాచ్ ఆసీస్ గెలవడంతో ఆ జట్టుతో పాటు వార్నర్ ఫ్యాన్స్ కూడా ఖుషీ చేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, David Warner, Gautam Gambhir, T20 World Cup 2021