Home /News /sports /

T20 WORLD CUP 2021 IND VS NZ HEAD TO HEAD RECORDS KEY STATS AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS SRD

Ind Vs Nz : కింగ్ కోహ్లీ వర్సెస్ కేన్ మామ.. టోర్నీలో తొలి విజయం కోసం ఆరాటం.. తుది జట్లు ఇవే..!

Ind Vs Nz

Ind Vs Nz

Ind Vs Nz : మెగాటోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం సమాయత్తం అవుతోంది. న్యూజిలాండ్‌తో (India Vs New Zealand) దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం అదే పాకిస్థాన్ చేతిలో ఓడి.. భారత పరిస్థితినే ఎదుర్కొంటుంది. దీంతో, ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దీంతో, సెమీస్ బరిలో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ కీలకమే. మెగాటోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం సమాయత్తం అవుతోంది. న్యూజిలాండ్‌తో (India Vs New Zealand) దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం అదే పాకిస్థాన్ చేతిలో ఓడి.. భారత పరిస్థితినే ఎదుర్కొంటుంది. దీంతో, ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

  పాకిస్థాన్ చేతిలో ఎదురైన అనూహ్య పరాజయం టోర్నీలో భారత ప్రయాణాన్ని కఠినంగా మార్చింది. టోర్నీలో ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్‌తో ఓటమి బాధను పక్కకుపెట్టి.. వైఫల్యాలపై దృష్టి సారించి.. ఇప్పటికైనా మేల్కొని రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు సత్తాచాటాలి. లేదంటే మరోసారి టీ20 ప్రపంచకప్ అందని ద్రాక్షే అవుతుంది.

  మెగాటోర్నీలో భారత్ విజయాల బాట పట్టాలంటే ముందుగా టీమ్ కాంబినేషన్‌ పై దృష్టి పెట్టాలి. ఫస్ట్ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన భువనేశ్వకుమార్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండా జట్టుకు భారమైన హార్దిక్ పాండ్యా (Hardika Pandya)ను పక్కనపెట్టాలి. భువనేశ్వర్ స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్డూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించాలి. స్లో బౌలర్ అయినటువంటి శార్దూల్.. కీలక సమయంలో వికెట్లు తీయడంలో దిట్ట. లోయరార్డ్‌లో ప్రధాన బ్యాట్స్‌మన్‌లా భారీ షాట్లు ఆడగలడు.

  ఈ బిగ్ ఫైట్‌కు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma) బరిలోకి దిగడంలో ఎటువంటి అనుమానం లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ జోడీ దారుణంగా విఫలమైనా.. వీరే ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వార్మప్ మ్యాచ్‌ల్లో ఇరగదీసిన ఈ జోడీ.. కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. రోహిత్ శర్మ అయితే గోల్డెన్ డక్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని ఈ ఇద్దరు భావిస్తున్నారు. భారత్ భారీ స్కోర్ చేయాలంటే ఈ ఇద్దరు మంచి శుభారంభం అందించడం చాలా కీలకం.

  న్యూజిలాండ్ పై ఈ ఇద్దరు మంచి శుభారంభం అందిస్తే భారత్‌కు తిరుగుండదు. ఇక ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రావడం ఖాయం. పాక్‌పై మ్యాచ్‌లో టాప్-3 విఫలమైనా కోహ్లీ సూపర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చూడ ముచ్చటైన షాట్లతో పాత కోహ్లీని తలపించాడు. అతను అదే జోరును కొనసాగిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు.

  ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కనుంది. అయితే పాక్‌తో మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ విభాగం దారుణంగా విపలమైంది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. దీంతో కీలక మ్యాచ్‌లో బుమ్రా, షమీలు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరు చెలరేగితే కివీస్‌కు కష్టాలు తప్పవు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ లేదా రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవచ్చు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన వరుణ్.. పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ క్రమంలో అతని ప్లేస్‌లో అశ్విన్‌ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

  ఇది కూడా చదవండి : ఏయ్ టీమ్ ఇండియా.. నా హెల్ప్ ఏమైనా కావాలా? జార్వో మామ వచ్చేశాడు.. కిట్ రెడీ.. బరిలోకి దిగడమే తరువాయి..!

  ప్రతి భారీ అంచనాలతో బరిలోకి దిగడం, ఆ తర్వాత లీగ్ మ్యాచ్ ల్లో అదరగొట్టడం.. కీలక నాకౌట్ మ్యాచ్ ల్లో చేతులేత్తేయడం కివీస్ జట్టుకి అలవాటుగా మారింది. గత రెండు వన్డే వరల్డ్ కప్ ల్లో ఫైనల్ కి చేరి.. కప్ ను అందుకోవడంలో విఫలమైంది కివీస్ జట్టు. ఎందరు స్టార్లు ఉన్నా కీలక మ్యాచ్ ల్లో ఫెయిలవ్వడం వారికి పరిపాటిగా మారింది.

  ఇక, కివీస్ కేన్ విలియమ్సన్ సగం బలం. ఈ క్లాసిక్ కెప్టెన్ ఆడే ఆటపైనే న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడ్డాయ్. ఇక, మార్టిన్ గప్తిల్, డేవాన్ కాన్వే, టిమి సైపర్ట్, డార్లీ మిచెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు న్యూజిలాండ్ లో ఉన్నారు. గత మ్యాచుల్లో వీరందరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వీరందరూ తిరిగి లయ అందుకోకపోతే టీమిండియా మీద కష్టమే.

  ఇక న్యూజిలాండ్ బౌలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సీనియర్లు టిమ్ సౌథీ, ట్రెండ్ బౌల్ట్ ల అనుభవం కివీస్ కు ప్లస్ పాయింట్ కానుంది. ఇస్ సోథి, మిచెల్ శాంట్నర్ వంటి సీజనల్ స్పిన్నర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. పాక్ మ్యాచ్ మీద ఇష్ సోథి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక, ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా బ్యాట్, బంతితో రాణించగల సమర్ధుడు.

  తుది జట్లు అంచనా :

  టీమిండియా : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా/ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి/రవిచంద్రన్ అశ్విన్

  న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, టిమ్ సైఫర్ట్ (కీపర్), కేన్ విలియమ్సన్( కెప్టెన్), డేవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్ , డార్లీ మిచెల్/టాడ్ అస్టల్, టిమ్ సౌథీ, ఇష్ సోథీ, ట్రెంట్ బౌల్ట్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Ind vs Nz, India vs newzealand, Kane Williamson, KL Rahul, Rohit sharma, T20 World Cup 2021, Virat kohli

  తదుపరి వార్తలు