Home /News /sports /

T20 WORLD CUP 2021 ON THE FIELD OF PLAY AS WORDS ARE EXCHANGED BETWEEN LAHIRU KUMARA AND LITTON DAS SRD

T20 World Cup 2021 : అప్పుడే మొదలెట్టేశారుగా..! కొట్టుకోవడం ఒక్కటే తక్కువ.. బంగ్లా-లంక మ్యాచ్ లో రచ్చ..

Photo Credit : ICC

Photo Credit : ICC

T20 World Cup 2021 : అయితే, ఈ మ్యాచ్ లో ఓ ఫైటింగ్ ఘటన చోటు చేసుకుంది.బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకోవడానికి సిద్దమయ్యారు.

    టీ20 వరల్డ్ కప్ 2021లో (T20 World Cup) భాగంగా ఆదివారం మధ్యాహ్నం షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక - బంగ్లాదేశ్ (Srilanka Vs Bangladesh) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా 171/4 భారీ స్కోర్ చేసింది. బంగ్లా ఓపెనర్ మహ్మద్ నయీమ్ (62; 52 బంతుల్లో 6x4), సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (57; 37 బంతుల్లో 5x4, 2x6)లు హాఫ్ సెంచరీలు చేశారు. స్టార్ ప్లేయర్స్ లిటన్ దాస్ (16), షకీబ్ అల్ హసన్ (10), మహ్మదుల్లా (10)లు పూర్తిగా విఫలమయ్యారు. లంక బౌలర్లు చమిక కరుణరత్నే, బినురా ఫెర్నాండో, లహిరు కుమార తలో వికెట్ పడగొట్టారు. దుష్మంత చమీర నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. అయితే, ఈ మ్యాచ్ లో ఓ ఫైటింగ్ ఘటన చోటు చేసుకుంది.బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకోవడానికి సిద్దమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్ లాహిరు కుమారా, బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ మధ్య తీవ్ర మాటల యుద్దం నడిచింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.

    అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో లాహిరు కుమారా వేసిన ఐదో బంతిని లిటన్ దాస్ మిడాఫ్ దిశగా ఆడగా.. ఆ దిశలో సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షనక అద్భుతంగా అందుకున్నాడు. ఈ వికెట్ తీసిన ఆనందంలో లాహిరు కుమారా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.








    View this post on Instagram






    A post shared by ICC (@icc)





    అతని అరుపులపై లిటన్ దాస్ అభ్యంతం వ్యక్తం చేయడంతో ఆగ్రహానికి గురైన లాహిరు కుమార్ అతనిపైకి దూసుకెళ్లాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన లిటన్ దాస్ నోటికి పనిచెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టేసుకునే వరకు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అంపైర్లు, సహచర ఆటగాళ్లు ఇద్దరి ఆటగాళ్లను వారించి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

    ఇది కూడా చదవండి : భారత్ ను ఓడిస్తే పాక్ కు బంపరాఫర్.. ఒక మ్యాచ్ దాయాది ఆటగాళ్ల జీవితాన్నే మార్చేస్తుంది..!

    శ్రీలంక- బంగ్లాదేశ్ జట్ల మధ్య గొడవలు ఇప్పుడే కాదు. చాలా సార్లు జరిగాయ్. ముఖ్యంగా నిహాద్ ట్రోఫీ అప్పుడూ.. శ్రీలంకను ఓడించినప్పుడు.. గ్రౌండ్ లోనే బంగ్లా ఆటగాళ్లు నాగినీ డ్యాన్స్ వేశారు. అభ్యంతరకరంగా సైగలు చేశారు. ఇక, ఆ ట్రోఫిని భారత్ దక్కించుకున్న విషయం తెలిసిందే. బంగ్లాతో జరిగిన ఫైనల్ పోరులో.. టీమిండియాకు మద్దతుగా నిలిచారు శ్రీలంక అభిమానులు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bangladesh, Sri Lanka, T20 World Cup 2021, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు