హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Pak : " హిందూ ఆటగాళ్ల మధ్య నమాజ్ ".. వకార్ యూనిస్ కు బుద్ది చెప్పిన టీమిండియా మాజీలు..!

Ind Vs Pak : " హిందూ ఆటగాళ్ల మధ్య నమాజ్ ".. వకార్ యూనిస్ కు బుద్ది చెప్పిన టీమిండియా మాజీలు..!

Waqar Younis

Waqar Younis

Ind Vs Pak : పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించింది. భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసి మూడ్రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది.

ఇంకా చదవండి ...

  భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T-20 World Cup 2021) లో గత ఆదివారం తలపడ్డ సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించింది. భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసి మూడ్రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli), మహ్మద్ షమీ (Mohammed Shami) ని టార్గెట్‌ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. భారత్, పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో దాయాది జట్టు ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) నమాజ్ చేయడంపై ఆ దేశ మాజీ బౌలర్ వకార్ యూనిస్ (Waqar Younis) కామెంట్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో వివాదంగా మారింది. హిందూ ప్లేయర్ల ముందు రిజ్వాన్ నమాజ్ చేయడం తనకు చాలా స్పెషల్‌గా అనిపించిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో వకార్ యూనిస్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

  వకార్ యూనిస్ కామెంట్లపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. క్రికెట్‌కు మతంతో సంబంధం లేదన్న ఆయన.. వకార్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి వ్యాఖ్యలు వినడం తీవ్రంగా నిరుత్సాహపర్చిందన్నాడు. ఆటల్లో ఇలాంటి వాటికి చోటు లేకుండా చూడాలన్నాడు. క్రికెట్‌కు అంబాసిడర్ల లాంటి ప్లేయర్లు చాలా బాధ్యతతో వ్యవహరించాలని సూచించాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచుదామని, మతంతో దాన్ని విభజించొద్దని పిలుపునిచ్చాడు.

  టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఇది నీచమైన చర్య అంటూ ట్వీట్ చేశాడు. దీంతో, అన్ని వైపుల నుంచి తన కామెంట్లపై విమర్శలు రావడంతో వకార్ యూనిస్ వెనక్కి తగ్గాడు. క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు.

  "నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు పలువురి మనోభావాలను దెబ్బతీశాయి. కానీ నేను కావాలని అలా అనలేదు. దీనికి క్షమాపణలు చెబుతున్నా. ఇది ప్రత్యేకంగా ఎవర్నో ఉద్దేశించి చేసింది కాదు. అది నిజంగా తప్పే. జాతి, వర్ణం, మతానికి సంబంధం లేకుండా ఆటలు ప్రజలందర్నీ కలిపి ఉంచుతాయి" అని వకార్ చెప్పాడు. క్షమాపణలు చెబుతూ అపాలజీస్ అనే ట్యాగ్‌ను ట్వీట్‌కు జత చేశాడు.

  ఇది కూడా చదవండి : టీమిండియాతో మ్యాచ్ కి ముందు న్యూజిలాండ్‌కి భారీ షాక్... గాయంతో స్టార్ ప్లేయర్ దూరం..

  ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ మహ్మద్ షమీ, తన ఆఖరి ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో అతన్ని టార్గెట్ చేసి కొందరు భారతీయులు పిచ్చి కూతలు కూసిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ని ఎంతగానే ప్రేమించే క్రీడా ప్రేమికులకు ఆటను ఆటగా మాత్రమే చూడమని, మతం మకిలి అంటించవద్దని రెండు దేశాల ఫ్యాన్స్ కోరుతున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India VS Pakistan, Mohammed Shami, T20 World Cup 2021, Virat kohli

  ఉత్తమ కథలు