T20 WORLD CUP 2021 LIVE INDIA VS NEW ZEALAND T20 WORLD CUP 2021 LIVE CRICKET SCORE TEAM INDIA SCORE DETAILS VIRAT KOHLI OUT SRD
Ind Vs Nz : మరోసారి తడబడ్డ టీమిండియా.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కోహ్లీసేన..
Photo Credit : Twitter
Ind Vs Nz : టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తమ ఇన్నింగ్స్ ని నెమ్మదిగా ప్రారంభించింది. కేవలం ఆరు ఓవర్లకి ఆశ్చర్యకరంగా.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ల్ని ఓపెనర్లుగా పంపింది. కానీ, ఈ ప్రయోగం టీమిండియాకు మంచి ఫలితం ఇవ్వలేదు.
టీ-20 ప్రపంచకప్ లో డూ ఆర్ డై మ్యాచులో టీమిండియా మరోసారి తడబడింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచులో టీమిండియా 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు ఆదిలోనే మరోసారి రెండు వికెట్లు కోల్పోయింది.భారీ షాట్ కు యత్నించిన ఇషాన్ కిషన్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో డార్లీ మిచెల్ కు బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడు 8 బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. 11 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి సౌథీ బౌలింగ్ ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా భారీ షాట్ కు యత్నించి ఔటవ్వడం విశేషం. అయితే, వెంటనే వచ్చిన రోహిత్ శర్మ రెండో గోల్డెన్ డకౌట్ నుంచి తప్పించుకున్నాడు. బౌల్డ్ బౌలింగ్ లో ఫస్ట్ బంతికే భారీ షాట్ ఆడిన రోహిత్ శర్మ క్యాచ్ ను ఆడమ్ మిల్నే మిస్ చేశాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తమ ఇన్నింగ్స్ ని నెమ్మదిగా ప్రారంభించింది. కేవలం ఆరు ఓవర్లకి రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు మాత్రమే చేసింది. ఆ వెంటనే రోహిత్ శర్మ కూడా భారీ షాట్ కు యత్నించి ఇష్ సోథి బౌలింగ్ లో గప్టిల్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఆ తర్వాత ఇష్ సోథి బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన కోహ్లీ కూడా పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లీ 17 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
Kohli is gone ☝️
Trying to up the ante, he attempts a big one against Sodhi but fails.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. భువనేశ్వర్ కుమార్ ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చారు. ఇక, న్యూజిలాండ్ టీమ్ టిమ్ సైఫర్ట్ బదులు ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. సెమీస్ బరిలో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ కీలకమే.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఇప్పటివరకూ టీ20 టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు 16 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 8 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా.. మరో 8 మ్యాచ్ల్లో కివీస్ గెలుపొందింది. గత ఐదు టీ20ల్లో భారత్ గెలవడం విశేషం. అయితే రెండు ప్రపంచకప్ మ్యాచ్ల్లో కివీస్ విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య దుబాయ్ మైదానంలో టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.