Ind Vs Pak : అయ్యో.. కొంపముంచిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ..! ఇక, విరాట్ కోహ్లీపైనే భారత్ ఆశలు..

Ind Vs Pak

Ind Vs Pak : ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మ నిరాశపర్చాడు. కేఎల్ రాహుల్ కూడా ఔటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది.

  • Share this:
    దుబాయ్ వేదికగా జరుగుతున్న హై ఓల్టేజ్ టెన్షన్ మ్యాచులో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఖాతా తెరవకుండానే రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు రోహిత్ శర్మ . దీంతో ఒక పరుగుకే ఒక వికెట్ కోల్పోయింది. ఇక, రాహుల్, విరాట్ కోహ్లీలపైనే టీమిండియా ఇన్నింగ్స్ ఆధారపడి ఉంది. వీరిద్దరూ రాణిస్తేనే టీమిండియా మంచి స్కోరు సాధించగలుగుతుంది. టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్‌ కాగా.. గెలుపుతో కప్ వేటని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. విశ్వవేదికపై దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. చరిత్ర కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈసారి టీమిండియాను ఓడించాలనే లక్ష్యంతో పాక్ బరిలోకి దిగుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

    ఇక, టీమిండియా బౌలర్లుగా మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక, మూడో పేసర్ గా భువనేశ్వర కుమార్ చోటు దక్కించుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికే కోహ్లీ ఓటు వేశాడు.

    ఇక, దాయాది టీమ్ లో మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan), బాబర్ అజమ్‌ (Babar Azam) లు పాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తే టీమిండియాకు కష్టమే. ఇక, వన్‌డౌన్‌లో ఫఖర్ జమాన్‌ బరిలోకి దిగనున్నాడు. భారీ హిట్టింగ్ తో విరుచుకుపడే ఫఖర్ జమాన్ క్షణాల్లో ఆటను మార్చగలడు.


    నాలుగు, ఐదు స్థానాల్లో సీనియర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు కరెక్ట్. వీరిద్దరి అనుభవం పాకిస్తాన్ జట్టుకు ఉపయోగపడనుంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం చోటు దక్కించుకున్నారు. షాదాబ్, ఇమాద్ స్పిన్నర్లుగా రాణించగలరు. ఇక పేస్‌ బౌలింగ్‌ విభాగంలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌఫ్‌లు కీ రోల్ ప్లే చేయనున్నారు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

    తుది జట్లు :

    టీమిండియా : రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌

    పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ.
    Published by:Sridhar Reddy
    First published: