Ind Vs Pak : అసలు సిసలు యాక్షన్ ధమాకాకు రెడీనా..! టాస్ గెలిచిన పాకిస్థాన్.. ఆ స్పిన్నర్ కే కోహ్లీ ఓటు..

Ind Vs Pak

Ind Vs Pak : అసలు సిసలు యాక్షన్ సినిమాకు రెడీ అయ్యారా..? కాసేపట్లో థ్రిలింగ్ ప్రపంచంలో మిమ్మల్ని తీసుకువెళ్లడానికి భారత్, పాకిస్థాన్ జట్లు రెడీ అయ్యాయ్.

  • Share this:
    క్రికెట్ ప్రేమికులారా దాయాదుల పోరుకు రెడీ అయ్యారా..? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ -20 వరల్డ్ కప్ 2021 (T-20 World Cup2021) లో భాగంగా కాసేపట్లో దుబాయ్‌ అంతర్జాతీయ మైదానంలో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ జట్ల (India Vs Pakistan) మధ్య మ్యాచ్‌ జరగనుంది. టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్‌ కాగా.. గెలుపుతో కప్ వేటని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. విశ్వవేదికపై దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. చరిత్ర కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈసారి టీమిండియాను ఓడించాలనే లక్ష్యంతో పాక్ బరిలోకి దిగుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

    టీమిండియా లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), లోకేష్ రాహుల్ (Kl Rahul) బరిలోకి దిగనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో వీరిద్దరూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ మూడు, సూర్యకుమార్ యాదవ్‌ నాలుగు, రిషబ్ పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకున్నా.. ఫినిషర్‌ అవసరం ఉంది కాబట్టి ఆరో స్థానంలో అతన్ని దించే అవకాశం ఉంది.

    రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇక, టీమిండియా బౌలర్లుగా మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక, మూడో పేసర్ గా భువనేశ్వర కుమార్ చోటు దక్కించుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికే కోహ్లీ ఓటు వేశాడు.


    ఇక, దాయాది టీమ్ లో మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan), బాబర్ అజమ్‌ (Babar Azam) లు పాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తే టీమిండియాకు కష్టమే. ఇక, వన్‌డౌన్‌లో ఫఖర్ జమాన్‌ బరిలోకి దిగనున్నాడు. భారీ హిట్టింగ్ తో విరుచుకుపడే ఫఖర్ జమాన్ క్షణాల్లో ఆటను మార్చగలడు.

    నాలుగు, ఐదు స్థానాల్లో సీనియర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు కరెక్ట్. వీరిద్దరి అనుభవం పాకిస్తాన్ జట్టుకు ఉపయోగపడనుంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం చోటు దక్కించుకున్నారు. షాదాబ్, ఇమాద్ స్పిన్నర్లుగా రాణించగలరు. ఇక పేస్‌ బౌలింగ్‌ విభాగంలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌఫ్‌లు కీ రోల్ ప్లే చేయనున్నారు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

    తుది జట్లు :

    టీమిండియా : రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌

    పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ.
    Published by:Sridhar Reddy
    First published: