Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Nz : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియాలో రెండు మార్పులు..

Ind Vs Nz : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియాలో రెండు మార్పులు..

Ind Vs Nz

Ind Vs Nz

Ind Vs Nz : మెగాటోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం సమాయత్తం అవుతోంది. న్యూజిలాండ్‌తో (India Vs New Zealand) దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

టీ-20 వరల్డ్ కప్ 2021 అసలు సిసలు పోరుకు రెడీ అయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తాడోపేడో తేల్చుకోనుంది టీమిండియా. సెమీస్ బరిలో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ కీలకమే. మెగాటోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం సమాయత్తం అవుతోంది. న్యూజిలాండ్‌తో (India Vs New Zealand) దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం అదే పాకిస్థాన్ చేతిలో ఓడి.. భారత పరిస్థితినే ఎదుర్కొంటుంది. దీంతో, ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. భువనేశ్వర్ కుమార్ ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చారు. ఇక, న్యూజిలాండ్ టీమ్ టిమ్ సైఫర్ట్ బదులు ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది.

లోకేష్ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలతో భారత బ్యాటింగ్ లైనప్‌ బలంగా కనిపిస్తోంది. అయితే కోహ్లీ, పంత్ తప్ప పాక్ మ్యాచులో అందరూ తేలిపోయారు. ఈ మ్యాచ్‌లోనైనా అందరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయరేమో చూడాలి. పాక్‌తో మ్యాచ్‌లో పరాభవం తర్వాత భారత జట్టులో అత్యంత విమర్శలు ఎదుర్కొన్నది పాండ్యానే.

అతను చాన్నాళ్లుగా పేరుకే ఆల్‌రౌండర్‌గా ఉంటున్నాడు కానీ బౌలింగ్‌ చేయట్లేదు. కేవలం బ్యాటింగ్‌తో జట్టులో ఉండేంతగా.. మెరుపులు మెరిపించట్లేదు. పాక్‌తో మ్యాచ్‌లోనూ దారుణంగా తేలిపోయాడు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ అంచనాలకు తగ్గట్లు చెలరేగడం భారత్‌కు కీలకం. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజా కూడా మాయ చేయాలని జట్టు ఆశిస్తోంది

మరోవైపు న్యూజిలాండ్‌కు కూడా ఇది చావో రేవో మ్యాచ్ కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తుందనడంతో సందేహం లేదు. అయితే బ్యాటింగ్‌లో కివీస్‌ ఇబ్బందుల ఎదుర్కోంటోంది. కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ సరైన ఫామ్‌లో లేడు. మార్టిన్ గప్తిల్‌కు గాయమైంది. విలియమ్సన్‌ మ్యాచ్‌ ఆడటం ఖాయమే కానీ.. గప్తిల్‌ విషయం తేలాల్సి ఉంది.

కేన్‌, గప్తిల్‌లతో పాటు డారిల్ మిచెల్‌, దేవాన్ కాన్వే, జోష్ ఫిలిప్స్‌, జేమ్స్ నీషమ్‌లతో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. నీషమ్‌, శాంట్నర్‌ బ్యాటుతో, బంతితో రాణించగలరు. అయితే బ్యాటర్లలో ఎవ్వరూ అంత జోరు మీద లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సరైన ఫినిషర్‌ కూడా కివీస్‌కు లేడు. ఇది మనకు కలిసొచ్చే అంశమే. టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ కీలక మ్యాచ్‌ల్లో గొప్పగా బౌలింగ్‌ చేస్తారు. వారికి భారత బ్యాట్స్‌మెన్‌పై మంచి అవగాహన ఉంది. శాంట్నర్‌, ఇష్‌ సోధీలతో కివీస్‌ స్పిన్‌ కూడా బాగానే ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డులు :

ఇప్పటివరకూ టీ20 టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు 16 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 8 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా.. మరో 8 మ్యాచ్‌ల్లో కివీస్ గెలుపొందింది. గత ఐదు టీ20ల్లో భారత్ గెలవడం విశేషం. అయితే రెండు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కివీస్ విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య దుబాయ్ మైదానంలో టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.

తుది జట్లు :

భారత్‌: రోహిత్‌ శర్మ, లోకేష్ రాహుల్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్‌: మార్టిన్ గప్టిల్‌, డారిల్ మిషెల్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), దేవాన్ కాన్వే, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్‌, జోష్ ఫిలిప్స్‌, మిచెల్ శాంట్నర్‌, ఐష్ సోధి, ట్రెంట్ బోల్ట్‌, టీమ్ సౌథీ.

First published:

Tags: Ind vs Nz, India vs newzealand, Kane Williamson, T20 World Cup 2021, Virat kohli

ఉత్తమ కథలు