Home /News /sports /

T20 WORLD CUP 2021 HASAN ALI HILARIOUSLY TROLLED BY FANS WITH JATHI RATNALU MOVIE DIALOUGE TAKE A LOOK SRD

Hasan Ali : " క్యాచ్ ఎందుకురా పట్టలేదు.. కేక్ పెట్టలేదు మీరు నాకు.. " జాతిరత్నాలు డైలాగ్ తో రచ్చ రచ్చ..

హసన్ అలీ క్యాచ్ మిస్ చేసిన దృశ్యం

హసన్ అలీ క్యాచ్ మిస్ చేసిన దృశ్యం

Hasan Ali : 12.2 ఓవర్లకే ఆస్ట్రేలియా జట్టు ఐదు కీలక వికెట్లను కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఇక.. మ్యాచ్ గెలిచేది నిలిచేది తమ జట్టేనని పాక్ అభిమానులు భావించారు.మ్యాచ్ చివరి వరకూ అదే నమ్మకం వాళ్లలో ఉంది. కానీ.. 19వ ఓవర్‌లో మ్యాథ్యూ వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ మిస్ చేయడంతో మ్యాచ్ తీరే మారిపోయింది.

ఇంకా చదవండి ...
  టీ-20 వరల్డ్ కప్ 2021 (T-20 World Cup 2021) ఆఖరి అంకానికి చేరుకుంది. ఫైనలిస్ట్ లు ఎవరో తేలిపోయింది. ఆదివారం చిరకాల ప్రత్యర్ధులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు (New Zealand Vs Australia) మెగా కప్ కోసం పోరాడనున్నాయ్. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హసన్ అలీ చేసిన ఘోర తప్పిదం పాకిస్థాన్ కొంపముంచింది. 19వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హసన్ అలీ చేజార్చగా.. ఆ అవకాశాన్ని అందుకున్న వేడ్ రెండు భారీ సిక్స్‌లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

  12.2 ఓవర్లకే ఆస్ట్రేలియా జట్టు ఐదు కీలక వికెట్లను కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఇక.. మ్యాచ్ గెలిచేది నిలిచేది తమ జట్టేనని పాక్ అభిమానులు భావించారు.మ్యాచ్ చివరి వరకూ అదే నమ్మకం వాళ్లలో ఉంది. కానీ.. 19వ ఓవర్‌లో మ్యాథ్యూ వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ మిస్ చేయడంతో మ్యాచ్ తీరే మారిపోయింది. ఆ తరువాత మ్యాథ్యూ వేడ్ హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగి ఆస్ట్రేలియా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పాకిస్తాన్‌ అభిమానులకు మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడానికి కారణం ఎవరనే ప్రశ్న తలెత్తితే పాకిస్తాన్ అభిమానుల్లో మెజార్టీ ఫ్యాన్స్ హసన్ అలీ వైపే వేళ్లు చూపిస్తున్నారు.


  మీమర్స్ అయితే.. అతనిని కించపరుస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. మరికొందరైతే హద్దుమీరి సోషల్ మీడియా దొరికింది కదా అని అతని భార్యాబిడ్డను కూడా దూషించే స్థాయికి దిగజారిపోయారు. అయితే, ఓ ఫన్నీ మీమ్ ఇప్పుడు హైలెట్ గా మారింది. సెమీఫైనల్‌కు ముందు గ్రూప్-1లో స్కాట్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్ 72 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. ఈ గెలుపును పాక్ ఆటగాళ్లంతా హోటల్లో సెలెబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరికి తినిపించుకున్నారు. ఈ వీడియో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా అభిమానులతో కూడా పంచుకుంది.


  అయితే ఈ సెలెబ్రేషన్‌లో హసన్ అలీకి షాదాబ్ ఖాన్ కేక్ తినిపిస్తుండగా.. షాహిన్ అఫ్రిది అతనికి రుద్దుతున్నాడు. దాంతో హసన్ అలీ నోటికాడికి వచ్చిన కేక్ కిందపడిపోయింది. ఈ సీన్స్‌ను ఎడిట్ చేసిన ఫ్యాన్స్.. జాతి రత్నాలు సినిమాల్లో డైలాగ్‌తో పోల్చుతూ సెటైర్లు పేల్చుతున్నారు. " కేక్ పెట్టలేదు.. అందుకే క్యాచ్ పట్టలేదు " అని హసన్ అలీ చెబుతున్నట్లు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

  ఇది కూడా చదవండి : సెక్స్ స్కాండిల్ లో ఇరుక్కున్న హార్దిక్ పాండ్యా.. క్రికెటర్ రేప్ చేశాడంటూ మహిళ సంచలన ఆరోపణలు..

  మరోవైపు, ఆటలో గెలుపుఓటములు సహజమని, హసన్ అలీపై ఈ స్థాయిలో రెచ్చిపోయి, దిగజారి విమర్శలు చేయడం.. అతని కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అతనికి మద్దతు తెలుపుతున్న నెటిజన్లు మెజార్టీ ఇండియన్స్ కావడం విశేషం. #INDwithHasanAli అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుందంటే అతనికి మన వాళ్లు ఎంతలా అండగా నిలిచారో చెప్పొచ్చు. కానీ.. హసన్ అలీపై మీమ్స్, వ్యతిరేకంగా పెడుతున్న కామెంట్లు అయితే ఇప్పట్లో ఆగేలా లేవు. సోషల్ మీడియా వచ్చాక ఇలా వేలెత్తి చూపే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. వెంటనే మీమ్స్, ట్వీట్స్ రూపంలో తమ కడుపు మంటను వెళ్లగక్కుతున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Jathi Ratnalu, Pakistan, T20 World Cup 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు