టీ-20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్తాన్ సాధారణ టార్గెట్ మాత్రమే సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. అఫ్గానిస్తాన్ విజయంపై టీమిండియా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ టార్గెట్ న్యూజిలాండ్ కు ఈజీ అనే చెప్పొచ్చు. అఫ్గానిస్తాన్ లో నజీబుల్లా జాద్రన్ (48 బంతుల్లో 73 పరుగులు 6ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే సూపర్ ఫైట్ చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ సహకరించలేదు. ఇక, అఫ్గానిస్తాన్ బౌలర్లపైనే ఆశలు. వారి న్యూజిలాండ్ బ్యాటర్లను ఎలా కంట్రోల్ చేస్తారన్న దాన్ని బట్టి టీమిండియా సెమీస్ ఆశలు నిలబడతాయ్. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లు, సౌథీ రెండు వికెట్లతో సత్తా చాటారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బంతి నుంచే న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అహ్మద్ షెజాద్(11 బంతుల్లో 4, ఫోర్) అనవసర ప్రయోగం చేసి ఔటయ్యాడు. మిల్నే బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డెవాన్ కాన్వే అద్భుతమైన క్యాచ్ పట్టడంతో షెజాద్ పెవిలియన్ బాట పట్టాడు.
తొలి వికెట్ కోల్పోయిన మరుసటి ఓవర్‌లోనే అఫ్గాన్‌కు మరో షాక్ తగిలింది. నాలుగో ఓవర్ తొలి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి హజ్రతుల్లా జజాయ్(4 బంతుల్లో 2) ఔటయ్యాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా అఫ్గాన్ మూడో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్భాజ్(9 బంతుల్లో 6; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 6 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 23/3. ఆ తర్వాత కాసేపు గుల్బాద్దిన్ నయిబ్, నజీబుల్లా జాద్రాన్ కాసేపు న్యూజిలాండ్ బౌలింగ్ తో పోరాడారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 37 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు.
Najibullah's sensational knock of 73 comes to an end ?
A brilliant effort in the deep from Neesham who takes a stunning catch. #T20WorldCup | #NZvAFG | https://t.co/paShoZpj88 pic.twitter.com/BxEsvWi2FT
— T20 World Cup (@T20WorldCup) November 7, 2021
అయితే, 15 పరుగులు చేసి సెట్ అయినట్టు కన్పించిన గుల్బాద్దీన్ ఇష్ సోథీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అయితే, నజీబుల్లా మాత్రం అడపాదడపా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో నబీ కూడా ఓ చేయి వేయడంతో అఫ్గాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఈ మ్యాచ్ న్యూజిలాండ్.. అఫ్గానిస్థాన్ లకే కాదు.. 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాకూ కీలకమే. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తేనే మనకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాగ్ సర్దుకోవడమే. అందుకే ఎలాగైనా కివీస్‌పై నబీ సేన గెలిచి మన జట్టుకు దారి చూపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది.
ఇదే జరిగితే భారత్ ఆశలు ఆవిరై, నమీబియాతో జరిగే చివరి మ్యాచ్ నామమాత్రమవుతుంది. ఇక, అఫ్గాన్ కు వారి బౌలింగే కీలకం. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే కివీస్‌కు సవాలు మాత్రం తప్పదు. న్యూజిలాండ్ బ్యాటర్లు మధ్య ఓవర్లలో స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం కానుంది.
తుది జట్లు :
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే(కీపర్), గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్
అఫ్గానిస్థాన్ : హజ్రతుల్లా జజాయ్, అహ్మద్ షెహజాద్, రెహ్మతుల్లా గుర్బాజ్, నజీబుల్లా జర్దాన్, గుల్బాదిన్, మహ్మద్ నబీ (కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, హమిద్ హసన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kane Williamson, New Zealand, Rashid Khan, T20 World Cup 2021