Home /News /sports /

T20 World Cup final : కేన్ మామ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..

T20 World Cup final : కేన్ మామ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..

T20 World Cup final

T20 World Cup final

T20 World Cup final : టీ-20 వరల్డ్ కప్ నయా చాంపియన్ ఎవరో తేలనుంది. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్‌ కోసం రంగం సిద్దమైంది. ఈ ఏడాది మెగా ఫైనల్ లో రెండు కొత్త జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటిదాకా ఈ ఫార్మట్‌లో ఛాంపియన్‌గా నిలవని ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు సాగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా పోరులో ఆస్ట్రేలియా ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడ్డ డేవాన్ కాన్వే స్థానంలో టిమ్ సైఫర్ట్ జట్టులోకి వచ్చాడు.

  ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్.. ఎప్పట్లాగే ఇన్నింగ్‌ను ఆరంభించనున్నారు పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ దారుణంగా విఫలం అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. కానీ, ధనాధన్ ఫార్మాట్ లో అతడు మోస్ట్ డేంజరస్ బ్యాటర్. ఇక, డేవిడ్ వార్నర్ ఫుల్ ఫామ్ లో ఉండటం ఆస్ట్రేలియాకు ప్లస్ పాయింట్ కానుంది. మిఛెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మిడిలార్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్.. మెరుపులు మెరిపించే సత్తా ఉన్న బ్యాటర్లే.


  ఇక, ఆసీస్ బౌలింగ్ లో కీ బౌలర్ ఆడమ్ జంపా. ఈ టోర్నీలో ఆడమ్ జంపా ది బెస్ట్ బౌలర్. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 12 వికెట్లను పడగొట్టాడు. బౌలింగ్ ఎకానమీ కూడా 5.69 మాత్రమే. జంపాతో పాటు పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొనడం న్యూజిలాండ్ సత్తాకు అసలు సిసలు పరీక్ష కానుంది.

  ఇక, ఈ మెగా టోర్నీలో కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్‌లు ఈ మెగా టోర్నీలో చక్కగా రాణించారు. కేన్ విలిమయ్‌సన్ కీలక సమయాల్లో సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్నది. టీ20 ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న గ్లెన్ ఫిలిప్ తన పూర్తి శక్తిసామర్థ్యాలను బయటకు తీయాల్సిన సమయం ఆసన్నం అయ్యింది. జేమ్స్ నీషమ్ బ్యాటుతో మంచి టచ్‌లో ఉన్నాడు.

  డెవాన్ కాన్వే ఫైనల్‌కు దూరమవడం భారీ దెబ్బే అనుకోవచ్చు. అతడి స్థానంలో సీఫెర్ట్‌ను తీసుకుంది న్యూజిలాండ్ టీమ్. ఇక ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇష్ సోథి దుబాయ్ పిచ్ మీద బాగానే రాణాస్తున్నాడు. మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్ రూపంలో మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నారు. మొత్తానికి కివీస్ జట్టు సమతూకంగా కన్పిస్తోంది.


  తుది జట్లు :

  ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కేప్టెన్), డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా, పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌

  న్యూజిలాండ్ : మార్టిన్ గుప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), టిమ్ సిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, అడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోథి, ట్రెంట్ బౌల్ట్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Australia, David Warner, Kane Williamson, New Zealand, T20 World Cup 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు