భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T-20 World Cup 2021) లో గత ఆదివారం తలపడ్డ సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించింది. భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసి మూడ్రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli), మహ్మద్ షమీ (Mohammed Shami) ని టార్గెట్ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా షమీని టార్గెట్ చేసుకుని తీవ్ర పదజాలంతో అతన్ని ట్రోలింగ్ చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, అభిమానులు ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్‌లో షమీపై విమర్శలు చేశారు.
అయితే, ఈ ట్రోలింగ్ పాకిస్తాన్ నుంచే మొదలైందని తెలుస్తోంది. ఈ ట్రోల్స్ అన్నీ పాకిస్తాన్ కి చెందినవారే చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కావాలని విద్వేషం వెదజల్లాలనే కారణంతోనే.. ఇలా చేసినట్లు తెలుస్తోంది. ముస్లిం క్రికెటర్ అయిన షమీపై ఆన్ లైన్ లో వేదింపులకు గురి చేశారని.. ఎనిమిది మంది ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను గుర్తించారని.. వాటి నుంచే ఈ ఫేక్ ప్రచారం మొదలైందని గుర్తించినట్లు తెలుస్తోంది.
When we support #TeamIndia, we support every person who represents Team India. @MdShami11 is a committed, world-class bowler. He had an off day like any other sportsperson can have.
I stand behind Shami & Team India.
— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2021
మరోవైపు షమీకి మద్దతుగా భారత సీనియర్ క్రికెటర్లు నిలుస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సెహ్వాగ్ (Virender Sehwag), గంభీర్ (Gowtham Gambhir), ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), యుజ్వేంద్ర చాహల్ వంటి వాళ్లు షమీకి బాసటగా నిలిచారు. ఇక తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) కూడా షమీకి మద్దతుగా నిలిచాడు. షమీని ట్రోల్ చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021
ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 151 పరుగులు చేసింది. 152 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన పాక్.. 18 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో షమీ 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. తొలి మూడు ఓవర్లు బాగానే వేసిన షమీ.. ఆఖరి ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే ఇప్పుడు అతడి పాలిట శాపమైంది.
Jo log Mohammad Shami ke baare mein ghatiya baaten kar rahe hain, unse meri ek hi vinanti hai. Aap cricket na dekhen. Aur aapki kami mehsoos bhi nahi hogi. #Shami #355WicketsforIndia.
— Harsha Bhogle (@bhogleharsha) October 25, 2021
ఇక, టీమిండియా తమ నెక్ట్స్ మ్యాచ్ న్యూజిలాండ్ తో (India Vs New Zealand) ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచాలని టీమిండియా ప్రయత్నిస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్ కూడా ఇది చావోరేవో మ్యాచ్. ఈ ఆసక్తికర సమరం ఈ నెల 31న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు దాదాపు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించినట్టే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India VS Pakistan, Mohammed Shami, Pakistan, T20 World Cup 2021