Home /News /sports /

T20 WORLD CUP 2021 LIVE INDIA VS NEW ZEALAND T20 WORLD CUP 2021 LIVE CRICKET SCORE TEAM INDIA SETS LOWEST TARGET SRD

Ind Vs Nz : కీలక మ్యాచులో చెత్త ఆటతో నిరాశపర్చిన టీమిండియా.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

Team India (PC : ICC)

Team India (PC : ICC)

Ind Vs Nz : మరోసారి చెత్త ఆటతో టీమిండియా నిరాశపర్చింది. వచ్చిన బ్యాటర్.. వచ్చినట్టు భారీ షాట్లుకు ప్రయత్నించి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఫలితం.. టీమిండియా సెమీస్ కు దూరమయ్యేలా ఉంది.

    టీ-20 ప్రపంచకప్ లో డూ ఆర్ డై మ్యాచులో టీమిండియా మరోసారి నిరాశపర్చింది. టాస్ ఓడిపోయి భారీ టార్గెట్ సెట్ చేయాల్సిన టీమిండియా.. స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. మరో వైపు, ఇష్ సోథీ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రతి ఒక్క కివీస్ బౌలర్ కట్టుదిట్టంగా బంతులేసి టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపారు. బౌలర్లు ఏదైనా అద్భుతం సృష్టిస్తే తప్ప.. టీమిండియా ఈ మ్యాచులో గెలవడం కష్టం. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మరోసారి శుభారంభం లభించలేదు. పాక్ తో మ్యాచ్ కన్నా.. ఈ గేమ్ లో భారత బ్యాటర్లు మరింత నిరాశపర్చారు. వచ్చిన ప్రతి బ్యాటర్ భారీ షాట్ కు ప్రయత్నించి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఈ మ్యాచ్ లో రోహిత్ కు బదులు కేఎల్ రాహుల్ తో ఇషాన్ జోడిని ఓపెనర్ గా పంపించింది టీమిండియా. ఈ ప్రయోగం ఎటువంటి మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. భారీ షాట్ కు యత్నించిన ఇషాన్ కిషన్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో డార్లీ మిచెల్ కు బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడు 8 బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.

    ఆ తర్వాత కొన్ని షాట్లు ఆడిన కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా ఆడటానికి ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు. కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ లో డార్లీ మిచెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు, గోల్డెన్ డకౌట్ ను తప్పించుకున్న రోహిత్ శర్మ.. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇష్ సోథి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ శర్మ (14 పరుగులు) గప్టిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

    గత మ్యాచులో ఇన్నింగ్స్ చక్కదిద్దిన కోహ్లీ కూడా ఈ సారి నిరాశపర్చాడు. 17 బంతుల్లో 9 పరుగులు చేసిన కోహ్లీ.. ఇష్ సోథీ బౌలింగ్ లోనే బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కొంచెం సేపు నెమ్మదిగా ఆడారు. అయితే, 19 బంతుల్లో 12 పరుగులు చేసిన పంత్.. ఆడమ్ మిల్నే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది భారత్. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 23 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

    ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. భువనేశ్వర్ కుమార్ ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చారు. ఇక, న్యూజిలాండ్ టీమ్ టిమ్ సైఫర్ట్ బదులు ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. సెమీస్ బరిలో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ కీలకమే.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ఇప్పటివరకూ టీ20 టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు 16 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 8 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా.. మరో 8 మ్యాచ్‌ల్లో కివీస్ గెలుపొందింది. గత ఐదు టీ20ల్లో భారత్ గెలవడం విశేషం. అయితే రెండు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కివీస్ విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య దుబాయ్ మైదానంలో టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.

    తుది జట్లు :

    భారత్‌: రోహిత్‌ శర్మ, లోకేష్ రాహుల్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

    న్యూజిలాండ్‌: మార్టిన్ గప్టిల్‌, డారిల్ మిషెల్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), దేవాన్ కాన్వే, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్‌, జోష్ ఫిలిప్స్‌, మిచెల్ శాంట్నర్‌, ఐష్ సోధి, ట్రెంట్ బోల్ట్‌, టీమ్ సౌథీ.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Hardik Pandya, Ind vs Nz, India vs newzealand, Rohit sharma, T20 World Cup 2021, Virat kohli

    తదుపరి వార్తలు