Home /News /sports /

Nz Vs Afg : టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్.. జట్టులోకి కీలక స్పిన్నర్..

Nz Vs Afg : టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్.. జట్టులోకి కీలక స్పిన్నర్..

Nz Vs Afg

Nz Vs Afg

Nz Vs Afg : ఈ మ్యాచ్ న్యూజిలాండ్.. అఫ్గానిస్థాన్ లకే కాదు.. 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాకూ కీలకమే. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తేనే మనకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాగ్ సర్దుకోవడమే.

ఇంకా చదవండి ...
  టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12, గ్రూప్‌-2లో సెమీస్ చేరేదెవరనే విషయంపై ఇవాళ స్పష్టత రానుంది. కాసేపట్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ కీలక పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ న్యూజిలాండ్.. అఫ్గానిస్థాన్ లకే కాదు.. 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాకూ కీలకమే. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తేనే మనకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాగ్ సర్దుకోవడమే. అందుకే ఎలాగైనా కివీస్‌పై నబీ సేన గెలిచి మన జట్టుకు దారి చూపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది. ఇదే జరిగితే భారత్‌ ఆశలు ఆవిరై, నమీబియాతో జరిగే చివరి మ్యాచ్‌ నామమాత్రమవుతుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, అఫ్గాన్ టీమ్ లోకి గాయంతో బాధపడుతున్న ముజ్ బీర్ రహ్మన్ తిరిగి జట్టులోకి చేరాడు.

  శుక్రవారం నమీబియాపై అలవోకగా నెగ్గిన న్యూజిలాండ్‌.. ఈ మ్యాచ్‌లో రెట్టించిన విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమయ్యాక జట్టును ఆదుకున్న నీషమ్‌, ఫిలిప్స్‌.. నమీబియాకు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు. టోర్నమెంట్లో నిలకడగా రాణిస్తున్న కివీస్‌ బౌలర్లతో అఫ్గాన్‌ బ్యాటర్లకు కూడా సమస్యలు తప్పవు. ఒకరకంగా మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించేది వాళ్లే. కివీస్ లో మార్టిన్ గప్టిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆరంభంలో ధాటిగా ఆడుతూ ప్రత్యర్ధి టీమ్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. కేన్ విలియమ్సన్ ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. డారెల్ మిచెల్, ఫిలిప్స్, జిమ్మీ నీషమ్ వంటి డేంజరస్ బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు.


  అఫ్గాన్‌ బ్యాటర్లు ఓ మాదిరి స్కోరు చేయగలిగితే.. రషీద్‌ ఖాన్‌ నేతృత్వంలోని బౌలింగ్‌ దళం ప్రభావం చూపగలుగుతుంది. హజ్రతుల్లా జజాయ్, అహ్మద్ షెహజాద్ ధాటిగా ఆడితే.. అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేయగలుగుతుంది. అఫ్గాన్ కెప్టెన్ నబీ, గుల్బాదిన్ నబీ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక, అఫ్గాన్ కు వారి బౌలింగే కీలకం. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే కివీస్‌కు సవాలు మాత్రం తప్పదు. న్యూజిలాండ్‌ బ్యాటర్లు మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం కానుంది.

  తుది జట్లు :
  న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే(కీపర్), గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్

  అఫ్గానిస్థాన్ : హజ్రతుల్లా జజాయ్, అహ్మద్ షెహజాద్, రెహ్మతుల్లా గుర్బాజ్, నజీబుల్లా జర్దాన్, గుల్బాదిన్, మహ్మద్ నబీ (కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, హమిద్ హసన్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Afghanistan, New Zealand, T20 World Cup 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు