T20 World Cup 2021: బంగ్లా పులులు మ్యావ్ మ్యావ్.. స్కాట్లాంట్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్...

Photo Credit : Twitter

T20 World Cup 2021: క్రికెట్ లో ముఖ్యంగా టీ-20 ఫార్మాట్ లో హాట్ ఫేవరేట్లు అంటూ ఎవరూ ఉండరు. ఎంతటి టీమ్ అయినా సరిగ్గా ఆడకపోతే ఆ రోజు చిత్తవ్వాల్సిందే. బంగ్లాదేశ్(Bangladesh) విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.

  • Share this:
    క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూసిన టీ-20 ప్రపంచకప్ (T20 World cup 2021) అంచనాలకు అందకుండా ప్రారంభం అయింది. క్రికెట్ లో ముఖ్యంగా టీ-20 ఫార్మాట్ లో హాట్ ఫేవరేట్లు అంటూ ఎవరూ ఉండరు. ఎంతటి టీమ్ అయినా సరిగ్గా ఆడకపోతే ఆ రోజు చిత్తవ్వాల్సిందే. బంగ్లాదేశ్(Bangladesh) విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫైయర్ మ్యాచుల్లో తొలి రోజే సంచలనం నమోదైంది. పసి కూన స్కాట్లాండ్ జట్టు, బంగ్లాదేశ్ (Bangladesh Vs Scotland) జట్టును వణికించి, 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు 53/6 వద్ద ఉన్న స్కాట్లాండ్ తేరుకుని 140 పరుగులు చేయగా... దాన్ని కాపాడుకుంటూ బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు.141 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన బంగ్లాదేశ్‌కి రెండో ఓవర్ నుంచే ముచ్ఛెమటలు పట్టించారు స్కాట్లాండ్ బౌలర్లు. సౌమ్యా సర్కార్ 5, లిటన్ దాస్ 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 18 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది బంగ్లా.

    ఈ దశలో షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం కలిసి మూడో వికెట్‌కి 47 పరుగులు జోడించారు. అయితే 28 బంతుల్లో 20 పరుగులు చేసిన షకీబుల్ హసన్‌ను క్రిస్ గ్రేవ్స్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 36 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన ముస్తాపికర్ రహీం కూడా క్రిస్ గ్రేవ్స్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా 23, అఫిఫ్ హుస్సేన్ 18 పరుగులు చేసి ఆకట్టుకున్నా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్.

    విజయానికి 12 బంతుల్లో 32 పరుగులు కావాల్సిన దశలో రెండు వికెట్లు తీసి, కేవలం 8 పరుగులే ఇచ్చాడు వీల్. ఆ తర్వాత ఆఖరి ఓవర్‌లో 25 పరుగులు కావాల్సిన దశలో మొదటి మూడు బంతుల్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో గెలవాలంటే ఆఖరి 3 బంతుల్లో 3 సిక్సర్లు కావాల్సిన పరిస్థితి.

    ఇది కూడా చదవండి : " పాక్ తో మ్యాచ్ ఆడొద్దు... ఆ జట్టును బ్యాన్ చేయండి " .. టీమిండియాపై పెరుగుతున్న ఒత్తిడి..

    అయితే నాలుగో బంతికి మెహెడి హసన్ సిక్సర్ బాదినా, ఆ తర్వాతి బంతికి ఫోర్ మాత్రమే వచ్చింది. ఆఖరి బంతికి 8 పరుగులు కావాల్సి ఉండగా 1 పరుగు మాత్రమే వచ్చింది. దీంతో స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 2016 సీజన్‌లో హంగ్ కాంగ్‌ను ఓడించిన స్కాట్లాండ్‌కి ఇది రెండో విజయం కావడం విశేషం.

    ఇది కూడా చదవండి : అలా చేయాల్సి వస్తే ధోనీనే ఫస్ట్.. మిస్టర్ కూల్ భవితవ్యంపై క్లారీటీ ఇచ్చిన CSK యాజమాన్యం..

    మరో మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఒమన్ అదరగొట్టింది అదరగొట్టింది. ఒమన్ (Oman).. ఆరంభ మ్యాచ్ లో పపువా న్యూ గినియా (papua New Guinea)ను మట్టి కరిపించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. 13.4 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది.
    Published by:Sridhar Reddy
    First published: