Ind Vs Pak : కీలక పోరు ముందు హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యం.. అతడిపై విరాట్ కోహ్లీ సీరియస్..!

Hardik Pandya

Ind Vs Pak : అసలకే ఫామ్ లో లేడు. ఇక, జట్టులోకి తీసుకున్నా బౌలింగ్ వేయడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఆల్ రౌండర్ చేసిన ఓ పని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపం తెప్పించిందట.

 • Share this:
  యావత్ క్రీడా ప్రపంచం ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. టీ20 వరల్డ్ కప్ (ICC T-20 World CuP 2021) లో భాగంగా భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) మధ్య హైఓల్డేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రెండు దేశాల్లోనూ భావోద్వేగాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాయాది దేశాల మధ్య దాదాపు రెండేళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. 2019లో ఇంగ్లాండ్‌లో ముగిసిన ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత ఈ రెండు దేశాలు ఢీ కొనబోతోండటం ఇదే తొలిసారి కావడంతో.. ఎన్నెన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక, ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

  అదే చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందనే అంచనాలు అభిమానుల్లో వ్యక్తమౌతోన్నాయి. భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే- రెండు దేశాల మధ్య ఓ యుద్ధ వాతావరణం క్రీడా మైదానంలో కనిపిస్తుంటుంది. ఈ రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజలు ఈ మ్యాచ్ పట్ల అత్యంత ఆసక్తిగా, అంతకుమించి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంటారు. తమ దేశం గెలవాలని కోరుకుంటుంటారు.

  ఇక, ఈ మ్యాచ్ లో ఆడే ప్లేయర్లపై ఎంతో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే, ఇలాంటి కీలకమైన మ్యాచ్ ను టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) లైట్ తీసుకున్నట్టు ఉన్నాడు. బీసీసీఐ (BCCI) ప్రత్యేకంగా టీమిండియా కోసం ఏర్పాటు చేసిన ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా డుమ్మా కొట్టాడు. ఈ ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొనలేదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో కీ ప్లేయర్‌గా అంచనాలు ఉన్న హార్దిక్ పాండ్యా.. ఈ సెషన్స్‌లో కనిపించలేదు.

  ఇది కూడా చదవండి : ఈ పాకిస్థాన్ క్రికెటర్ల భార్యలకు, భారత్ తో ఉన్న లింకులు ఏంటో తెలుసా..?

  అదే సమయంలో మిగిలిన జట్టు ప్లేయర్లు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కేప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గ్రౌండ్‌లో కనిపించారు.

  ఇది కూడా చదవండి : బ్లాక్ బస్టర్ పోరుకు ముందు విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఇలా అన్నాడేంటి..?

  ఇప్పటికే ఫామ్ లో లేని.. హార్దిక్ పాండ్యా ఇలా డుమ్మా కొట్టడంపై కోచింగ్ స్టాఫ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ బ్లాక్ బస్టర్ పోరులో హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దికే అవకాశం ఉంది. ఫినిషర్ రోల్ ను హార్దిక్ పాండ్యాకే అప్పజెప్పాలని కోహ్లీ చూస్తున్నట్లు తెలుస్తోంది.
  Published by:Sridhar Reddy
  First published: