హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Sco : టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ టోర్నీలో తొలిసారి టాస్ గెలిచిన కోహ్లీ..

Ind Vs Sco : టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ టోర్నీలో తొలిసారి టాస్ గెలిచిన కోహ్లీ..

ఆస్ట్రేలియా జట్టులో ఏకైక స్పిన్నర్‌గా  బౌలర్‌ ఆడం జంపాను ఎంపిక చేశారు. ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్‌ బౌల్ట్,అన్రిచ్ నోర్ట్జే చోటు దక్కింది.  దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్‌.. ఐదో స్ధానంలో చోటు దక్కించకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో ఇంగ్లండ్‌ ఆటగాడు మోయిన్‌ ఆలీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌  హసరంగాకు స్ధానం దక్కింది.

ఆస్ట్రేలియా జట్టులో ఏకైక స్పిన్నర్‌గా బౌలర్‌ ఆడం జంపాను ఎంపిక చేశారు. ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్‌ బౌల్ట్,అన్రిచ్ నోర్ట్జే చోటు దక్కింది. దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్‌.. ఐదో స్ధానంలో చోటు దక్కించకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో ఇంగ్లండ్‌ ఆటగాడు మోయిన్‌ ఆలీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌ హసరంగాకు స్ధానం దక్కింది.

Ind Vs Sco : న్యూజిలాండ్ మ్యాచులో స్కాట్లాండ్ ఎలా చెలరేగిందో మనం చూశాం కదా. దీన్ని బట్టి ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకుండా టీమిండియా దూకుడుగా ఆడాలి. కాస్తో కూస్తో ఉన్న సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకోవాలి.

ఇంకా చదవండి ...

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2021 )లో అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత్.. మరో కీలక పోరుకు రెడీ అయింది సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ముందుగా టీమిండియా నెక్ట్స్ తన రెండు మ్యాచుల్లో విక్టరీ కొట్టాలి. స్కాట్లాండ్, నమీబియాలతో పోరు ఈజీగానే ఉండొచ్చు. కానీ, ఆ జట్టుల్లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ మ్యాచులో స్కాట్లాండ్ ఎలా చెలరేగిందో మనం చూశాం కదా. దీన్ని బట్టి ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకుండా టీమిండియా దూకుడుగా ఆడాలి. కాస్తో కూస్తో ఉన్న సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకోవాలి. లేకుంటే మ్యాచ్ గెలిచినా పెద్దగా ఫలితం ఉండదు. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకంది. ఈ మెగాటోర్నీలో కోహ్లీ టాస్ గెలవడం ఇదే తొలిసారి. ఇక, ఈ మ్యాచులో శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకుంది టీమిండియా. ముగ్గురు స్పిన్నర్లతో ఎటాకింగ్ కు దిగనుంది.

ఈ మ్యాచులో మరోసారి రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul) ఓపెనింగ్ కు దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి రావడం టీమిండియాకు కలిసివస్తోంది. ఎందుకంటే అతడు స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొగలడు. పదే పదే రవిచంద్రన్ అశ్విన్‌ను విస్మరిస్తుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో గత మ్యాచులో అతన్ని జట్టులోకి తీసుకువచ్చింది టీమిండియా. ఈ మార్పు టీమిండియాకు మంచి చేసిందనే చెప్పాలి. అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

గత మ్యాచులో చేసిన ప్రయోగాలన్నీ టీమిండియాకు కలిసివచ్చాయ్. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చినా పంత్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్లతో చెలరేగారు. వారి ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు, గత మ్యాచులో కోహ్లీకి బ్యాటింగ్ కు దిగలేదు. ఈ మ్యాచులో టీమిండియా మంచి రన్ రేట్ సాధించాలంటే.. అందరూ బ్యాటర్లు రాణించాల్సేంది.

ఆఖర్లో రవీంద్రజడేజా, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లు ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ మరోసారి సత్తా చాటాలి. గత మ్యాచ్ అఫ్గానిస్థాన్ తో తలపడిన జట్టునే టీమిండియా స్కాట్లాండ్ మీద కొనసాగించవచ్చు.ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ ప్లస్ లోకి వచ్చింది. - 1.609 నుంచి +0.073కి టీమిండియా నెట్ రన్ రేట్ పెరిగింది. మరోవైపు అఫ్గానిస్థాన్ నెట్ రన్ రేట్ +3.097 నుంచి +1.481 కి తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ రన్ రేట్ +0.816. సెమీస్ మీద ఆశలు ఉంచుకోవాలంటే స్కాట్లాండ్ ను టీమిండియా చిత్తుగా ఓడించాల్సిందే.

మరో‌వైపు పసికూన అయిన స్కాట్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత పోరాటం కనబర్చిన స్కాట్లాండ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాబట్టి ఆ జట్టును ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆ టీమ్ లో కైల్ కోజెర్, రిచీ బెర్రింగ్టన్, మైకేల్ లీస్క్ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ లో మార్క్ వాట్, ఈవాన్స్, వీల్ కీలకం కానున్నారు.ఇక భారత్, స్కాట్లాండ్ జట్లు ఇప్పటి వరకూ టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్కసారి తలపడ్డాయి. 2007 టీ20 వరల్డ్‌కప్‌‌లో భాగంగా జరగబోయిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ.. వర్షం కారణంగా ఒక బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. ఆ తర్వాత ఎప్పుడూ ఈ జట్లు టీ20 వరల్డ్‌కప్‌లో తలపడలేదు.

తుది జట్లు

భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తీ, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోజెర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్, రిచీ బెర్రింగ్టన్, కలమ్ మెక్‌లెడ్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలాస్‌డైర్ ఈవాన్స్, బ్రాడ్‌లీ వీల్

First published:

Tags: Cricket, Ravichandran Ashwin, Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli

ఉత్తమ కథలు