Ind Vs Pak : రోహిత్ ఇంట్లో కూర్చొని వడాపావ్ తిను..! హిట్ మ్యాన్ పై ఫ్యాన్స్ ఫైర్..

Photo Credit : Star Sports

Ind Vs Pak : కీలక మ్యాచ్ లో విరాట్ కోహ్లీయే మరోసారి హీరో. కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపర్చారు.

 • Share this:
  టీ - 20 ప్రపంచకప్‌ (T-20 World Cup 2021)లో భాగంగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 152 పరుగులు. విరాట్ కోహ్లీ (Virat Kohli)(49 బంతుల్లో 57 పరుగులు) మరోసారి కీలక ఇన్నింగ్స్ తో టీమిండియాను ఆదుకున్నాడు. రిషబ్ పంత్ 39 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, ఈ బ్లాక్ బస్టర్ పోరులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. షాహిన్‌ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో నాలుగో బంతికి రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు ఘనమైన ఆరంభం లభించలేదు. అంతేగాక మరుసటి ఓవర్లోనే రాహుల్‌ కూడా క్లీన్‌ బౌల్డ్‌ అవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది.అయితే రోహిత్‌ శర్మ ఔటైన తీరుపై టీమిండియా ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. ఏంటి రోహిత్‌ ఇలా చేశావు.. పాక్‌తో మ్యాచ్‌ మనకు కీలకమని తెలుసుగా.. రోహిత్‌ మమ్మల్ని నిరాశపరిచావు. అంటూ కామెంట్స్‌ చేశారు.

  కీలకమైన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ కావడం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పాక్‌తో కీలకమైన మ్యాచ్‌లో ఇలా సిల్లీ గేమ్ ఆడుతావని అనుకోలేదని ఓ నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని మీమ్స్‌దో రోహిత్ శర్మ ఆటతీరును ఏకిపారేస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ… కోహ్లీ స్థానంలో టీమిండియాకు సారథి కావాలని కోరుకోవడం సరికాదని కొందరు మండిపడుతున్నారు. వెళ్లి ఇంట్లో కూర్చొని వడాపావ్ తిను అంటూ కామెంట్లు చేస్తున్నారు.


  టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్‌ కాగా.. గెలుపుతో కప్ వేటని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. విశ్వవేదికపై దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. చరిత్ర కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈసారి టీమిండియాను ఓడించాలనే లక్ష్యంతో పాక్ బరిలోకి దిగుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

  ఇది కూడా చదవండి : పీవీ సింధును ఎప్పుడైనా ఇలా చూశారా..! యెల్లో డ్రెస్ లో సందడి చేసిన తెలుగు తేజం..

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

  తుది జట్లు :

  టీమిండియా : రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌

  పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ.
  Published by:Sridhar Reddy
  First published: