టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ జరుగుతున్న మ్యాచ్‌లో రషీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. టీ-20 ల్లో 100 వికెట్ల మైల్ స్టోన్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ-20 ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. టీ-20 ల్లో ఓవరాల్ గా 100 వికెట్ల మైల్ స్టోన్ ని అందుకున్న నాలుగో బౌలర్ రషీద్ ఖాన్. పాకిస్థాన్ బ్యాటర్ హాఫీజ్ వికెట్ తీయడంతో ఈ అరుదైన రికార్డు సాధించాడు. కేవలం 53 మ్యాచుల్లోనే ఈ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మలింగ, షకీబ్ , టీమ్ సౌథీ మాత్రమే టీ-20 ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. ఇక, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టీమ్ కు గట్టి పోటీనిస్తోంది అఫ్గానిస్తాన్.
ఇక, అంతకు ముందు.. అఫ్గానిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్ మహమ్మద్ నబీ(32 బంతుల్లో 5 ఫోర్లతో 35 నాటౌట్), గుల్బాదీన్ నైబ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్) కీలక పరుగులు చేయడంతో అఫ్గానిస్థాన్ పాకిస్థాన్ ముందు 148 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఓ దశలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన అఫ్గానిస్థాన్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ నబీ, గుల్బాదిన్ సూపర్ బ్యాటింగ్‌తో 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. దాంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 రన్స్ చేసింది.
? wickets in T20Is for Rashid Khan ?
He gets the scalp of Hafeez, who is gone for 10!#T20WorldCup | #PAKvAFG | https://t.co/1VM4iAyNq4 pic.twitter.com/VSOsYbDRz9
— T20 World Cup (@T20WorldCup) October 29, 2021
స్కాట్లాండ్‌తో దుమ్ములేపిన అఫ్గాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జాజై(0), మహమ్మద్ షెహజాద్(8) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారీ సిక్సర్లతో ఆశలు రేకెత్తించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రెహముల్లా గుర్బాజ్(10), అస్గర్ అఫ్గాన్(10), కరీమ్ జనత్(15), నజిబుల్లా జడ్రాన్(22) ఆ జోరును కొనసాగించలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాబాద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ రిజ్వాన్(8) ఆరంభంలోనే ఔటయ్యాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో పాకిస్థాన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఓవైపు ముజీబ్.. మరోవైపు మహ్మద్ నబీ తమ స్పిన్‌తో పాక్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. పాకిస్థాన్ ఆశల్నీ బాబర్ ఆజామ్ పైనే ఆధారపడ్డాయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Pakistan, Rashid Khan, T20 World Cup 2021