Ind Vs Pak : మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. కష్టాల్లో కోహ్లీసేన..

Team India

Ind Vs Pak : కీలక పోరులో టీమిండియా టపాటపా వికెట్లు కోల్పోతుంది. పవర్ ప్లే ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్.

  • Share this:
    దుబాయ్ వేదికగా జరుగుతున్న హై ఓల్టేజ్ టెన్షన్ మ్యాచులో భారత్ తడబడుతోంది. వరుసగా టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 11 పరుగులు చేసిన హసన్ అలీ. .మూడో వికెట్ గా హసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఖాతా తెరవకుండానే రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు రోహిత్ శర్మ . దీంతో ఒక పరుగుకే ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రాహుల్ కూడా షాహిన్ అఫ్రీది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇక, విరాట్ కోహ్లీ రాణిస్తేనే టీమిండియా మంచి స్కోరు సాధించగలుగుతుంది. టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్‌ కాగా.. గెలుపుతో కప్ వేటని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. విశ్వవేదికపై దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. చరిత్ర కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈసారి టీమిండియాను ఓడించాలనే లక్ష్యంతో పాక్ బరిలోకి దిగుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.


    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

    తుది జట్లు :

    టీమిండియా : రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌

    పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ.
    Published by:Sridhar Reddy
    First published: