Home /News /sports /

T20 WORLD CUP 2021 SCO VS NAM NAMIBIA WON BY FOUR WICKETS IN THRILLING FIGHT AGAINST SCOTLAND SRD

Sco Vs Nam : హోరాహోరీ పోరులో నమీబియాదే విక్టరీ.. రాణించిన స్మిత్...

Photo Credit : ICC

Photo Credit : ICC

Sco Vs Nam : 110 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడం కోసం చివరి ఓవర్ వరుకు పోరాడింది నమీబియా. అటు స్కాట్లాండ్ కూడా ఏ దశలోనూ మ్యాచ్ మీద ఆశ వదిలేసుకోకుండా పోరాడింది.

    టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021)లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన పోరులో నమీబియా విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన లోయెస్ట్ స్కోరు గేమ్ లో చివరికి నమీబియానే విజయం వరించింది. నమీబియా 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ను చిత్తు చేసింది. 110 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడం కోసం చివరి ఓవర్ వరుకు పోరాడింది నమీబియా. అటు స్కాట్లాండ్ కూడా ఏ దశలోనూ మ్యాచ్ మీద ఆశ వదిలేసుకోకుండా పోరాడింది. చివరి ఓవర్ లో ఒక పరుగు చేయాల్సిన సమయంలో.. ఫస్ట్ బంతికే నమీబియా బ్యాటర్ స్మిత్ సిక్సర్ తో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. స్కాట్లాంట్ బ్యాటర్లలో స్మిత్ 23 బంతుల్లో 32 పరుగుల విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రెగ్ విలియమ్స్ 23 పరుగులు, మైకేల్ వాన్ లిన్జన్ 18 పరుగులు, డేవిడ్ వీస్ 16 పరుగులు ఫర్వాలేదనిపించారు. స్కాట్లాండ్ బౌలర్లలో లీస్క్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. వీల్, షరీఫ్, గ్రీవ్స్, మార్క్ వ్యాట్ తలా వికెట్ తీశారు. స్కాట్లాండ్ కు ఇది వరుసగా రెండో ఓటమి. అఫ్గాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది స్కాట్లాండ్. ఇక, నమీబియాకి ఇదే ఫస్ట్ మ్యాచ్.

    అంతకుముందు, టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుని.. స్కాట్లాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ కు నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్మన్ (Ruben trumpelmenn) చుక్కలు చూపించాడు.


    తొలి ఓవర్లోనే మొదటి బంతిని ఓపెనర్ మున్సీ (0) ఔట్ చేసిన అతడు.. తర్వాత రెండు బంతులు వైడ్ లు విసిరాడు. మూడో బంతికి మాక్లియోడ్ (0), నాలుగో బంతికి కెప్టెన్ బెర్రింగ్టన్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆ జట్టు స్కోరు బోర్దుపై పరుగులేమీ చేయకుండానే (రెండు వైడ్ల ద్వారా వచ్చిన పరుగులు మాత్రమే) మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఓపెనర్ మాథ్యూ క్రాస్ (33 బంతుల్లో 19), మైకేల్ లీస్క్ (27 బంతుల్లో 44.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్కాట్లాండ్ ను ఆదుకున్నారు.

    ఇది కూడా చదవండి : పాక్ మ్యాచ్ దెబ్బకు కోహ్లీ, రాహుల్ ర్యాంకులు ఢమాల్.. ఆ లిస్ట్ లో అయితే మనోళ్ల జాడే లేదు..!

    వీరిద్దరి ఆట వల్లే ఆ జట్టు 100 పరుగులు దాటగలిగింది. క్రాస్ ఔటయ్యాక వచ్చిన క్రిస్ గ్రీవ్స్ కూడా (25) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్ కెరీర్ ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన అతడు.. నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులే ఇచ్చాడు. మరో బౌలర్ ఫ్రైలింక్ (4-0-10-2) పొదుపుగా బౌలింగ్ చేశాడు. స్మిత్, డేవిడ్ వీస్ కు చెరో వికెట్ దక్కాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Sports, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు