Home /News /sports /

Nz Vs Sco : భారీ తేడాతో ఓడి భారత్ ను మరింత కష్టాల్లోకి నెట్టిన నమీబియా.. కివీస్ సూపర్ విక్టరీ..

Nz Vs Sco : భారీ తేడాతో ఓడి భారత్ ను మరింత కష్టాల్లోకి నెట్టిన నమీబియా.. కివీస్ సూపర్ విక్టరీ..

Photo Credit : ICC

Photo Credit : ICC

Nz Vs Nam : అనుకున్నదే జరిగింది. న్యూజిలాండ్ ను నమీబియా ఓడించడం సంగతి పక్కన పెడితే.. భారీ తేడాతో ఓడిపోయి టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టింది.

  టీమిండియా (Team India) ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా నమీబియా జట్టు వాటిపై నీళ్లు చల్లింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా(Namibia) 53 పరుగుల భారీ తేడాతో చిత్తు అయింది. పసికూన నమీబియాపై న్యూజిల్యాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 111/7తో విజయానికి 53 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఛేజింగ్ లో నమీబియాకు ఓపెనర్లు స్టీఫెన్‌ బార్డ్ (21), మైకేల్ వ్యాన్ లింగెన్‌ (25) నిలకడైన ఆరంభాన్నిచ్చారు. అయితే ఆ తర్వాత కెప్టెన్ ఎరాస్మస్ (3), జేన్ గ్రీన్‌ (23), డేవిడ్ వీజే (16), లాఫ్టీ ఈటన్‌ (0), క్రెగ్ విలియమ్స్ (0), జేజే స్మిత్‌ (9 నాటౌట్‌), రూబెన్ ట్రంపెల్‌మన్‌ (6 నాటౌట్) ఎవరూ బ్యాటు ఝుళిపించలేకపోయారు.

  చివర్లో 18వ ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో గ్రీన్‌ అవుటవగా.. 19వ ఓవర్లో లాఫ్టీ ఈటన్‌, క్రెగ్‌ విలియమ్స్‌ను పెవిలియన్ చేర్చిన బౌల్ట్ దెబ్బకు నమీబియా చేతులెత్తేసింది. అప్పటి వరకూ ఏమైనా పోరాడే అవకాశం ఉన్నా ఒకేసారి ఇద్దరు కివీ పేసర్లు విజృంభించడంతో పసికూన వణికిపోయింది. ఈ విజయంతో న్యూజిల్యాండ్‌ సెమీస్ ఆశలు మరింత పెరగ్గా.. భారత జట్టు సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాలి. దానికి తోడు ఆఫ్ఘనిస్థాన్‌తో నవంబరు 7న జరిగే మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ చిత్తుగా ఓడాలి.

  అంతకుముందు, నమీబియాపై న్యూజిల్యాండ్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఇన్నింగ్స్ ఆదిలో తడబడినా.. చివరలో గ్లెన్ ఫిలిప్స్ (39 నాటౌట్‌; 21 బంతుల్లో 1 ఫోర్, మూడు సిక్సులు ), జేమ్స్ నీషమ్‌ (35 నాటౌట్‌; 23 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సులు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 163 పరుగులు చేసింది. దీంతో నమీబియా లక్ష్యం 164 పరుగులుగా మారింది. మార్టిన్ గప్తిల్ (18), డారియల్ మిచెల్‌ (19), దేవాన్ కాన్వే (17) విఫలమయ్యారు. ఇక నమీబియా బౌలర్లలో ఎరాస్మస్‌, డేవిడ్ వీజే, ష్కాల్జ్‌ తలో వికెట్ పడగొట్టారు.


  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిల్యాండ్‌ జట్టును నమీబియా బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (18: ఒక ఫోర్‌, ఒక సిక్స్‌) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ధాటిగా ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ డారియల్ మిచెల్‌(19: రెండు ఫోర్లు) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో కివీస్ డిఫెన్స్‌లో పడింది. ఇలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌(28: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌), డెవాన్‌ కాన్వే (17) ఆచితూచి ఆడారు. అయితే విలియమ్సన్‌ను నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కాన్వే రనౌటయ్యాడు. దాంతో కివీస్ స్కోర్ బోర్డు నెమ్మదించింది.

  ఇది కూడా చదవండి : పాకిస్తాన్ నీచపు బుద్ధి మారదా..? భారత్ -అఫ్గాన్ మ్యాచ్ ఫిక్స్ అంటూ పిచ్చి కూతలు..

  ఈ సమయంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ (39: ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), జేమ్స్ నీషమ్‌ (35: ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు) న్యూజిల్యాండ్‌ జట్టును ఆదుకున్నారు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తోనే.. మరోవైపు బౌండరీలు బాదారు. దాంతో నెమ్మదించిన కివీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫిలిప్స్‌, నీషమ్‌ ఇన్నింగ్స్ చివరివరకు మరో వికెట్ పడనివ్వలేదు. ఈ జోడి 60 పరుగులకు పైగా రన్స్ చేయడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా.. ఆఖర్లో పట్టు కోల్పోయారు. నమీబియా బౌలర్లలో బెమార్డ్‌, వైజ్‌, ఎరాస్మస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Kane Williamson, New Zealand, T20 World Cup 2021, Team india

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు