Home /News /sports /

T20 WORLD CUP 2021 FINAL MATCH THESE PLAYERS PALY KEY ROLE EVK

T20 World Cup Final:  ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఈ ఐదుగురే కీల‌కం..

ఆస్ట్రేలియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

ఆస్ట్రేలియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌

T20 World Cup Final: ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2021 ఫైనల్ ఘట్టానికి సమయం దగ్గర పడింది. ఈరోజు రాత్రి దుబాయ్‌లో జరిగే ICC T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చే ఐదుగురు ప్లేయ‌ర్ల గురించి తెలుసుకొందాం.

ఇంకా చదవండి ...
    T20 World Cup Final:  ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2021 ఫైనల్ ఘట్టానికి సమయం దగ్గర పడింది. ఈరోజు రాత్రి దుబాయ్‌లో జరిగే ICC T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ రెండు టీంలు చ‌క్క‌ని ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తాయి అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.   టైటిల్ వేట కోసం న్యూజిలాండ్ , ఆసీస్ రెడీ అ య్యాయి. ఇరు జట్ల బలాలు చేస్తే కప్ కొట్టేంది ఎవరో ఊహించడం కష్టమే.  ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ కొంత మంది ఆటగాళ్లు మాత్రం కీలకం కానున్నారు.  ముఖ్యంగా ఈ రోజు మ్యాచ్‌లో కీల‌క పాత్ర పోషించే టాప్ 5 ఆట‌గాళ్ల గురించి తెలుసుకొందాం.

    డేవిడ్ వార్నర్: ప‌్ర‌త్య‌ర్థి జ‌ట్టు వార్నర్‌తో క‌చ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తి. స్పిన్నర్లను చాకచక్యంగా ఆడ‌టం వార్న‌ర్‌కు మంచ అనుభ‌వం ఉంది. ఈ విష‌యం పాకిస్థాన్ మ్యాచ్‌లో రుజువైంది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి లెగ్ ఎన్‌కౌంటర్‌లో అతను తన అత్యధిక స్కోరు 89*తో సరైన సమయంలో ఫామ్ లోకి వ‌చ్చాడు. అంతేకాకుండా, ఫీల్డింగ్ విష‌యంలో మెరుగ్గా రాణించ‌గ‌ల‌డు.

    గ్లెన్ మాక్స్‌వెల్: ఈ సీజ‌న్‌లో మాక్స్‌వెల్ స‌రిగా రాణించ‌లేదు అనేది వాస్త‌వం. 6 మ్యాచ్‌ల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. కానీ క‌చ్చితంగా మ్యాచ్‌ను మ‌లుపు తిప్పే ఆట‌గాళ్ల‌లో ఇత‌ను ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఒక్క మంచి సిక్స్ చాలు మాక్స్‌వెల్ ఫాంలోకి రావ‌డానికి అని క్రికెట్ ఎక్స్‌ప‌ర్ట్ చెబుతున్నారు. ఇష్ సోధి మరియు మిచెల్ సాంట్నర్ వంటి వారిపై అతను కీల‌క‌మైన ఆట ఆడ‌గ‌ల‌డు.

    T20 WorldCup: టైటిల్ కు అడుగు దూరంలో ఆసీస్-కివీస్.. కప్ కొట్టేది ఎవరంటే..?


    ఆడమ్ జంపా: ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క ఆట‌గాడు ఆడమ్ జంపా. ఈ సీజ‌న్‌లో 5.69 ఎకాన‌మితో 12 వికెట్లు తీసాడు. టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికా, శ్రీలంకపై వరుసగా 2/21 - 2/12తో రాణించాడు. మెరుగైన బౌలింగ్‌తో ప‌రుగులు క‌ట్ట‌డి చేయ‌డంతో పాటు కీల‌క స‌మ‌యాల్లో వికెట్ తీయ‌డం ఆడమ్ జంపా ప్ర‌త్యేక‌త. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో కీల‌క‌మైన మలుపును మ‌నం ఆశించ‌వ‌చ్చు.

    డారిల్ మిచెల్: ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాట‌ర్ చెల‌రేగిపోయాడు. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలండ్ విజ‌యంలో డారిల్ మిచెల్ కీల‌కం కానున్నాడు. కానీ స్పీన్ బౌలింగ్ ఆడ‌డంలో కాస్త విఫ‌లం అవుతున్నాడు. అయితే స్పిన్న‌ర్ల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డితే అధిక ప‌రుగులు సాధించ‌గ‌లుగుతాడు. ఎక్కువ‌గా సింగిల్స్ తీస్తూ ప్ర‌త్య‌ర్థిని ఇరుకున పెట్ట‌డం మిచెల్ ప్ర‌త్యేక‌త‌.

    ఇష్ సోధి: వేగంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు రాబ‌ట్ట‌డంలో ఇష్ సోధి ప్ర‌తిభావంతుడు. ఈ టోర్న‌మెంట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 9 వికెట్లు తీశాడు. ఈ రోజు జ‌రిగే మ్యాచ్‌లో ఇంగ్ల‌డ్ బౌలింగ్‌కు ఇష్ సోధి ప్ర‌ధాన అస్త్రం. ఈ ఫార్మెట్‌లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌డానికి అత‌నికి ఇది మంచి అవ‌కాశం.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు