Ind Vs Pak : మెగాటోర్నీలో దాయాదిపై కోహ్లీ రికార్డు బ్రేక్..! చరిత్రలో తొలిసారి ఇలా..

Photo Credit : Twitter

Ind Vs Pak : కోట్లాది మంది భారతీయుల ఆశల్ని టీమిండియా నట్టేట ముంచింది. కనీస పోటి ఇవ్వకుండా తలదించుకునేలా చేసింది. చరిత్రను తిరగరాస్తూ.. ప్రపంచకప్ (World Cup History) ల్లో తమ కున్న చెత్త రికార్డుకు బ్రేక్ వేస్తూ.. పాకిస్థాన్ తొలిసారి కసిగా టీమిండియా (India Vs Pakistan)ను ఓడించారు.

  • Share this:
    అంచనాలు తలకిందులయ్యాయి. చరిత్రలో తొలిసారి ప్రత్యర్ధి మనపై పై చేయి సాధించింది. కోట్లాది మంది భారతీయుల ఆశల్ని టీమిండియా నట్టేట ముంచింది. కనీస పోటి ఇవ్వకుండా తలదించుకునేలా చేసింది. చరిత్రను తిరగరాస్తూ.. ప్రపంచకప్ (World Cup History) ల్లో తమ కున్న చెత్త రికార్డుకు బ్రేక్ వేస్తూ.. పాకిస్థాన్ తొలిసారి కసిగా టీమిండియా (India Vs Pakistan)ను ఓడించారు. వన్డే, టీ20 ప్రపంచకప్పుల్లో ఇప్పటిదాకా టీమిండియా చేతిలో 12 సార్లు ఓడిన దాయాది.. ఆ కసినంతా ఈ మ్యాచులో తీర్చుకుంది. ఇలా ఆదివారం దుబాయ్‌లో ఏకపక్షంగా సాగిన టీ20 ప్రపంచకప్‌పాక్‌ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. 152 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేజ్ చేసింది. సూపర్ బ్యాటింగ్ తో చెలరేగిన ఆ జట్టు ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (79 నాటౌట్‌; 55 బంతుల్లో 6×4, 3×6), బాబర్‌ అజామ్‌ (68 నాటౌట్‌; 52 బంతుల్లో 6×4, 2×6) జట్టుకు మరపురాని విజయాన్నందించి తమ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తారు.

    అంతకుముందు భారత్‌ ఓటమిని ఖాయం చేసింది వారి బౌలర్ షహీన్‌ షా అఫ్రిది (3/31)నే. అతడితో పాటు హసన్‌ అలీ (2/44), షాదాబ్‌ ఖాన్‌ (1/22), హ్యారిస్‌ రవూఫ్‌ (1/25) కూడా సత్తా చాటడంతో భారత్‌ 151/7కు పరిమితమైంది. కెప్టెన్‌ కోహ్లి (57; 49 బంతుల్లో 5×4, 1×6) ప్రతికూల పరిస్థితుల్లో బాగా ఆడినా, రిషబ్‌ పంత్‌ (39; 30 బంతుల్లో 2×4, 2×6) కూడా కాస్త మెరుపులు మెరిపించినా.. అవి సరిపోలేదు. భారత్‌ వచ్చే ఆదివారం తన తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో ఇక భారత్‌కు ప్రతి మ్యాచ్‌ పరీక్షే.

    ఇక, ఫస్ట్ టైం విరాట్ కోహ్లీ మెగాటోర్నీలో పాకిస్థాన్ పై ఔటయ్యాడు, గత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో 2012లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. కానీ, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 57 పరుగులు చేసి షహీన్ షా బౌలింగ్ లో ఔటయ్యాడు.

    ఇది కూడా చదవండి : అప్పుడే మొదలెట్టేశారుగా..! కొట్టుకోవడం ఒక్కటే తక్కువ.. బంగ్లా-లంక మ్యాచ్ లో రచ్చ..

    ఇక, ఈ మ్యాచ్ తర్వాత తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడంతో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మంచుతో పాటు పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన తమ జట్టు పతనాన్ని శాసించిందన్నాడు. ఆరంభం నుంచి మ్యాచ్ ముగిసే వరకు పాక్ ఆటగాళ్లు తమపై ఆధిపత్యం చెలాయించారని, వారి అద్భుత ఆటతీరుకు తలవంచక తప్పలేదని విరాట్ చెప్పుకొచ్చాడు.
    Published by:Sridhar Reddy
    First published: