అదృష్టం కలిసిరాలేదు.. ! అద్భుతం జరగలేదు.. ! 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాకు నిరాశ తప్పలేదు. కీలక మ్యాచులో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన న్యూజిలాండ్ దర్జాగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. 125 పరుగుల టార్గెట్ మరో బంతులు మిగిలుండగానే ఛేజ్ చేసింది. కేన్ విలియమ్సన్ ( 42 బంతుల్లో 40 పరుగులు), డేవాన్ కాన్వే ( 32 బంతుల్లో 36 పరుగులు) అద్భుతంగా రాణించి తమ టీమ్ కు అద్భుత విజయాన్ని అందుకుంది.న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్తాన్125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముజీబ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అహ్మద్ షెజాద్‌కు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్(12 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఔటయ్యాడు. ఆ తర్వాత మార్టిన్ గప్టిల్ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించి స్కోరు వేగం తగ్గకుండా చూసుకున్నాడు. అయితే, 57 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది.
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్టిన్ గప్తిల్(23 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కేన్ విలియన్సన్, డేవాన్ కాన్వే మరో వికెట్ పడకుండా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విక్టరీతో న్యూజిలాండ్ సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గ్రూప్ -2 నుంచి పాకిస్తాన్ ఆల్రెడీ సెమీస్ కు చేరింది. ఈ ఓటమి తో అఫ్గానిస్తాన్ తో పాటు.. టీమిండియా కూడా ఇంటి బాట పట్టనుంది.
New Zealand are into the semis ?#T20WorldCup | #NZvAFG | https://t.co/paShoZpj88 pic.twitter.com/PRo6Ulw4Dk
— T20 World Cup (@T20WorldCup) November 7, 2021
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ పూర్తిగా నిరాశపర్చింది. న్యూజిలాండ్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. అఫ్గాన్ టాపార్డర్, లోయరార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నజీబుల్లా జడ్రాన్(48 బంతుల్ల 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) ఒంటరి పోరాటంతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా మినహా అంతా విఫలమయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/24), ట్రెంట్ బౌల్ట్(3/17) అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అఫ్గానిస్థాన్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మిల్నే, ట్రెంట్ బౌల్ట్ తమ వరుస ఓవర్లలో ఓపెనర్లు మహమ్మద్ షెహ్‌జాద్(4), హజ్రతుల్లా జాజైలను ఔట్ చేశారు. ఆ కొద్ది సేపటికే క్రీజులోకి వచ్చిన రెహ్మానుల్లా గుర్బాజ్(6)ను కూడా సౌతీ పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో అఫ్గాన్ మూడు వికెట్ల నష్టానికి 23 పరుగులు మాత్రమే చేసింది. దాంతో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్ రక్షణాత్మకంగా ఆడే ప్రయత్నం చేశారు. గుల్బాదిన్ నైబ్(15), నజీబుల్లా జడ్రాన్(73) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
అయితే ఈ జోడీని ఇష్ సోదీ విడదీశాడు. గుల్బాదిన్ నైబ్‌ను క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ మహమ్మద్ నబీ(14)తో కలిసి జడ్రాన్ ధాటిగా ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ధాటిగా ఆడే క్రమంలో మహమ్మద్ నబీ, జడ్రాన్ ఔటవ్వడం.. మరోవైపు సిక్సర్లను సైతం న్యూజిలాండ్ ఫీల్డర్స్ అడ్డుకోవడంతో అఫ్గాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసినా.. విలియమ్సన్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, New Zealand, Rashid Khan, T20 World Cup 2021