వరుస ఓటముల నుంచి భారత జట్టు కోలుకున్నట్టే ఉంది. వరుస పరాజయాలతో ఘోర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీసేన అఫ్గానిస్థాన్ కు చుక్కలు చూపించింది. తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై ఓడిపోయిన కసినంతా పసికూనపై తీర్చుకున్నారు టీమిండియా బ్యాటర్లు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ టార్గెట్ 211 పరుగులు. రోహిత్ శర్మ ( 47 బంతుల్లో 74 పరుగులు.. 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 69 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లతో) చెలరేగారు. ఆఖర్లో రిషబ్ పంత్ ( 13 బంతుల్లో 27 పరుగులు) హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 పరుగులు) కూడా బ్యాట్లు ఝళిపించడంతో భారత్ భారీ టార్గెట్ సెట్ చేసింది. ఇక, బౌలర్లు రెచ్చిపోయి.. అఫ్గానిస్థాన్ ను కంట్రోల్ చేస్తే.. భారత్ కు ఈ మెగా టోర్నీలో తొలి విజయం లభించనట్టే.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. దొరికిన బంతిని బౌండరీకి తరలించి.. అఫ్గాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిదెబ్బకు భారత జట్టు పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇదే జోరు ను కంటిన్యూ చేసిన ఓపెనర్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
బంగ్లాదేశ్ కెప్టెన్ నబీ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, వీరిద్దరి జోరుకు కరీమ్ జన్నత్ బ్రేక్ వేశాడు. 47 బంతుల్లో 74 పరుగులు చేసిన రోహిత్ శర్మని ఔట్ చేశాడు. దీంతో 140 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 48 బంతుల్లో 69 పరుగులు చేసిన రాహుల్ గుల్బాదిన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అయితే, ఆఖర్లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
Finally a breakthrough for Afghanistan ☝️
Rohit Sharma is gone after a wonderful knock of 74. #T20WorldCup | #INDvAFG | https://t.co/ZJL2KKL30i pic.twitter.com/fK4iOztwdJ
— T20 World Cup (@T20WorldCup) November 3, 2021
అఫ్గానిస్థాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్ రెండుసార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది.ఓపెనర్లు హజ్రతుల్లా, షహజాద్ ప్రతీసారి శుభారంభాలు అందించారు. కెప్టెన్ నబీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. అఫ్గాన్ టీమ్‌కు కూడా యూఏఈ వేదికలపై మంచి అనుభవం ఉంది.
తుది జట్లు :
టీమిండియా : విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా,
అఫ్గానిస్థాన్ : మహమ్మద్ నబీ (కెప్టెన్), హజ్రతుల్లా జాజాయ్, షహజాద్, రహ్మానుల్లా, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్ ఖాన్, కరీమ్ జన్నత్, షర్ఫీద్దున్ అష్రఫ్, నవీన్, హామీద్ హసన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Hardik Pandya, KL Rahul, Rishabh Pant, Rohit sharma, T20 World Cup 2021, Team India