Srilanka Vs Bangladesh: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. షార్జాలో ఏ జట్టుకు అనుకూలం?

శ్రీలంకతో బంగ్లాదేశ్ ఢీ.. ఇవే తుది జట్లు.. (PC: ICC)

Srilanka Vs Bangladesh: శ్రీలంక - బంగ్లాదేశ్ మ్యాచ్‌ షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెల్చిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకున్నది. ఇరు జట్ల తుది జట్లలో స్వల్ప మార్పు చోటు చేసుకున్నది.

 • Share this:
  టీ20 వరల్డ్ కప్ 2021లో (T20 World Cup) భాగంగా ఇవాళ షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక - బంగ్లాదేశ్ (Srilanka Vs Bangladesh) సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక (Srilanka) జట్టు ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. శ్రీలంక బౌలర్లు గత కొన్ని మ్యాచ్‌లలో అద్బుతంగా రాణిస్తున్నారు. అంతే కాకుండా షార్జా క్రికెట్ స్టేడియంలో ఛేసింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే శ్రీలంక కెప్టెన్ డాసన్ షనక (Dasun Shanaka) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ (Bangladesh) జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసి లక్ష్యాన్ని ఛేదించాలని అతడు భావిస్తున్నాడు. ఇక గాయం కారణంగా మహీష్ తీక్షణ తుది జట్టులో స్థానం కోల్పోయాడు. అతడి స్థానంలో బినుర ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు. శ్రీలంక టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో వరుసగా నమీబియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌పై గెలిచి మంచి ఫామ్‌లో ఉన్నది.

  ఇక బంగ్లాదేశ్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్‌పై ఓడిపోయినా.. ఒమన్, పపువా న్యూగినియా జట్లపై గెలిచి సూపర్ 12కు చేరుకున్నది. ఇటీవల న్యూజీలాండ్ వంటి జట్టును ఓడించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నది. టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో బంగ్లా దేశ్ జట్టు 6వ స్థానంలో ఉన్నది. టాస్ గెలిచి ఉంటే తాము బ్యాటింగ్ చేయాలనే అనకున్నామని బంగ్లా కెప్టెన్ మహ్ముదుల్లా అన్నాడు. టాస్ ఓడినా తాను అనుకున్నదే జరుగుతున్నది. కాబట్టి పెద్దగా బాధపడటం లేదని చెప్పాడు. గత మ్యాచ్‌లో ఆడిన తాస్కిన్ బందులు నసుమ్ అహ్మద్ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ స్పష్టం చేశాడు.

  India Vs Pakistan: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడండి.. క్రికెట్ ఫ్యాన్స్ కోసం జియో బంపర్ ఆఫర్లు  తుది జట్లు ఇవే..

  శ్రీలంక : కుషాల్ పెరీర (వికెట్ కీపర్), పాథమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, డాసన్ షనక (కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుశ్మంత చమీర, బినుర ఫెర్నాండో, లాహిరు కుమార

  బంగ్లాదేశ్: మొహమ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, నరుల్ హసన్ (వికెట్ కీపర్), మెహెది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
  Published by:John Naveen Kora
  First published: