హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2021: " భారత్ - పాక్ పోరు కూడా ఓ సాధారణ మ్యాచే " .. వాళ్లే హాడావిడి చేస్తున్నారు..

T20 World Cup 2021: " భారత్ - పాక్ పోరు కూడా ఓ సాధారణ మ్యాచే " .. వాళ్లే హాడావిడి చేస్తున్నారు..

India Vs Pakistan

India Vs Pakistan

T20 World Cup 2021 : ఇక, వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకు పాకిస్ధాన్ మీద అజేయ రికార్డు ఉంది. 12-0 తేడాతో భారత్ పాకిస్థాన్ కు అందనంత ఎత్తులో ఉంది. ఇక, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయ్.

    ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest News) చివరి అంకానికి చేరుకుంది. ఇక, ఐపీఎల్ తర్వాత అలరించడానికి టీ-20 ప్రపంచకప్ టోర్నీ (T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీపైన రోజు రోజుకు అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

    ఇక, వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకు పాకిస్ధాన్ మీద అజేయ రికార్డు ఉంది. 12-0 తేడాతో భారత్ పాకిస్థాన్ కు అందనంత ఎత్తులో ఉంది. ఇక, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయ్.చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం భారత్.. పాక్‌కు వెళ్లింది.

    2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ పాక్ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ పోరులో పాక్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలవగా.. ఓ మ్యాచ్ టై కాగా.. బౌల్‌ అవుట్‌లో టీమిండియానే గెలుపొందింది.

    టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరుకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎పై సోషల్ మీడియా, అభిమానులు హైప్ క్రియేట్ చేస్తున్నారని పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు.

    లేటెస్ట్ గా విలేకరుల సమావేశంలో రిజ్వాన్ పాల్గొనగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడిగాడు. " భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎ను మేము సాధారణ మ్యాచులానే చూస్తున్నాం. సోషల్ మీడియా, అభిమానులు మాత్రమే హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది కానీ ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది" అని రిజ్వాన్ అన్నాడు.

    ఇది కూడా చదవండి : కోహ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్న మహిళా క్రికెటర్ ఎవరు..? ఆమె కోసం ఉదయం ఐదు గంటలకే..

    ఇదివరకు ప్రకటించిన పాకిస్తాన్ జట్టులో పీసీబీ తాజాగా మూడు మార్పులను చేసింది. గతంలో ప్రకటించిన మహ్మద్​ హస్నేన్​, అజమ్​ ఖాన్​ స్థానాల్లో సర్ఫరాజ్​ అహ్మద్​, హైదర్​ అలీలను తుది 15 మంది జట్టులోకి తీసుకుంది. రిజర్వ్​ ఆటగాళ్లలో ఫఖర్​ జమాన్​ బదులుగా ఖుష్​దిల్​ షాను తీసుకున్నట్లు పాక్​ క్రికెట్​ బోర్డు తెలిపింది. ముందుగా ప్రకటించిన జట్టులో ఫఖర్​ జమాన్ రిజర్వ్ ప్లేయర్ కాగా.. ఇప్పుడు తుది 15 మంది జట్టులోకి వచ్చాడు.

    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India VS Pakistan, Sports, T20 World Cup 2021

    ఉత్తమ కథలు