Home /News /sports /

Pak Vs Sco : టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ విజయ పరంపర.. దాయాది చేతిలో స్కాట్లాండ్ చిత్తు..

Pak Vs Sco : టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ విజయ పరంపర.. దాయాది చేతిలో స్కాట్లాండ్ చిత్తు..

Pak Vs Sco :  సూపర్ -12 స్టేజీలో ఐదు మ్యాచులు ఐదు గెలిచి గ్రూప్ -2 లో టాప్ ప్లేస్ లో నిలిచింది దాయాది.  సూపర్ -12 స్టేజీలో ఐదు మ్యాచులు ఐదు గెలిచి గ్రూప్ -2 లో టాప్ ప్లేస్ లో నిలిచింది దాయాది.

Pak Vs Sco : సూపర్ -12 స్టేజీలో ఐదు మ్యాచులు ఐదు గెలిచి గ్రూప్ -2 లో టాప్ ప్లేస్ లో నిలిచింది దాయాది. సూపర్ -12 స్టేజీలో ఐదు మ్యాచులు ఐదు గెలిచి గ్రూప్ -2 లో టాప్ ప్లేస్ లో నిలిచింది దాయాది.

Pak Vs Sco : సూపర్ -12 స్టేజీలో ఐదు మ్యాచులు ఐదు గెలిచి గ్రూప్ -2 లో టాప్ ప్లేస్ లో నిలిచింది దాయాది. సూపర్ -12 స్టేజీలో ఐదు మ్యాచులు ఐదు గెలిచి గ్రూప్ -2 లో టాప్ ప్లేస్ లో నిలిచింది దాయాది.

    టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ -12 స్టేజీలో ఐదు మ్యాచులు ఐదు గెలిచి గ్రూప్ -2 లో టాప్ ప్లేస్ లో నిలిచింది దాయాది. ఇక, స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో గెలుపొందింది పాకిస్తాన్. ఇక, సెమీస్ లో ఆస్ట్రేలియాతో ఈ నెల 11 న తలపడనుంది పాకిస్తాన్. 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేసింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో రిచి బెరింగ్టన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. బెరింగ్టన్ ( 37 బంతుల్లో 54 పరుగులు) చేశాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్లాండ్‌ ఏ దశలోనూ టార్గెట్ ఛేజ్ చేసేందుకు ప్రయత్నించలేదు. జార్జ్ మున్సే , కైల్ కోట్జర్ (9) భారీ షాట్లు ఆడలేకపోయారు. ఈ క్రమంలోనే కోట్జర్‌ను హసన్ అలీ క్లీన్‌ బౌల్డ్ చేశాడు.

    ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్‌ మాత్యూ క్రాస్‌ (5) దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు. ఇమాద్ వాసిం వేసిన బంతిని మున్సే స్ట్రెయిట్‌ షాట్‌ ఆడాడు. దాన్ని అడ్డుకోవడానికి ఇమాద్‌ చేయి చాచాడు. అతని చేతికి తగిలిన బంతి వెళ్లి నాన్‌ స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లకు తగిలింది. అప్పటికి క్రాస్‌ క్రీజు దాటేసి ఉన్నాడు. దీంతో అతను రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత పాక్‌ స్పిన్నర్ షాదాబ్‌ విజృంభించాడు. స్కాట్లాండ్‌పై ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 11వ ఓవర్‌లో బంతి అందుకున్న అతను తొలి బంతికే జార్జ్ మున్సే (17)ను అవుట్ చేశాడు. షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బాల్‌ సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో గాల్లోకి లేచి బంతిని హారిస్ రౌఫ్ సులభంగా అందుకున్నాడు. ఆ తర్వాత అప్పుడే క్రీజులోకి వచ్చిన డిలాన్ బడ్జ్‌ కూడా షాదాబ్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. ఇక, వేగంగా ఆడటానికి ప్రయత్నించిన లీస్(14) షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


    అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ రెచ్చిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి, ఈ టోర్నీలో నాలుగో హాఫ్ సెంచరీ బాదాడు. ఇక, హైదరాబాదీ అల్లుడు షోయబ్‌ మాలిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పకేవలం 18 బంతుల్లోనే 54 పరుగులు చేయడంతో పాకిస్థాన్ భారీ స్కోరు చేయగలిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌కు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (15), బాబర్ అజామ్‌ నిలకడైన ఆరంభాన్నిచ్చారు. అయితే, రిజ్వాన్‌, ఫఖర్ జమాన్‌ (8) వెంట వెంటనే అవుటవడంతో పాక్‌పై కొంత ఒత్తిడి పెరిగింది.

    అయితే అప్పుడే సీనియర్ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్ హఫీజ్‌ (19 బంతుల్లో 31) ఎడాపెడా బౌండరీలు బాదాడు. అదే ఊపులో మరో షాట్‌కు ప్రయత్నించి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్‌ నిమిషం కూడా ఆగలేదు. బౌండరీలు బాదడం కోసమే క్రీజులోకి వచ్చినట్లు రెచ్చిపోయాడు. మధ్యలో బాబర్ అజామ్ అవుటైనా అతని వేగానికి కళ్లెం పడలేదు. చివర్లో ఆసిఫ్ అలీ (5)తో కలిసి పాకిస్థాన్‌కు 189 పరుగుల భారీ స్కోరు అందించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. హంజా తాహిర్, సఫ్యాన్‌ షరీఫ్ చెరో వికెట్ కూల్చారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Babar Azam, Pakistan, T20 World Cup 2021

    తదుపరి వార్తలు