Home /News /sports /

T20 WORLD CUP 2021 SA VS SL LIVE UPDATES SRI LANKA ALL OUT FOR 142 RUNS AGAINST SOUTH AFRICA SRD

SA Vs SL : షంసీ మాయాజలం.. నిశ్శంక ఒంటరి పోరాటం.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..

SA Vs SL

SA Vs SL

SA Vs SL : సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 12లో ఇప్పటిదాకా రెండేసి మ్యాచులాడి ఒక్కో విజయాన్ని నమోదుచేసుకున్నాయి. దీంతో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.

    టీ -20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో భాగంగా షార్జా క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. ఆ జట్టు ఓపెనర్ నిశ్శంక రాణించడంతో ఓ మోస్తరు లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచారు లంకేయులు. నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 12లో ఇప్పటిదాకా రెండేసి మ్యాచులాడి ఒక్కో విజయాన్ని నమోదుచేసుకున్నాయి. దీంతో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు నిశ్శంక. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన కుశాల్ పెరేరాని అన్రిచ్ నోర్ట్జే క్లీన్ బౌల్డ్ చేశాడు. 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది లంక జట్టు. చరిత్ అసలంక, పతుమ్ నిశ్శంక కలిసి రెండో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన అసలంక రనౌట్ కావడంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది లంక.

    ఆ తర్వాత భనుక రాజపక్సేని డకౌట్ చేసిన షంసీ, 5 బంతుల్లో 3 పరుగులు చేసిన ఆవిష్క ఫెర్నాండోను కూడా పెవిలియన్ చేర్చారు. ఈ ఇద్దరూ షంసీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం మరో విశేషం. ఈ ఏడాది టీ20ల్లో 32 వికెట్లు తీసిన షంసీ, ఒకే ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 5 బంతుల్లో 4 పరుగులు చేసిన వానిందు హసరంగ, షంసీ బౌలింగ్‌లోనే మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


    కెప్టెన్ దసున్ శనక 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి పెట్రోరియస్ బౌలింగ్‌లో రబాడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా చమీర కరుణ రత్నే కూడా పెట్రోరియస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించిన ఓపెనర్ పాథుమ్ నిశ్శంక, రబాడా వేసిన 18వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 17 పరుగులు రాబట్టాడు. అయితే పెట్రోరియిస్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

    సౌతాఫ్రికా బౌలర్లలో షంసీనే సూపర్ హీరో. 4 ఓవర్లో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు ఈ వరల్డ్ నెం.1 టీ-20 బౌలర్. ఇక, అతనితో పాటు పెట్రోరియస్ మూడు వికెట్లు, అన్రిచ్ నోర్ట్జే రెండు వికెట్లతో సత్తా చాటారు.

    తుది జట్లు:
    దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్, తబ్రైజ్ షమ్సీ.

    శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా (కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, South Africa, Sri Lanka, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు