T20 World Cup : టీమిండియాను వేధిస్తోన్న సమస్యకు పరిష్కారం దొరికిందా..? దుబాయ్ అందుకు వేదిక కానుందా..?

Team India

T20 World Cup : టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దాయాది పాకిస్థాన్ (Pakistan) చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక, సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే.

  • Share this:
    యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దాయాది పాకిస్థాన్ (Pakistan) చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక, సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే. ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నెట్స్ లో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. బుధవారం కోహ్లీసేన.. దుబాయ్ లో నెట్ ప్రాక్టీస్ చేసింది.

    ఈ ప్రాక్టీస్ సందర్భంగా భారత అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. అసలు విషయం ఏంటంటే..టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. నెట్స్‌లో హార్దిక్ పాండ్య పూర్తి శక్తితో బౌలింగ్ చేయడంతోపాటు అతని పేస్ ఆశ్చర్యపరిచింది. టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు.

    కానీ అతడు బౌలింగ్‌ చేయడానికి ఇంకా ఫిట్‌గా లేనట్లుగా కన్పించాడు. అందుకే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌ చేయలేదు. ఇక బ్యాట్‌తోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే యూఏఈలో ఐపీఎల్ 2021లో కూడా పెద్దగా రాణించలేదు. గత కొంత కాలంగా హార్దిక్ ఫామ్‌లో లేడు.


    అయితే ప్రస్తుతం పాండ్యా బౌలింగ్‌ను తరువాతి మ్యాచులో చూడొచ్చు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడంతో టీమిండియా జట్టు కూర్పు అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం ఈ ఆటగాడు బౌలింగ్‌ చేసేందుకు ఫిట్‌గా ఉన్నప్పటికీ, న్యూజిలాండ్‌పై టీమిండియా బలంగా కనిపిస్తుంది. పాండ్యా బౌలింగ్ చేయడానికి పూర్తి ఫిట్‌గా ఉంటే, ఖచ్చితంగా రెండవ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం అవ్వనున్నాడు. దీంతో టీమిండియా ఆరో బౌలర్ సమస్యకు పరిష్కారం దొరికినట్టే అని క్రీడాభిమానులు భావిస్తున్నారు.


    ఇక, ఈ ఆదివారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో పాటు పాకిస్తాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్‌కు తొలి పోటీదారుగా మారింది.

    ఇది కూడా చదవండి : గంగూలీ పాలిట శాపంగా ఐపీఎల్ కొత్త జట్లు.. కీలక పదవికి దాదా రాజీనామా..!

    దీంతో సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ కీలకం. న్యూజిలాండ్ తర్వాత అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా లాంటి జట్లతో టీమిండియా మ్యాచులున్నాయ్. దీంతో, న్యూజిలాండ్ ను ఓడిస్తే.. టీమిండియా పని ఈజీ అవుతోందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: