ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది. ర్యాంకింగ్ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(New Zealand), అఫ్గానిస్తాన్(Afghanistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. ఇక, హాట్ ఫేవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్ టీమ్ బలబలాలుపై ఓ లుక్కేద్దాం.
వరల్డ్ కప్ టైటిళ్లు నెగ్గడం వీరి వల్ల కాదంటూ వచ్చిన విమర్శలకు సరియైన సమాధానం చెబుతూ 2010లో ఇంగ్లండ్ టైటిల్‌ను నెగ్గింది. ఇక, 2019 వన్డే వరల్డ్ కప్ ను కూడా నెగ్గింది ఇంగ్లండ్. ప్రస్తుతం ఉన్న జట్లలో లిమిటెట్ క్రికెట్ లో విధ్వంసకరంగా మారింది ఇంగ్లీష్ టీమ్. ఈ టీ -20 వరల్డ్ కప్ లో కూడా హాట్ ఫేవరట్లు గా బరిలోకి దిగుతున్నారు.టీ20 ప్రపంచకప్ 2021 ఇంగ్లండ్ జట్టును ఇయాన్ మోర్గాన్ ముందుండి నడిపించనున్నాడు. అందరూ ఊహించిన విధంగానే ఈసీబీ ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. మానసిక సమస్యలతో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్ లాంటి స్టార్లు ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యారు. వీరు మినహా రెగ్యులర్‌గా టీ20ల్లో ఆడే ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఈ ముగ్గరు మెగా టోర్నీకి దూరమయినా.. ఇంగ్లండ్ పటిష్టంగానే ఉంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు ఈసారి కప్ కొడుతుందని అందరూ అంటున్నారు. ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టోలతో బ్యాటింగ్ విభాగం.. క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే, ప్రాక్టీస్ మ్యాచ్ లో లివింగ్ స్టోన్ కు గాయమైంది. దీంతో ఫస్ట్ కొన్ని మ్యాచ్ లకు అతను అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇది కూడా చదవండి : ఇండియా- పాక్ మ్యాచ్ జరుగుతుందా.. ఫ్యాన్స్‌కు బీసీసీఐ క్లారీటి!
మొయిన్ అలీ, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్‌లు కూడా ఇంగ్లండ్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోయినా.. ఆ ప్రభావం ఇంగ్లీష్ జట్టుపై ఎక్కడా పడే అవకాశం లేదు.
ఇంగ్లండ్ షెడ్యూల్ :
మ్యాచ్ నెం | డేట్ | మ్యాచ్ | టైం | వెన్యూ | స్టేజ్ |
1 | అక్టోబరు 23 | ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ | 07:30 | అబుదాబి | సూపర్ 12 |
2 | అక్టోబరు 27 | ఇంగ్లండ్ వర్సెస్ B2 | 03:30 | అబుదాబి | సూపర్ 12 |
3 | అక్టోబరు 30 | ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా | 07:30 | దుబాయ్ | సూపర్ 12 |
4 | నవంబరు 1 | ఇంగ్లండ్ వర్సెస్ A1 | 07:30 | షార్జా | సూపర్ 12 |
5 | నవంబరు 6 | ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా | 07:30 | షార్జా | సూపర్ 12 |
ఇంగ్లండ్ కీలక ఆటగాళ్లు : జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్
బెస్ట్ ప్రదర్శన : 2010 ఛాంపియన్లు
ఇంగ్లండ్ జట్టు : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, T20 World Cup 2021