Home /News /sports /

T20 WORLD CUP 2021 INDIA VS ENGLAND WARM UP MATCH CANCELED CHECK WARM UP MATCHES NEW SCHEDULE JNK

T20 World Cup: టీమ్ ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు.. ఆ జట్టుతో మ్యాచ్ రద్దు.. వేదిక మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

పురుషుల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఐసీసీ (PC: ICC)

పురుషుల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఐసీసీ (PC: ICC)

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా ఐసీసీ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. క్వాలిఫయర్, సూపర్ 12 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేకపోయినా.. వార్మప్ మ్యాచ్‌లలో మార్పులు జరిగాయి.

    పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నది. అక్టోబర్ 16 నుంచి 22 వరకు ఒమన్ వేదికగా క్వాలిఫయర్ (Qualifiers) మ్యాచ్‌లు జరుగనున్నాయి. అదే సమయంలో భారత జట్టు (Team India) రెండు వార్మప్ మ్యాచ్‌లు (Warmup Matches) కూడా ఆడనున్నది. గతంలో తొలి వార్మప్ ఆస్ట్రేలియాతో, రెండో వార్మప్ ఇంగ్లాండ్‌తో ఆడాలని నిర్ణయించారు. కానీ తాజాగా ఐసీసీ (ICC) ఈ మ్యాచ్‌లలో మార్పులు చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌ను రద్దు చేసింది. కొత్త షెడ్యూల్ (New Schedule)  ప్రకారం భారత జట్టు అక్టోబర్ 18న ఆస్ట్రేలియాతో, 20న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నది. ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సి ఉండగా వేదికలో కూడా మార్పు చేసింది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆడనున్నది.

    ఐసీసీ విడుదల చేసిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్

    అక్టోబర్ 14 - ఉదయం 11.30 గంటలు - పపువా న్యూ గినియా Vs శ్రీలంక - టోలరెన్స్ ఓవల్
    అక్టోబర్ 14 - ఉదయం 11.30 గంటలు - బంగ్లాదేశ్ Vs ఐర్లాండ్ - అబుదాబి
    అక్టోబర్ 14 - ఉదయం 11.30 గంటలు - నమీబియా Vs స్కాట్లాండ్ - దుబాయ్
    అక్టోబర్ 14 - ఉదయం 11.30 గంటలు - నెదర్లాండ్స్Vs ఒమన్ - దుబాయ్

    అక్టోబర్ 18 - మధ్యాహ్నం 3.30 గంటలు - న్యూజీలాండ్ Vs వెస్టిండీస్ - అబుదాబి
    అక్టోబర్ 18 - మధ్యాహ్నం 3.30 గంటలు - అఫ్గానిస్తాన్ Vs సౌతాఫ్రికా - దుబాయ్
    అక్టోబర్ 18 - రాత్రి 7.30 గంటలు - ఇంగ్లాండ్ Vs పాకిస్తాన్ - టోలరెన్స్ ఓవల్
    అక్టోబర్ 18 - రాత్రి 7.30 గంటలు - ఆస్ట్రేలియా Vs ఇండియా - దుబాయ్

    అక్టోబర్ 20 - మధ్యాహ్నం 3.30 గంటలు - పాకిస్తాన్ Vs వెస్టిండీస్ - టోలరెన్స్ ఓవల్
    అక్టోబర్ 20 - మధ్యాహ్నం 3.30 గంటలు - ఆఫ్గానిస్తాన్ Vs ఆస్ట్రేలియా - దుబాయ్
    అక్టోబర్ 20 - రాత్రి 7.30 గంటలు - ఇంగ్లాండ్ Vs న్యూజీలాండ్ - అబుదాబి
    అక్టోబర్ 20 - రాత్రి 7.30 గంటలు - ఇండియా Vs సౌతాఫ్రికా - దుబాయ్





    ఇక క్వాలిఫయర్, సూపర్ 12 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ఐసీసీ ప్రకటించింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: ICC, T20 World Cup 2021, Team india

    తదుపరి వార్తలు