Ind Vs Pak : బ్లాక్ బస్టర్ పోరులో మళ్లీ విరాట్ కోహ్లీనే బాద్షా... టీమిండియా స్కోరు ఎంతంటే..

విరాట్ కోహ్లీ (BCCI)

Ind Vs Pak : టపా టపా వికెట్లు.. ఆ తర్వాత రిషబ్ పంత్, కోహ్లీ సూపర్ పార్టనర్ షిప్.. చివరికి కోహ్లీ బ్యాటింగ్.. టీమిండియా ఇన్నింగ్స్ ఇలా కొనసాగింది.

  • Share this:
    దుబాయ్ వేదికగా జరుగుతున్న హై ఓల్టేజ్ టెన్షన్ మ్యాచులో ఫస్ట్ లో తడబడ్డ భారత్ ఆఖరికి నిలబడింది. విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ కు తోడు.. పంత్ కీలక ఇన్నింగ్స్ టీమిండియాను రేస్ లో నిలబెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7  వికెట్లు కోల్పోయి  151 పరుగులు చేసింది. టీ-20 వరల్డ్ కప్ ల్లో పాక్ మీద తనకు ఉన్న రికార్డును కంటిన్యూ చేస్తూ విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 45 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు కోహ్లీ. అయితే, 49 బంతుల్లో 57 పరుగులు చేసిన కోహ్లీ షాహిన్ షా బౌలింగ్ లో ఔటయ్యాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా మూడు వికెట్లతో సత్తా చాటాడు. హసన్ అలీ రెండు వికెట్లు తీశాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఖాతా తెరవకుండానే రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు రోహిత్ శర్మ . దీంతో ఒక పరుగుకే ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రాహుల్ కూడా షాహిన్ అఫ్రీది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 11 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్. .మూడో వికెట్ గా హసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

    31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ను విరాట్ కోహ్లీ, పంత్ ఆదుకున్నారు. 38 బంతుల్లో 50 పరుగుల పార్టనర్ షిప్ అందించింది ఈ జోడీ. అయితే.. భారీ షాట్ కు ప్రయత్నించిన పంత్ ఔటయ్యాడు. షాదాబ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి అతనికే క్యాచ్ ఔటయ్యాడు. రిషభ్ పంత్ 39 పరుగులు చేశాడు. ఆఖర్లో కోహ్లీతో కలిసిన జడేజా.. నిదానంగా పరుగులు చేశాడు.13 బంతుల్లో 13 పరుగులు చేసిన జడేజా హసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. భారీ షాట్ కు యత్నించబోయి.. హాఫిజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


    టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్‌ కాగా.. గెలుపుతో కప్ వేటని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. విశ్వవేదికపై దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. చరిత్ర కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈసారి టీమిండియాను ఓడించాలనే లక్ష్యంతో పాక్ బరిలోకి దిగుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

    తుది జట్లు :

    టీమిండియా : రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌

    పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ.
    Published by:Sridhar Reddy
    First published: