Ind Vs Pak : " బాబర్ అజామ్ అసలు నీ ప్లాన్ ఏంటి..? టీమిండియాను చూసి నేర్చుకో.. "

Team Pakistan

Ind Vs Pak : అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. క్వాలిఫైయర్స్, ప్రాక్టీస్ మ్యాచ్ లతో అభిమానులకు బోలెడంత కిక్ ఇస్తోంది. ఇక, అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక, టీమిండియా, పాకిస్థాన్ జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడేశాయ్. టీమిండియా రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే.. దాయాది పాక్ ఒక మ్యాచ్ లో నెగ్గి.. మరో గేమ్ లో ఓటమి పాలైంది. అయితే, పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే జట్టుతో బరిలోకి దిగింది. జట్టులో ఎంపిక అయినా... మిగతా వాళ్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. మరోవైపు, టీమిండియా మాత్రం అందరి ప్లేయర్లకు సరిపడా ప్రాక్టీస్ అందేలా ప్లాన్ చేసుకుంది.

  దీంతో.. పాకిస్థాన్‌ జట్టుపై ఆ జట్టు మాజీ ఓపెనర్ సల్మాన్‌ భట్‌ (Salman Butt) మండిపడ్డాడు. వార్మప్ మ్యాచ్‌ల్లో యువకులు, ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా.. ప్రధాన ఆటగాళ్లు ఆడటం ఏంటని ప్రశ్నించాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (Babar Azam) ప్లాన్ ఏంటో అసలు అర్ధం కావడం లేదన్నాడు. పాకిస్థాన్‌ ప్రస్తుతం అభద్రతాభావంలో ఉందనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తుందని సల్మాన్‌ భట్‌ ఫైరయ్యాడు. భారత్ వార్మప్‌ మ్యాచ్‌లను బాగా ఉపయోగించుకుందన్నాడు.

  పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్


  సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ ... " భారత జట్టు వార్మప్‌ మ్యాచ్‌లను బాగా ఉపయోగించుకుంది. ప్రతి ఒక్కరు ఐపీఎల్‌ ఆడి వచ్చినా.. అందరికీ అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఇలా కాకుండా అత్యుత్తమ పదకొండు మందే వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఆడినా వాళ్లని సమర్థించొచ్చు. ఎందుకంటే.. ఐపీఎల్‌లో వాళ్లంతా ఒకే జట్టు తరఫున ఆడలేదు. ఇప్పుడు జట్టుగా ఆడారని వాదించొచ్చు. అయినా కూడా భారత జట్టులో ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ జట్టులో ఎలాంటి అభద్రతాభావాలు ఉన్నాయో నాకు అసలు అర్థం కావడం లేదు. బాబర్‌ అజామ్ ఓ కెప్టెన్. అతడు ఆటగాళ్లు అందరినీ ఉపయోగించుకోవాలి. ఇంకెప్పుడు ఇవన్ని తెలుసుకుంటావ్ " అని మండిపడ్డాడు.

  వార్మప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ తొలుత వెస్టిండీస్‌పై గెలుపొందినా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ ప్రధాన ఆటగాళ్లతోనే ఆడింది. మరోవైపు భారత్ కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా , రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లకు అవకాశం ఇచ్చింది.

  ఇది కూడా చదవండి : స్క్విడ్ గేమ్‌ చాలెంజ్ లో టీమిండియా ఆటగాళ్లు.. ఈ గేమ్ లో కూడా ఆ స్టార్ ప్లేయరే విన్నర్..

  వాళ్లంతా బాగా ఆడారు. భువీ మొదటి మ్యాచులో తేలిపోయినా.. రెండో మ్యాచులో ఫామ్ అందుకున్నాడు. ఇలానే అందరూ రాణించారు. దీంతో జట్టులోకి ఎవర్నీ తీసుకోవాలన్న దానిపై కోహ్లీకి ఓ క్లారిటీ వచ్చిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: