Home /News /sports /

T20 WORLD CUP 2021 ROHIT SHARMA BACKS VIRAT KOHLI AND PRAISES TEAM INDIA CAPTAIN SRD

Rohit Sharma : విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా రోహిత్ శర్మ! టీమిండియా కెప్టెన్ గురించి హిట్ మ్యాన్ ఏమన్నాడంటే..

Kohli - Rohit

Kohli - Rohit

Rohit Sharma : ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్, పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ముందంజ వేయలేని పరిస్థితి నెలకొంది. టీమిండియా సెమీస్ కు చేరాలంటే ఏదైనా అద్భుతాలు జరగాల్సిందే. ముఖ్యంగా మిగతా జట్ల ప్రదర్శనలపై ఆధారపడాల్సి ఉంది.

ఇంకా చదవండి ...
    టీ-20 వరల్డ్ కప్ 2021 ( T20 World Cup 2021) భాగంగా టీమిండియా (Team India) వరుస పరాజయాలతో ఘోర విమర్శలు ఎదుర్కొంటోంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై ఓడిపోవడంతో సెమీఫైనల్స్ ఆశలు ఇండియాకు దాదాపుగా లేనట్టే. ఇప్పుడిక ఇండియాకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవడమే కాకుండా, ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉండటం మిగిలింది. దీంతో, టీమిండియాపై విమర్శలు ఆగడం లేదు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసుకుని మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కి అతని సహచర ఆటగాడు, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అండగా నిలిచాడు. కోహ్లీ ఓ అసాధారణమైన ఆటగాడని, అతను సాధించిన రికార్డ్స్ మాములివి కావని ప్రశంసించాడు. అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ రూపొందించిన వీడియోలో మాట్లాడిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

    " విరాట్ కోహ్లీకి విజయం కోసం ఎంత తపిస్తాడు. విజయం కోసం అతని పోరాటం అసాధారణం. అతని గణంకాలు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం నిలకడగా రాణించడం మాములు విషయం కాదు. అతను అరంగేట్రం చేసిన 2008 నుంచి ప్రతీ ఏడాదిగా మెరుగ్గా రాణిస్తూ గొప్ప ప్లేయర్‌గా ఎదిగాడు. అతని ఎదుగుదలను దగ్గర నుంచి నేను చూశాను." అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే వీడియోలో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, గ్లేన్ మ్యాక్స్‌వెల్ కోహ్లీని కొనియాడారు. అతను ఫామ్‌‌లో ఉంటే ఏ బౌలర్ కూడా ఆపలేరని జడేజా పేర్కొనగా.. మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న అత్యుత్తమ బ్యాటర్ కోహ్లీ అని అశ్విన్ ప్రశంసించాడు.

    ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంతో సోషల్ మీడియా వేదికగా కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి కొత్త మంది హద్దు దాటి కామెంట్లు చేశారు. అతని 9 నెలల కూతురు వామికను కూడా విడిచిపెట్టలేదు. అతని సతీమణి అనుష్కశర్మ, కూతరు పట్ల నీచమైన ట్రోలింగ్ కు దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ, సహచర ఆటగాళ్లు కోహ్లీకి అండగా నిలవడం జట్టు క్యారెక్టర్‌ను తెలియజేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

    ఇది కూడా చదవండి : టీమిండియా సెమీస్ కు చేరాలంటే ఈ అద్భుతాలు జరగాల్సిందే.. దాదాపు అసాధ్యమే..!

    ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్, పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ముందంజ వేయలేని పరిస్థితి నెలకొంది. టీమిండియా సెమీస్ కు చేరాలంటే ఏదైనా అద్భుతాలు జరగాల్సిందే. ముఖ్యంగా మిగతా జట్ల ప్రదర్శనలపై ఆధారపడాల్సి ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Rohit sharma, T20 World Cup 2021, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు