T20 World Cup : " న్యూజిలాండే కాదు అఫ్గానిస్తాన్ టీమ్ తో కూడా జాగ్రత్త.. తక్కువ అంచనా వేస్తే .."

Afghanistan

T20 World Cup : ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన (India Vs New Zealand). దీంతో, ఈ మ్యాచ్ ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు భారత అభిమానులు కూడా.. న్యూజిలాండ్ మ్యాచ్ టీమిండియాకు క్వార్టర్‌ ఫైనల్‌ లాంటిదని భావిస్తున్నారు.

  • Share this:
    యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దాయాది పాకిస్థాన్ (Pakistan) చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక, సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే. ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన (India Vs New Zealand). దీంతో, ఈ మ్యాచ్ ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు భారత అభిమానులు కూడా.. న్యూజిలాండ్ మ్యాచ్ టీమిండియాకు క్వార్టర్‌ ఫైనల్‌ లాంటిదని భావిస్తున్నారు. అయితే న్యూజిలాండ్‌తో ఫైట్ సందర్భంగా ఆ మ్యాచును క్వార్టర్‌ ఫైనల్లా చూడొద్దని టీమిండియా వెటరన్‌ ఆఫ్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) అన్నాడు. ఇదే గ్రూప్‌లో అఫ్గానిస్థాన్‌ కూడా ప్రమాదకరమైన జట్టేనని అభిప్రాయపడ్డాడు.

    గ్రూప్‌-2లో పాకిస్థాన్‌ ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సూపర్ విక్టరీ కొట్టి సెమీస్ రేస్ లో ముందు స్థానంలో నిలిచింది. గత ఆదివారంటీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన పాక్.. మంగళవారం న్యూజిలాండ్‌పైనా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. దీంతో, గ్రూప్‌-2లోని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో పాక్.. అఫ్గాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాలను లాంటి చిన్న జట్లను ఎదుర్కోనుంది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం ఈ జట్లను ఓడించడం బాబర్ సేనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. దాంతో పాక్ సెమీస్‌కు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

    Harbhajan Singh and Mohammed amirs Twitter Banter, Harbhajan Singh, Mohammed amir News, Harbhajan Singh and Mohammed amir Twitter War, India Vs Pakistan Cricket News, Waqar younis Religion Comments, Waqar younis Ugly Comments, Waqar younis Records, Waqar younis on Namaz, Waqar younis apologies, India Vs Pakstan Match, India Vs Pakistan Key Players, T20 World Cup 2021 Team India Schedule, T20 World Cup 2021 Team India Key Players, T20 World Cup 2021 Pakistan Schedule, T20 World Cup 2021 Pakistan Squad, T20 World Cup 2021 Pakistan Full Squad, T20 World Cup 2021 Pakistan Key Players, T20 World Cup 2021 Pakistan Records, T20 World Cup 2021 Pakistan Matches, T20 World Cup, T20 World Cup 2021, 2021 T20 World Cup, ICC T20 World Cup, t20 world cup, world t20, world cup 2021, india world cup, world cup schedule, icc world cup, world cup 2021 schedule, t20 world cup schedule, t20 world cup 2021 schedule, icc t20 world cup, world cup live, t20 world cup match, t20 world cup list, india world cup squad, warm up match, t20 world cup live, t20 world cup match, Cricket News, Sports News, భారత్ వర్సెస్ పాకిస్థాన్, వకార్ యూనిస్ వివాదస్పద వ్యాఖ్యలు, హర్భజన్ సింగ్
    HARBHAJAN SINGH


    గ్రూప్‌-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌లో అర్హత సాధించేందుకు టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు ప్రధానంగా పోటీపడుతున్నాయి. దీంతో ఈనెల 31న జరగనున్న మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇందులో ఓడిన జట్టు సెమీస్‌కు చేరడం కష్టంగా మారే అవకాశం ఉంది. అలాగే ఏ జట్టు గెలిచినా తన తర్వాతి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడాల్సి ఉంటుంది. ఇక స్కాట్లాండ్‌ను 130 పరుగుల భారీ తేడాతో ఓడించింది అఫ్గాన్‌. అలాంటప్పుడు టీమిండియాకు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ క్వార్టర్‌ ఫైనల్‌ కాదని హర్భజన్‌ సింగ్ అభిప్రాయపడ్డాడు.

    ఇది కూడా చదవండి : షమీపై ట్రోలింగ్ వెనుక పాకిస్థాన్ హస్తం.. వెలుగులోకి అసలు నిజం..!

    " న్యూజిలాండ్‌తో జరగనున్న పోరు క్వార్టర్‌ ఫైనల్‌ లాంటిది ఏమాత్రం కాదు. ఇది కూడా ఒక సాధారణ మ్యాచ్‌. అయితే అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు. అదీ ప్రమాదకరమైన జట్టే. ఏ జట్టునైనా ఓడించగలదు. ఇక భారత్ సెమీస్‌ చేరాలంటే.. తొలుత చేయాల్సిన పని న్యూజిలాండ్‌ను ఓడించడం. మన ఆటగాళ్లపై నాకు ఆ నమ్మకం ఉంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీసేనకు ప్రతి మ్యాచ్‌ కీలకమే. అందుకోసం భారత్ సిద్ధంగా ఉందని అనుకుంటున్నా. కచ్చితంగా మనోళ్లు గెలుస్తారనే అనుకుంటున్నా. భారత్‌ గొప్ప జట్టే అయినా పాకిస్థాన్‌తో తలపడిన రోజు మనదికాదు. ఆ ఓటమి కోహ్లీసేనకు వేకప్ కాల్ లాంటిది " అని హర్భజన్‌ సింగ్ అన్నాడు.

    ఇది కూడా చదవండి : " నేను రేసిస్ట్ కాదు.. అలా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? " .. సారీ చెప్పిన డికాక్..

    మరోవైపు, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నెట్స్ లో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. బుధవారం కోహ్లీసేన.. దుబాయ్ లో నెట్ ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్ సమయంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయడం టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ లాంటిది. కివీస్ మ్యాచులో ఆరో బౌలర్ గా హార్దిక్ పాండ్యా సత్తా చాటితే.. కోహ్లీసేనకు పెద్ద తలనొప్పి తప్పుతుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: