Home /News /sports /

T20 WORLD CUP 2021 IND VS SCO LIVE UPDATES TEAM INDIA BOWLERS RESTRICTED SCOTLAND TO LOWEST TOTAL SRD

Ind Vs Sco : బౌలింగ్ అదిరింది.. ఇక, బ్యాటర్ల మెరుపులే మిగిలాయ్.. భారత్ టార్గెట్ ఎంతంటే..

Team India ( ICC Twitter)

Team India ( ICC Twitter)

Ind Vs Sco : స్కాట్లాండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు టీమిండియా బౌలర్లు. ఇక, బ్యాటర్లు ఎంత వేగంగా ఆడి ఈ టార్గెట్ ను ఛేజ్ చేస్తారన్నది ఇప్పుడు కీలకం.

    దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచులో టీమిండియా బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు. 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయింది స్కాట్లాండ్. టీమిండియా బౌలర్ల దెబ్బకి పూర్తి కోటా ఆడలేకపోయింది పసికూన. టీమిండియా బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లతో దుమ్ము దులిపారు. బుమ్రా రెండు వికెట్లతో సత్తా చాటాడు. స్కాట్లాండ్ లో మున్సే (19 బంతుల్లో 24 ఫోర్లు.. 4 ఫోర్లు, 1 సిక్సర్), లీస్క్ ( 12 బంతుల్లో 21 పరుగులు.. 2 ఫోర్లు, 1 సిక్సర్) తప్ప మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. టాస్ ఓడిపోయి కొయెట్జర్‌(1) రూపంలో స్కాట్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కొయెట్జర్‌ను బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మున్సే ధాటిగా ఆడటానికి ప్రయత్నించాడు.అయితే, మున్సీ దూకుడు షమీ బ్రేకులు వేశాడు. 24 పరుగుల చేసిన మున్సే, షమీ బౌలింగ్‌లో హార్ధిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా షో మొదలైంది.

    స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 7వ ఓవర్‌ వేసిన జడేజా.. రెండు వికెట్లను పడగొట్టి ప్రత్యర్ధి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయతే, ఆ తర్వాత లీస్క్ కాసేపు భారీ షాట్లు ఆడాడు. అయితే, 12 బంతుల్లో 21 పరుగులు చేసిన లీస్క్ ను మరోసారి జడేజా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీస్ గ్రీవ్స్ (1) అశ్విన్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖర్లో సూపర్ యార్కర్లతో చెలరేగడంతో స్కాట్లాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక, ఈ టార్గెట్ ను టీమిండియా ఎంత వేగంగా ఛేజ్ చేస్తే అంత మంచిది.


    ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకంది. ఈ మెగాటోర్నీలో కోహ్లీ టాస్ గెలవడం ఇదే తొలిసారి. ఇక, ఈ మ్యాచులో శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకుంది టీమిండియా.ఈ మ్యాచులో మరోసారి రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul) ఓపెనింగ్ కు దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి రావడం టీమిండియాకు కలిసివస్తోంది. ఎందుకంటే అతడు స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొగలడు. పంత్, హార్దిక్ భారీ షాట్లతో చెలరేగాలి.

    ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ ప్లస్ లోకి వచ్చింది. - 1.609 నుంచి +0.073కి టీమిండియా నెట్ రన్ రేట్ పెరిగింది. మరోవైపు అఫ్గానిస్థాన్ నెట్ రన్ రేట్ +3.097 నుంచి +1.481 కి తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ రన్ రేట్ +0.816. సెమీస్ మీద ఆశలు ఉంచుకోవాలంటే స్కాట్లాండ్ ను టీమిండియా చిత్తుగా ఓడించాల్సిందే.

    తుది జట్లు

    భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తీ, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

    స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోజెర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్, రిచీ బెర్రింగ్టన్, కలమ్ మెక్‌లెడ్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలాస్‌డైర్ ఈవాన్స్, బ్రాడ్‌లీ వీల్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Jasprit Bumrah, Mohammed Shami, Ravindra Jadeja, T20 World Cup 2021, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు