T20 World Cup 2021 : కివీస్ కప్ కల నెరేవేరేనా..? న్యూజిలాండ్ పూర్తి బలగం ఇదే..!

New Zealand Team

T20 World Cup 2021 : ప్రతి భారీ అంచనాలతో బరిలోకి దిగడం, ఆ తర్వాత లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టడం.. కీలక నాకౌట్ మ్యాచ్ ల్లో చేతులేత్తేయడం కివీస్ జట్టుకి అలవాటుగా మారింది.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది. ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(New Zealand), అఫ్గానిస్తాన్‌(Afghanistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. ఇక, హాట్ ఫేవరేట్లలో ఒకటైన న్యూజిలాండ్ టీమ్ బలబలాలుపై ఓ లుక్కేద్దాం.

    ప్రతి భారీ అంచనాలతో బరిలోకి దిగడం, ఆ తర్వాత లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టడం.. కీలక నాకౌట్ మ్యాచ్ ల్లో చేతులేత్తేయడం కివీస్ జట్టుకి అలవాటుగా మారింది. గత రెండు వన్డే వరల్డ్ కప్ ల్లో ఫైనల్ కి చేరి.. కప్ ను అందుకోవడంలో విఫలమైంది కివీస్ జట్టు. ఎందరు స్టార్లు ఉన్నా కీలక మ్యాచ్ ల్లో ఫెయిలవ్వడం వారికి పరిపాటిగా మారింది. ఇక, ఈ ఏడాది కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది కేన్ విలియమ్సన్ సేన. తమ ఫస్ట్ వరల్డ్ కప్ టైటిల్ కొట్టాలన్న కసి న్యూజిలాండ్ లో కన్పిస్తోంది. ఇక, కివీస్ కేన్ విలియమ్సన్ సగం బలం. ఈ క్లాసిక్ కెప్టెన్ ఆడే ఆటపైనే న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడ్డాయ్. ఇక, మార్టిన్ గప్తిల్, డేవాన్ కాన్వే, టిమి సైపర్ట్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు న్యూజిలాండ్ ఉన్నారు.

    ఇది కూడా చదవండి : కోహ్లీని సంప్రదించకుండానే బీసీసీఐ కీలక నిర్ణయం..! విరాట్ దూకుడుకు కళ్లెం వేశారా..?

    ఇక న్యూజిలాండ్ బౌలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సీనియర్లు టిమ్ సౌథీ, ట్రెండ్ బౌల్ట్ ల అనుభవం కివీస్ కు ప్లస్ పాయింట్ కానుంది. మరోవైపు, ఐపీఎల్ లో సత్తా చాటిన లూకీ ఫెర్య్గూసన్ మోస్ట్ డేంజరస్ బౌలర్. 150 కి.మీ వేగంతో బంతుల్ని సంధించే లూకీని ఎదుర్కోవడం ఏ ఆటగాడికైనా ఇబ్బందే. జిమ్మీ నీషమ్, కైల్ జెమీసన్ వంటి ఆల్ రౌండర్లు ఆ జట్టు అదనపు బలం. ఇస్ సోథి, మిచెల్ శాంట్నర్ వంటి సీజనల్ స్పిన్నర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు.

    న్యూజిలాండ్ షెడ్యూల్ :



















































    మ్యాచ్ నెం డేట్ మ్యాచ్ టైం వెన్యూ స్టేజ్
    1 అక్టోబరు 26 పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ 07:30 షార్జా సూపర్‌ 12
    2 అక్టోబరు 31 ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
    3 నవంబరు 3 న్యూజిలాండ్‌ వర్సెస్‌ B1 03:30 దుబాయ్‌ సూపర్‌ 12
    4 నవంబరు 5 న్యూజిలాండ్‌ వర్సెస్‌ A2 03:30 షార్జా సూపర్‌ 12
    5 నవంబరు 7 న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12

    కీలక ఆటగాళ్లు : కేన్ విలియమ్సన్, ట్రెండ్ బౌల్ట్, లూకీ ఫెర్య్గూసన్, మార్టిన్ గప్తిల్

    ఈ సారి అంచనా : కనీసం సెమీస్.

    న్యూజిలాండ్ జట్టు : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మెన్, దేవాన్ కాన్వె, లూకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కైల్ జెమీషన్, డార్లీ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైపర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే (ఇంజ్యూరీ కవర్)
    Published by:Sridhar Reddy
    First published: