Home /News /sports /

T20 WORLD CUP 2021 IND VS PAK PAKISTAN CRICKET TEAM ANNOUNCED 12 MEMBER SQUAD THAT WILL TAKE ON TEAM INDIA IN THEIR OPENING ENCOUNTER SRD

Ind Vs Pak : కీలక పోరుకు ముందు పాక్ దూకుడు.. 12 మందితో జట్టును ప్రకటించిన దాయాది..!

Team Pakistan

Team Pakistan

Ind Vs Pak : టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

  టీ20 వరల్డ్‌కప్ 2021 (T-20 World Cup 2021) టోర్నీ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ షూరు అయింది. సూపర్ 12 రౌండ్‌లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చేసింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ తలబడడం ఇది ఆరోసారి.నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది. రెండేళ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ లు మళ్లీ గ్రౌండ్ లో హోరాహోరిగా తలపడబోతున్న సందర్భంలో ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ కీలక పోరుకు ముందు దాయాది పాకిస్థాన్ దూకుడును ప్రదర్శించింది.

  ఈ మ్యాచ్‌కి ఒకరోజు ముందే 12 మందితో కూడా జట్టును ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది పాకిస్తాన్. బాబర్ అజామ్ కెప్టెన్‌గా వ్యవహరించే పాక్ జట్టులో సీనియర్లకే పట్టం కట్టారు. మహ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపికయ్యాడు. అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ బ్యాటర్లుగా .. ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్ ఆల్‌రౌండర్లుగా... హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ బౌలర్లుగా ఎంపికయ్యారు.

  అయితే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఒక్కరోజు ముందుగా జట్టును ప్రకటించడానికి ఇష్టపడలేదు. ప్లేయింగ్ ఎలెవన్ ను మ్యాచ్ కు ముందే ప్రకటిస్తామని తెలిపాడు విరాట్ కోహ్లీ.


  టీమిండియా లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), లోకేష్ రాహుల్ (Kl Rahul) బరిలోకి దిగనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో వీరిద్దరూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ మూడు, సూర్యకుమార్ యాదవ్‌ నాలుగు, రిషబ్ పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకున్నా.. ఫినిషర్‌ అవసరం ఉంది కాబట్టి ఆరో స్థానంలో అతన్ని దించే అవకాశం ఉంది.

  ఇది కూడా చదవండి : పాకిస్థాన్ లో రోహిత్ శర్మని ఈ ముద్దు పేరుతో పిలుస్తారు..! హిట్ మ్యాన్ క్రేజే సెపరేటు..!

  రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇక, టీమిండియా బౌలర్లుగా మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా స్ధానాలు ఖాయం. ఇక, మూడో పేసర్ గా శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర కుమార్ ల్లో ఒకరికి చోటు దక్కవచ్చు. ఫామ్ ప్రకారం చూస్తే శార్దూల్ ఠాకూర్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్. ఇక, రెండో స్పిన్నర్ స్ధానం కోసం రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ లు పోటీపడుతున్నారు. సీనియర్ స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు.

  ఇది కూడా చదవండి : ఐపీఎల్ కొత్త జట్టు కోసం బాలీవుడ్ హాట్ కపుల్ ప్రయత్నాలు..! ఇంతకీ ఆ జోడి ఎవరంటే..?

  పాకిస్తాన్‌ 12 మంది జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, హైదర్ ఆలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ.

  టీమిండియా తుది జట్టు అంచనా : రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/ వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌/శార్దూల్ ఠాకూర్‌.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Babar Azam, Cricket, India VS Pakistan, T20 World Cup 2021, Virat kohli

  తదుపరి వార్తలు